Guppedanta Manasu August 17th: దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా, 'గుప్పెడంతమనసు'లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ!
Guppedantha Manasu August 17th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 17 ఎపిసోడ్ (Guppedanta Manasu August 17th Written Update)
రిషి-వసు ఇద్దరూ కార్లో వెళుతూ మాట్లాడుకుంటారు. ప్రేమ గురించి నేను మాట్లాడలేనని రిషి అనడంతో ఇదే అవకాశంగా వసు కాసేపు సెటైర్స్ వేస్తూ ఆడుకుంటుంది. సీరియస్ అయిన రిషి..ఇవన్నీ కాదు మేడం ఏంజెల్ తో మాట్లాడతారా లేదా అని రెట్టిస్తాడు. నో చెప్పేస్తుంది వసుధార. కారు ఆపండి సార్ అంటుంది
రిషి: ఎందుకు ఆపమన్నారు
వసు: నేను ఏంజెల్ తో ప్రేమ విషయం మాట్లాడను అన్నాకదా..ఎలాగూ మీరు కాపేసి దింపేసి వెళ్లిపోమంటారు అందుకే ముందే దిగిపోతా
రిషి: కోపం వస్తే కారు ఎక్కించుకుంటాను కానీ మధ్యలో దిగి వెళ్లిపోమని చెప్పను అంటాడు...ఉండండి ఇంటి దగ్గర దించేస్తానని వసుని దించేసి వెళ్లిపోతాడు
నైట్ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తూ రిషితో కలసి ఉన్న ఫొటో చూస్తూ మురిసిపోతుంటుంది వసుధార. అదే ఆలోచనలో ఆ ఫొటోని రిషికి సెండ్ చేస్తుంది
మరోవైపు రిషి కూడా ఆలోచనలో పడతాడు..ఇంతలో ఫోన్ కి మెసేజ్ రావడంతో వెళ్లి చూస్తాడు..అప్పడికే డిలీట్ చేస్తుంది. ఏంటబ్బా అనుకుంటూ ఏంజెల్ ద్వారా అడిగిద్దాం అని కిందకు వెళతాడు...
Also Read: రిషి దొంగచూపులు - వసు కొంటె సమాధానాలు, మేడం సార్ ప్రేమ ముచ్చట్లు!
అదే టైమ్ కి ఏంజెల్ కి కాల్ చేసిన వసుధార పెళ్లి గురించి మాట్లాడుతుంది
ఏంజెల్: అబ్బాయిలు అద్భుతం అంటూ నువ్వు చాలా చెప్పావు కానీ అసలు నువ్వు చెప్పినంత మంచి అబ్బాయిలున్నారా అసలు అది జరిగే పనా అంటుంది. మార్కెట్లో కొత్త ప్రొడక్ట్ వస్తే అందులో ప్లస్ లు ఎన్ని ఉంటాయో మైనస్ లు కూడా అన్నే ఉంటాయంటూ పెద్ద ఉదారహరణ చెబుతుంది
వసు: అందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు...కొందరు జెంటిల్మెన్లు కూడా ఉంటారు. వాళ్లు మన పక్కనే ఉంటారు కానీ మనమే గుర్తించం అంటుంది
అవునా అంటూ పక్కకు తిరిగి చూసిన ఏంజెల్ కి రిషి కనిపిస్తాడు..అలాగే చూస్తూ ఉండిపోతుంది...అటు వసు పిలుస్తున్నా కానీ పట్టించుకోదు..
రిషి కూడా అయినా వసు ఏం మెసేజ్ పెట్టిందో ఏంజెల్ తో ఎందుకు అడిగించాలి..నేనే వసుధారని అడుగుతానంటూ వెళ్లిపోతుంటాడు.. అప్పుడు పిలిచిన ఏంజెల్ ఏం కావాలని అడుగుతుంది..ఏమీ లేదని వెళ్లిపోతాడు.. ఏంజెల్ కి మాత్రం ఏదో క్లారిటీ వస్తుంది..
DBST కాలేజీ గురించి పేపర్లో నెగిటివ్ గా వచ్చిన వార్త గురించి బోర్డ్ మీటింగ్ పెడతాడు
ఫణీంద్ర: ఇదెవరో కావాలనే చేశారు..మన కాలేజీకి సంబంధించిన వారు మనకు బాగా తెలిసిన వాళ్లే ఇదంతా చేశారు
బోర్డు మెంబర్స్: మన కాలేజీకి సంబంధించిన వారు ఎందుకు చేస్తారు
ఫణీంద్ర: కాలేజీ వివరాలు ఇంత డీటేల్డ్ గా బయటకు వెళ్లాయంటే కాలేజీ వాళ్లు చేసిన పనే
మహేంద్ర: కచ్చితంగా శైలేంద్ర అయి ఉంటాడు..తను ఎంత దుర్మార్గుడో మీకు త్వరలోనే బయటపెడతాం అనుకుంటాడు
ఫణీంద్ర: దీని వెనుకున్నవాళ్లని పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నాను..నువ్వు ఏమనుకుంటున్నావ్ మహేంద్ర
మహేంద్ర: నీ ఇష్టం అన్నయ్యా...
