News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gruhalakshmi August 18th: 'గృహలక్ష్మి' సీరియల్: నందుని ఇరికించిన లక్కీ, అపార్థం చేసుకున్న తులసి- ఇంటి తాళాలు దివ్య చేతికి

దివ్య చేతికి రాజ్యలక్ష్మి ఇంటి పగ్గాలు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

నందుకి దగ్గర అయ్యేందుకు లాస్య కొడుకుతో కలిసి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఇక హాస్పిటల్ లో సంజయ్ ఆగడాలు కట్టించేందుకు దివ్య రంగంలోకి దిగుతుంది. పేషెంట్స్ బిల్ వ్యవహారం దివ్యని చూసుకోమని విక్రమ్ చెప్తాడు. దీంతో సంజయ్ షాక్ అవుతాడు. లాస్య పోలీసులని తీసుకుని తులసి ఇంటికి వస్తుంది. తన కొడుకుని కిడ్నాప్ చేసింది ఈ ఇంటి వాళ్ళేనని పోలీసులకి చెప్తుంది.

తులసి: కిడ్నాప్ ఏంటి? లక్కీ ఇంట్లో నుంచి పారిపోయాడని నువ్వే కదా కాల్ చేసి చెప్పావ్

లాస్య: నేను మోసపోయాను చేసిన తప్పు ఒప్పుకుని నా లక్కీని నాకు ఇచ్చెయ్యండి. మీ జోలికి రాను కంప్లైంట్ కూడా వెనక్కి తీసుకుంటాను

నందు: ఈవిడ మాటలు నమ్మి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు

పోలీస్: మీరు లక్కీని కిడ్నాప్ చేయలేదా?

తులసి: మాకు లక్కీ అంటే ఇష్టం వాడిని మేము ఎందుకు కిడ్నాప్ చేస్తాం

లాస్య: మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. ఇల్లంతా వెతకండి. బాబు ఇంట్లో లేకపోతే తప్పు అయ్యిందని వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. వీళ్ళ జోలికి కూడా రాను

తులసి: అందుకు మేము కూడ సిద్దం. మీ పని మీరు చేయండి అనగానే లక్కీ నిద్రలేచి కిందకి వస్తాడు. తనని ఇంట్లో చూసి అందరూ షాక్ అవుతారు.

లక్కీ: ఏంటి డాడీ ఇదంతా అని భయంగా అడుగుతాడు

లాస్య: ఇతనే నా బాబు చూశారా? వీళ్ళంతా ఎలా అబద్ధాలు చెప్పారో

ఎస్సై: మీకు తెలియకుండా మీ ఇంట్లోకి ఎలా వస్తాడు చాలు ఆపండి. లక్కీ నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?

లక్కీ: నందు వైపు వేలు పెట్టి చూపిస్తాడు.

లాస్య: మీరు నాతో అబద్ధం చెప్పారు. వాడు నీకోసం డాడీ అని కలవరిస్తున్నాడు. వాడి మీద నీకు ప్రేమ ఉంటే నాతో చెప్పి ఉండాలి కదా నేనే తీసుకొచ్చే వాడిని. ఎస్సై గారు క్షమించండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మేము మేము చూసుకుంటాం, మీరు వెళ్లిపోండి. మీరు నన్ను శత్రువులుగా చూసినా నాకు మీ మీద ప్రేమ ఉందో. ఇంకా నా మనసు నీకు అర్థం కావడం లేదా?

నందు: ఇంకోసారి కిడ్నాప్ అంటే నాలుక చీరేస్తా

లాస్య: నువ్వు అయినా నందుకి నచ్చజెప్పు తులసి

నందు: నాకు ప్రేమ ఉండి తీసుకొస్తే వాడిని అప్పగించే వాడిని కాదు. కానీ తీసుకెళ్ళిపో వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లు

లక్కీ: డాడీ మమ్మీ నిజంగా నన్ను తీసుకెళ్తుంది

లాస్య: వాడి మీద ప్రేమతో నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు పంపించేస్తే ఎలా. రాత్రి నిద్రలో కూడా నిన్నే కలవరిస్తున్నాడు

లక్కీ: నేను రాను డాడీ దగ్గరే ఉంటాను. డాడీకి నేనంటే చాలా ఇష్టం. అది నాకు బాగా తెలుసు

నందు: ఎవరు చెప్పారు నీకు మీ అమ్మ చెప్పిందా?

లక్కీ వాడిని బలవంతంగా తీసుకెళ్లబోతుంటే తులసి ఆపి నెమ్మదిగా నచ్చజెప్పి పంపిస్తానని అంటుంది. తులసి కూడా నందుని అపార్థం చేసుకుంటుంది. లక్కీని నందు తీసుకొచ్చాడని తిడుతుంది. వాడు అబద్ధం చెప్తున్నాడని అంటే.. చిన్నపిల్లలు అబద్ధం చెప్పరని అంటుంది. ఇంట్లో అందరూ కూడా నందునే లక్కీని తీసుకొచ్చాడని అనుకుని చీదరించుకుంటారు.

రాజ్యలక్ష్మి కాలు నొప్పితో బాధపడుతుంటే ప్రియ వచ్చి దివ్య అక్క ట్యాబ్లెట్ ఇచ్చిందని చెప్పి ఇస్తుంది. అప్పుడే సంజయ్ ఇంటికి వస్తాడు. హాస్పిటల్ లో నీకు కూడా గిల్లుడు మొదలైందా అని బసవయ్య సెటైర్ వేస్తాడు. ఏం జరిగిందని రాజ్యలక్ష్మి అడుగుతుంది. హాస్పిటల్ మొత్తం నీ పెద్ద కొడుకు, కోడలు తీసుకున్నారు. నన్ను పట్టించుకోవడం లేదని సంజయ్ రగిలిపోతాడు. దివ్య కావాలని నా పవర్స్ మొత్తం లాగేసుకుందని చిందులు తొక్కుతాడు.

బసవయ్య: నువ్వు ఇలా కుంటి గుర్రంలాగా పడి ఉంటే నేను పార్టీ మారాల్సి వస్తుంది

రాజ్యలక్ష్మి; కాస్త డల్ అయ్యేసరికి తమ్ముడు కూడా ఎదురుతిరుగుతున్నాడు

నందు తండ్రి దగ్గరకి వచ్చి నచ్చజెప్పడానికి చూస్తాడు.

పరంధామయ్య: ఎవరైతే అపార్థం చేసుకోవాలో వాళ్ళే అర్థం చేసుకోలేదు. నీ బతుకు మారదు. తులసిని మర్చిపో.. తనకి దగ్గర అవడం నీవల్ల కాదు. సలహాల కోసం నా దగ్గరకి రావొద్దు. నీతో కలిసి నన్ను చూస్తే నాతో మాట్లాడటం మానేస్తుంది. నీ మైండ్ లో ఏం పురుగు తొలిచింది లాస్య కొడుకుని తీసుకొచ్చుకున్నావ్ .

నందు: చిన్న పిల్లాడు అబద్ధం చెప్పడా ఏంటి? వాడి మాటలు ఎందుకు నమ్ముతున్నారు అందరూ

విక్రమ్, దివ్య ఇంటికి వస్తారు. రాజ్యలక్ష్మి పలకరించి కాలు నొప్పి ఎలా ఉందని అడుగుతాడు. పరవాలేదు రేపటి నుంచి హాస్పిటల్ కి వెళ్తానని అంటుంది. ఇంట్లో ఉంటే అక్కకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని బసవయ్య అంటాడు.

దివ్య: అలాంటి ఆలోచనలు రాకుండా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవ్వమంటారా?

విక్రమ్: అవసరం లేదు నేను కష్టపడుతున్నా అని అమ్మ బాధ

రాజ్యలక్ష్మి: అవును నాన్న నిజమే

ప్రసన్న: కావాలంటే నేను నీతో వస్తాను వదిన

ప్రకాశం: రాజ్యం నువ్వు ఒకటి గమనించావా?హాస్పిటల్  పనులు మొదలుపెట్టాక విక్రమ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

విక్రమ్: అవునమ్మా పైగా దివ్య నా పక్కన కూడా ఉంది కదా పని చేయడం నాకు ఏ ఇబ్బంది లేదు. నాలుగు రోజులు కాదు నెల రోజులు రెస్ట్ తీసుకో

ప్రకాశం: బీరువాలో నుంచి డబ్బు కావాలంటే ఎవరు చూస్తున్నారు

బసవయ్య: అది నా దగ్గర ఉంటున్నాయి. వాటిని మోయడం నాకేం బరువు కాదు 

ప్రకాశం: నీకు తెలియదు తాళాల గుత్తి ఆడవాళ్ళకి అందం. అది ఇలా ఇవ్వు. వాటిని పెద్ద కోడలు చేతికి ఇవ్వు

రాజ్యలక్ష్మి: డైవర్స్ విషయం తేలిన తర్వాత ఇవ్వాల్సింది ఇప్పుడు కాదు  

Published at : 18 Aug 2023 11:49 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial August 18th Update

ఇవి కూడా చూడండి

Jagadhatri December 9th Episode: సూరిని చూసి షాకైన సుధాకర్.. పోలీసులు మాధురిని అరెస్టు చేస్తారా?

Jagadhatri December 9th Episode: సూరిని చూసి షాకైన సుధాకర్.. పోలీసులు మాధురిని అరెస్టు చేస్తారా?

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

Gautham Krishna: శుభశ్రీని కలిసిన ‘బిగ్ బాస్’ గౌతమ్ - పెళ్లిపై క్లారిటీ!

Gautham Krishna: శుభశ్రీని కలిసిన ‘బిగ్ బాస్’ గౌతమ్ - పెళ్లిపై క్లారిటీ!

Prema Entha Madhuram December 9th Episode - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అయోమయంలో పడిపోయిన యాదగిరి - దివ్య భర్తని ఎరగావేసిన ఛాయాదేవి!

Prema Entha Madhuram December 9th Episode - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అయోమయంలో పడిపోయిన యాదగిరి - దివ్య భర్తని ఎరగావేసిన ఛాయాదేవి!

టాప్ స్టోరీస్

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?

Telangana Assembly :  15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?