అన్వేషించండి

Guppedanta Manasu August 16th: రిషి దొంగచూపులు - వసు కొంటె సమాధానాలు, మేడం సార్ ప్రేమ ముచ్చట్లు!

Guppedantha Manasu August 16th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు

గుప్పెడంతమనసు ఆగష్టు 16 ఎపిసోడ్ (Guppedanta Manasu August 16th Written Update)

ఏంజెల్ బాధగా కూర్చోవడం చూసి రిషి ఓదార్చుతాడు. మీ తాతయ్యని నేను చూసుకుంటానంటూ భరోసా ఇస్తాడు. ఆ తర్వాత రిషి వెళ్లిపోయాక వసుధార కాల్ చేస్తుంది
వసు: ఏం ఆలోచించావు మీ తాతయ్య చెప్పినదానిగురించి.. అదే పెళ్లి గురించి అంటుంది
ఏంజెల్: అసలు ఇప్పటివరకూ పెళ్లి అనే ఆలోచనే రాలేదు.. 
వసు: చూడగానే బాగా తెలిసిన మనిషి అనిపించాలి, అర్థం చేసుకుంటాడనే ఫీలింగ్ రావాలి అంటూ ఏవేవో చెబుతుంది
ఆలోచిస్తాలే సరే అని కాల్ కట్ చేసిన ఏంజెల్.. ఆ తర్వాత తన తాతయ్య విశ్వం దగ్గరకు వెళ్లి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. విశ్వం కూడా పెళ్లి గురించే మాట్లాడుతాడు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తనని ఒప్పించి పెళ్లిచేస్తానని మాటిస్తాడు. ఆలోచిస్తాను విశ్వం అనేసి బయటకు వెళ్లిపోతుంది..అప్పుడే లోపలకు వస్తాడు రిషి. ఏంజెల్ పెళ్లి విషయంలో ఫస్ట్ టైమ్ పాజిటివ్ గా రియాక్టైంది సంతోషంగా ఉందంటాడు విశ్వం. తన మనసులో ఎవరో ఉండే ఉంటారు..నువ్వు క్లోజ్ ఫ్రెండ్ వి కదా ఆ విషయం తెలుసుకుంటావా, తన పెళ్లి తొందరగా చేయాలి అని రిషిని రిక్వెస్ట్ చేస్తాడు. ( ఈ విషయం వసుధారకి చెప్పి తనద్వారా తెలుసుకోవాలి అనుకుంటాడు). సరే అని మాటిస్తాడు రిషి. ఏదైనా అవసరం ఉంటే పిలవండి అనేసి వెళ్లిపోతాడు..

Also Read: DBST కాలేజీలోకి రిషి రీఎంట్రీ ఫిక్స్, శైలేంద్రకి జగతి-మహేంద్ర వార్నింగ్!

పాండ్యన్ బ్యాచ్ అంతా రిషి చెప్పిన పనిలో బిజీగా ఉంటారు.. సపోర్ట్ స్టూడెంట్స్ అని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇదంతా రిషికి పంపిస్తారు. అది చూసి హ్యాపీగా పీలైన రిషి పాండ్యన్ కి కాల్ చేసి అభినందిస్తాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తాడు. ఆ తర్వాత ఏంజెల్ పెళ్లి గురించి వసుధారతో మాట్లాడాలని ఫిక్సవుతాడు. మర్నాడు ఉదయం కాలేజీకి వెళ్లిన రిషి.. వసు క్లాస్ ముందు చక్కర్లు కొడుతుంటాడు. అది గమనించిన వసుధార ..రిషి సార్ ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారో అని ఆలోచనలో పడుతుంది. క్లాస్ అయ్యాక కలవండి మేడం  అని రిషి మెసేజ్ ఇస్తే..మీరు ఇంతకు ముందు ఎందుకు తొంగి చూశారని అడుగుతుంది. లేదంటూ ఇద్దరూ కాసేపు ఫన్నీగా డిస్కషన్ చేసుకుంటారు. సరే చూశాను మేడం అయితే ఏంటి అని రిప్లై ఇస్తాడు. ఎందుకు చూశారు, ఎవరికో సైట్ కొడుతున్నట్టు చూశారని కొంటెగా మెసేజ్ ఇస్తుంది. నాకు సైట్ కొట్టే అలవాటు, కన్నుకొట్టే అలవాటు లేదని రిప్లై ఇస్తాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటుంటే స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. వసుధార మాత్రం కావాలనే ఆటపట్టిస్తుంది..

Also Read: శైలేంద్ర ప్లాన్ సక్సెస్- డీబీఎస్టీ కాలేజ్ గురించి తప్పుడు ఆర్టికల్, తల్లడిల్లిపోయిన రిషి

కాలేజీ ముగిసిన త‌ర్వాత రిషి కోసం వెయిట్ చేస్తుంది వసుధార. ఇంతలో కారు ఆపిన రిషి ఏమీ మాట్లాడకుండా డోర్ తీస్తాడు.  వ‌సుధార కారులో కూర్చుంటుంది.
రిషి: ప్రేమ గురించి మాట్లాడ‌టానికి పిలిచాన‌ు
వసు: మన మ‌ధ్య ప్రేమ లేద‌ని చాలా సార్లు చెప్పిన మీరు ఇప్పుడు నాతో ఏం మాట్లాడాల‌ని అనుకుంటున్నార‌ు
రిషి: మ‌న ప్రేమ గురించి కాద‌ు ఏంజెల్ ప్రేమ గురించి మాట్లాడ‌టానికి పిలిచాన‌ు. ఏంజెల్‌ మ‌న‌సులో ఎవ‌రున్నారో... ఏముందో తెలుసుకోవాలి
వసు: మీరు కూడా ఏంజెల్ కు మంచి ఫ్రెండ్ క‌దా...ఆ విష‌యం మీరే తెలుసుకోవ‌చ్చుగా 
రిషి: నేను వేరేవాళ్ల‌తో ల‌వ్ గురించి మాట్లాడ‌లేన‌ు అలాంటివి మాట్లాడ‌టం  ఇబ్బందిగా అనిపిస్తుంది
వసు: నా ద‌గ్గ‌ర మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రేమ గురించి స్వేచ్ఛ‌గా మాట్లాడుతున్నారంటే న‌న్ను ప‌రాయి మ‌నిషిగా ట్రీట్ చేయ‌డం లేద‌ని, మ‌న మ‌ధ్య ఏదో స‌మ్‌థింగ్ స్పెష‌ల్ ఉంద‌ని అనుకోవ‌చ్చా 
రిషి: సీరియ‌స్ అయిన రిషి... చిన్న హెల్ప్ అడిగితే ప్ర‌శ్న‌ల‌తో విసిగిస్తూ పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నార‌ని కోప‌గించుకుంటాడు. నేను అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేద‌ని అంటాడు.
గుప్పెడంత మ‌న‌సు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Embed widget