అన్వేషించండి

Krishna Mukunda Murari August 19th: ఎవరూ ఊహించని ట్విస్ట్ - తెలిసిన ఆదర్శ్ ఆచూకీ, ముకుందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న భవానీ

ఆదర్శ్ వెళ్లిపోవడానికి కారణం భవానీకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మురారీ కృష్ణకి ఫోన్ చేస్తాడు కానీ వర్క్ లో ఉండి గమనించుకోదు. దీంతో తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చాలా బాధపడతాడు. తర్వాత ఎప్పటికో ఫోన్ చూస్తుంది. ఏంటి ఇన్ని సార్లు కాల్ చేశారనుకుని తిరిగి కాల్ బ్యాక్ చేస్తుంది. ఇద్దరూ ఒకేసారి ఒకరికొకరు ఫోన్స్ చేసుకోవడంతో బిజీ అని వస్తుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు ఎందుకు డిస్ట్రబ్ చేయడం అనుకుంటాడు. అప్పుడే కమిషనర్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండగా కృష్ణ చేస్తుంది. కాల్ వేయింటింగ్ రావడంతో కృష్ణ ఫోన్ పెట్టేస్తుంది. క్యాంప్ కి వెళ్ళాలి రెడీగా ఉండమని కమిషనర్ చెప్తే వెళ్లేందుకు తను సిద్ధంగా లేనని చెప్తాడు. బాధగా ఇంటికి వచ్చి కృష్ణకి బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తన సంతోషం తలుచుకుని బాధపడతాడు.

భవానీ ఆదర్శ్ ఫోటో చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఎక్కడ ఉన్నావ్, నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటావని అనుకుంటున్నా. మీ నాన్న లేకపోయినా నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాను. ఒక్కసారి కూడా నన్ను చూడాలని అనిపించడం లేదా? ఎందుకు ఇలా మారిపోయావ్? ఎందుకు ఇంటికి రావడం లేదు నువ్వు? ఇన్నాళ్లలో ఈ అమ్మ ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? నీకేమైనదో తెలియక నువ్వు ఇంటికి ఎందుకు రావడం లేదో తెలియక ఏదోలా ఉందని బాధపడుతుంది. అప్పుడే మేజర్ కల్నల్ ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తాడు.

భవానీ: ముందు బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పండి

Also Read: రాజ్ ఉగ్రరూపం, అర్థరాత్రి వర్షంలో ఇంటి బయట కావ్య- సంబరపడుతున్న రుద్రాణి బ్యాచ్

కల్నల్: ఆదర్శ్ కి మీ ఇంటికి రావడం తన ఆచూకీ తెలియజేయడం ఇష్టం లేదు. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది. ఇన్నాళ్లుగా తను అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు. కావాలనే తన ఆర్మీకి తెలియనివ్వలేదు. తను ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడ నార్మల్ గా ఉండి ఉంటే తన ఆచూకీ మాకు తెలిసేది కాదు. యుద్దం అనివార్యమని తెలిసి తనకు తానుగా యుద్ధానికి సిద్ధమై కాంటాక్ట్ అయ్యాడు  

భవానీ: థాంక్యూ.. ఇన్నాళ్ళూ మీరు ఆదర్శ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనుకున్నాను

కల్నల్: టెన్షన్ పడొద్దు ఇక నుంచి ఆదర్శ్ మాతోనే ఉంటాడు

కొడుకు క్షేమంగా ఉండటంతో భవానీ సంతోషపడుతుంది. అప్పుడే ఆదర్శ్ గురించి శ్రీనివాసరావు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. కావాలనే వాడు ఇంటికి రాకుండ ఉంటున్నాడు. అంటే శ్రీనివాస్ చెప్పింది నిజమా అని ఆలోచిస్తూ ముకుంద అని గట్టిగా పిలుస్తుంది. ఆ అరుపుతో ఇంట్లో అందరూ తన దగ్గరకి వస్తారు. కృష్ణ బయటకి వెళ్ళడానికి కారణం ముకుంద అని తెలిసిపోయిందేమోనని అలేఖ్య అంటుంది. ముకుంద ఏదో తప్పు చేసి ఉంటుందని నందు, గౌతమ్ అనుకుంటారు. ముకుంద, రేవతి తప్ప ఎవరు ఉండటానికి వీల్లేదని భవానీ ఆర్డర్ వేస్తుంది. దీంతో అందరూ వెళ్లిపోతారు.

భవానీ: పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అడిగిన దానికి సమాధానం చెప్పు

ముకుంద: సడెన్ గా ఈ డౌట్ ఎందుకు వచ్చింది? రేవతి అత్తయ్య చెప్పి ఉండదు అని మనసులో అనుకుంటుంది.  

రేవతి: ఇన్నాళ్ళూ అడగనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు

ముకుంద: అవును అత్తయ్య నేను ఒకతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను

భవానీ: నీ ప్రేమ విషయం ఆదర్శ్ కి చెప్పావా?

ముకుంద: లేదు మా ఇద్దరి మధ్య దీని గురించి మాట్లాడే సందర్భం రాలేదు

Also Read: నందుని ఇరికించిన లక్కీ, అపార్థం చేసుకున్న తులసి- ఇంటి తాళాలు దివ్య చేతికి

భవానీ: నువ్వు ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నావా? నిజం ఎక్కడ బయట పడుతుందోనని రేవతి భయపడుతుంది. అంటే ముకుంద లవ్ మ్యాటర్ తెలిసి ఆదర్శ్ ఇంటికి రాలేదని అర్థం చేసుకుంటుంది. పైకి మాత్రం అడిగేది నిన్నే సమాధానం చెప్పు. నీ మౌనమే అంగీకారం అయితే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో. ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకు

ముకుంద: నేను అతన్ని ప్రాణపదంగా ప్రేమించింది నిజమే కానీ పెళ్లి తర్వాత నా ప్రేమని మనసులోనే సమాధి చేసుకున్నా అని భవానీ  కాళ్ళ మీద పడుతుంది

భవానీ: నీ ప్రేమ నా కొడుకుని నాకు దూరం చేసింది

మీరు నిజం తెలుసుకుంటేనే నా ప్రేమ నిలబడుతుందేమోనని ముకుంద మనసులో అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్లో..

రేవతి, మురారీతో భవానీ మాట్లాడుతుంది. ముకుంద ప్రేమించింది ఎవరో తెలుసుకుని నువ్వే నాకు చెప్పు మురారీ. ఆదర్శ్ తో విడాకులు ఇప్పించి తను ప్రేమించిన వాడితో తన పెళ్లి జరిపిద్దామని చెప్పడంతో మురారీ వాళ్ళు షాక్ అవుతారు. ముకుంద మాత్రం సంతోషపడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget