Guppedanta Manasu August 18th: ఐ లవ్ రిషి అని చెప్పేసిన ఏంజెల్, షాక్ లో వసు - రిషి రియాక్షన్ ఏంటంటే!
Guppedantha Manasu August 18th: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.
![Guppedanta Manasu August 18th: ఐ లవ్ రిషి అని చెప్పేసిన ఏంజెల్, షాక్ లో వసు - రిషి రియాక్షన్ ఏంటంటే! Guppedanta Manasu Serial August 18th Episode 845 Written Update Today Episode, know in telugu Guppedanta Manasu August 18th: ఐ లవ్ రిషి అని చెప్పేసిన ఏంజెల్, షాక్ లో వసు - రిషి రియాక్షన్ ఏంటంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/2a19bb2187e184b995a52175cb27a2b61692325974020217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుప్పెడంతమనసు ఆగష్టు 18 ఎపిసోడ్ (Guppedanta Manasu August 18th Written Update)
పెళ్లి గురించి అడిగిన విశ్వనాథంతో త్వరలోనే చెప్తాను అని రిషిని తలుచుకుని తనలో తానే మురిసిపోతుంది ఏంజెల్. ఆ తర్వాత రిషి దగ్గరకు వెళ్లి పెళ్లి, ప్రేమ గురించి ముచ్చట్లు పెడుతుంది. అసలు ప్రేమ అంటే ఏంటని అడుగుతుంది. రిషి వెంటనే వసు ఊహల్లోకి వెళ్లిపోతాడు..
రిషి: ఓ బంధం నిలబడాలంటే ప్రేమ ఉండాలి. కోపం , పంతం ఏం ఉన్నా ఓ మనిషికి ఒకరిపై ప్రేమ పుడుతుంది, ఆ ప్రేమ నమ్మకం అనే పునాదిపై ఉంటుంది..నమ్మకం లేనిచోట ప్రేమ నిలబడదు..ప్రేమలేనిచోట ఏ బంధం నిలబడదు.. ఫ్రెండ్ లా ఉండాలి, తండ్రిలా వెన్నంటే ఉండాలి, అధికారం చెలాయించాలి, తల్లిలా కల్మషం లేని మనసు ఉండాలి నా దృష్టిలో ప్రేమంటే ఇదే ఏంజెల్...
ఏంజెల్: అన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్లు ఉంటారా
రిషి: ఓ మనిషిపై ప్రేమ కలిగినప్పుడు మనసు మనమాట వినదు..పలు పలు విధాలుగా ఆలోచిస్తుంటుంది. ( వసుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని ఇంట్లో చెప్పిన విషయాలు గుర్తుచేసుకుంటాడు). వాళ్లని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటారు, వాళ్లకు బాధ వస్తే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయి
ఏంజెల్: ఇంత ఏమోషనల్ గా చెబుతున్నావ్ నువ్వు ఎవరినైనా ప్రేమించావా...అడుగుతుంటే చెప్పవేం...నీకు ప్రేమ అంటే ఇష్టం లేదా రియాక్టవడం ఇష్టం లేదా..
రిషి: కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగా మిగిలిపోతాయి
ఏంజెల్: వసు-నువ్వు ఎక్కువగా మాట్లాడుకోపోయినా ఇద్దరూ కేర్ తీసుకుంటారు, ఇద్దరూ ఒకేలా మాట్లాడుకుంటారు..నీకు ఎప్పుడైనా వసుపై లవ్ ఫీలింగ్ కలిగిందా
రిషి: ప్లీజ్...
ఏంజెల్: నీ మనసులో ప్రేమ లేదు..జీవితంలో ఎలాంటి చేదు అనుభవాలు లేవు అంతేనా..
రిషి: నేను ఇలా ఉండడమే ఇష్టపడతాను, ఈ ఒంటరితనమే బావుంటుంది..నాకు ఏం కావాలో వద్దో నాకు తెలుసు..ఈ విషయంలో నన్ను డిస్ట్రబ్ చేయొద్దు..ఈ ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకో. విశ్వనాథం సార్ చెప్పినట్టు ఓ మంచి అబ్బాయిని చూసుకో, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నేను తనతో మాట్లాడుతాను, తనని ఒప్పించి నీతో పెళ్లి జరిపిస్తాను...బట్ ఇంకెప్పుడూ నా ప్రేమ గురించి అడగొద్దు..
ఏంజెల్: అసలు రిషి మనసులో ఏముంది..ఒంటరిగా ఉండడం ఇష్టపడుతున్నాడా...ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచనలో పడుతుంది..
Also Read: దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా, 'గుప్పెడంతమనసు'లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ!
వసుధార కాలేజీకి బయలుదేరుతుంటుంది...ఇంతలో ఏంజెల్ వస్తుంది. ఏంటిప్పుడు వచ్చావ్ ఎప్పుడూ ఈవెనింగ్ కలుస్తాం కదా అంటుంది. సరే నీకు అర్జెంట్ ఖాళీ ఉంటే వెళ్లు అంటుంది ఏంజెల్. పర్వాలేదు కూర్చో నువ్వు ఈ టైమ్ లో వచ్చావంటే ఏదో ముఖ్యమైన విషయమే అంటుంది.
వసు: ఏ పనిపై వచ్చావు
ఏంజెల్: నువ్వు సహాయం చేయాలి
వసు: నువ్వు అడగాలే కానీ ఏ సహాయం అయినా చేస్తాను
ఏంజెల్: ప్రేమ గురించి చాలా చెప్పావు కదా..వాటన్నింటి బట్టి ఓ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. విశ్వం కూడా నేను సెలెక్ట్ చేసుకున్న అబ్బాయిని ఓకే చేస్తానన్నాడు . అసలు పెళ్లి అనే ఆలోచన మనసులో ఉన్నంతవరకూ నిద్రపట్టడం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను
వసు: మనం రిలాక్స్ గా మాట్లాడుకుందాం కానీ టీ కాఫీ తీసుకొచ్చాను
ఏంజెల్: నాకు ఏమీ వద్దు..
వసు: నేను చెప్పిన పాయింట్ బట్టి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావా..అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలనే కండిషన్స్ ఉన్నాయా
ఏంజెల్: నన్ను నన్నుగా ఇష్టపడితే చాలు...నన్ను మనిషిలా చూడాలి. అమ్మాయి వంట ఇంటికే పరిమితం చేయాలని, తక్కువ చేసేవారు ఉంటారు
వసు: నువ్వు చెప్పింది నిజమే అంటూ రిషి ఊహల్లోకి వెళ్లిపోతుంది
ఏంజెల్: అలాంటి అరుదైన వ్యక్తినే నేను సెలెక్ట్ చేసుకున్నాను..ఎప్పటి నుంచో తను నా మనసులో ఉన్నాడు నేనో నిర్ణయానికి వచ్చింది మాత్రం రాత్రి నీతో మాట్లాడిన తర్వాతే. అయితే అతని విషయంలోనే నాకు సహాయం కావాలి
వసు: కానీ తన విషయంలో నేనేం చేయగలను..ఏమీ అర్థం కావడం లేదు..సరే ఇంతకీ ఎవరు
ఏంజెల్: తన మనసేంటో తెలుసుకోవాలి..ఎవరో గెస్ చేయి అని కాసేపు టైమ్ ఇస్తుంది. ఇలా ఉంటాడు, అలా ఉంటాడంటూ గొప్పగా చెప్పి చెప్పి ...రిషి పేరు చెబుతుంది.
వసుధార షాక్ అయి అలాగే ఉండిపోతుంది....
Also Read: రిషి దొంగచూపులు - వసు కొంటె సమాధానాలు, మేడం సార్ ప్రేమ ముచ్చట్లు!
ఏంజెల్: నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ రిషిలో ఉన్నాయి..తనని పక్కనపెట్టుకుని వేరే అబ్బాయి గురించి ఆలోచిస్తారా ఎవరైనా..నువ్వు కచ్చితంగా మా ఇంటికి వచ్చి రిషితో మాట్లాడాలి, తన మనసులో ఏముందో నువ్వే తెలుసుకోవాలి అంటూ వసువైపు తిరిగి చూస్తుంది. ఏంటి సైలెంట్ అయిపోయావు..ఈ విషయం విశ్వంకి చెబితే సంతోషిస్తాడు..రిషిని అయితే విశ్వం కళ్లుమూసుకుని పెళ్లిచేసుకోమంటాడు.. అయినా రిషి కన్నా బెస్ట్ ఎవరుంటారు. వసుధారా..రిషి మనసులో ఎవరైనా ఉన్నారా, తన దగ్గర ప్రేమ పెళ్లి టాపిక్ తెస్తే ఏమీ వద్దంటున్నాడు... అసలు ఎందుకలా మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావడం లేదంటూ గలగలా చెప్పుకుంటూ వెళ్లిపోతుంది. నువ్వు నాకు ఈ సహాయం చేయి వసుధారా అని చేతులు పట్టుకుని అడుగుతుంది. సరే వెళ్లొస్తాను...సాయంత్రం తప్పకుండా రావాలి అని చెప్పేసి వెళ్లిపోతుంది...
ఏంజెల్ మాటలు తలుచుకుని వసుధార కుప్పకూలిపోతుంది....
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)