జగతి: ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లు ఏదో ఒకరోజు బయటపడతారు..వాళ్ల గురించి టైమ్ వేస్ట్ చేయకుండా మన కాలేజీ స్ట్రెంగ్త్ పెంచుకుందాం. ఆ కన్నింగ్ ఫెలో కోసం మనం ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి అంటుంది..
ఇంతలో పాండ్యన్ బ్యాచ్ అక్కడకు వస్తారు....
Also Read: DBST కాలేజీలోకి రిషి రీఎంట్రీ ఫిక్స్, శైలేంద్రకి జగతి-మహేంద్ర వార్నింగ్!
మేం విష్ కాలేజీ స్టూడెంట్స్ అని పరిచయం చేసుకుంటారు... మీరు వచ్చిన పర్పస్ ఏంటని అడుగుతుంది జగతి..
పాండ్యన్: రీసెంట్ గా మీ కాలేజీ గురించి వచ్చిన న్యూస్ చూశాం..అది చూసి మేం, కాలేజీ స్టాఫ్ కూడా ఫీలయ్యారు.. ఈ కాలేజీలో చదవాలన్నది ప్రతి ఒక్కరి స్టూడెంట్ కల ఇలాంటి కాలేజీలో చదవాలని అనుకుంటారు.
రేణుక: అందుకే సపోర్ట్ స్టూడెంట్ స్కీమ్ కింద మీ కాలేజీలో స్టూడెంట్స్ ని జాయిన్ చేయాలి అనుకుంటున్నాం
జగతి: సపోర్ట్ స్టూడెంట్ స్కీమా....
పాండ్యన్: ఆ స్కీమ్ గురించి రిషి చెప్పిన ప్రతి విషయం వివరిస్తాడు పాండ్యన్... ( పాండ్యన్ మాట్లాడుతుంటే ఆ ప్లేస్ లో రిషి ఉన్నట్టు ఊహించుకుంటుంది జగతి). ప్రస్తుతానికి సపోర్ట్ స్టూడెంట్స్ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది..కానీ ..భవిష్యత్ లో డీబీఎస్టీ కాలేజీకి ఇలాంటి పరిస్థితి లాదని అనుకుంటున్నాం.
జగతి: ఇది చాలా గొప్ప ఆలోచన..మీరు అడిగిన అడ్మిషన్స్ అన్నీ నేను రెడీ చేస్తాను...
మహేంద్ర: చాలా గొప్పగా ఆలోచించారు
జగతి: మా కాలేజీలో ఖాళీ సీట్లు అన్నీ ఎలా భర్తీ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు.. ఈ లోకంలో నాశనం కోరుకునే వారు ఉన్నట్టే బాగు కోరుకునేవారూ ఉన్నారు...
వెళ్లొస్తాం అని చెప్పేసి పాండ్యన్ అండ్ టీమ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు... వాళ్లని పంపించేసి వస్తాం అని వెనుకే వెళతారు జగతి-మహేంద్ర..
ఈ సపోర్ట్ స్టూడెంట్స్ స్కీమ్ ఆలోచన ఎవరిదని అడుగుతుంది జగతి..
నేనే మిమ్మల్ని డీబీఎస్టీ కాలేజీకి పంపించానని, నేనే ఈ ఐడియా ఇచ్చానని చెప్పొద్దు..మనం చేసే పనిలో మంచి ఉంటే చాలు పేరు ఉండాల్సిన అవసరం లేదన్న రిషి మాటలు గుర్తు చేసుకుంటాడు పాండ్యన్... చెప్పండి పాండ్యన్ అని మళ్లీ అడుగుతుంది... మీరు చెప్పకపోయినా మేం అర్తం చేసుకోగలం..రిషి సార్ కి థ్యాంక్స్ చెప్పండి అని చెబుతారు..
Also Read: ఆగష్టు 17 రాశిఫలాలు, ఈ రాశులవారు అకస్మాత్తుగా డబ్బు పొందుతారు!
పెళ్లి గురించి ఆలోచించావా అని ఏంజెల్ ను అడుగుతాడు విశ్వనాథం. నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ముందు నాకో విషయం చెప్పు అని అడుగుతుంది..
ఏంజెల్: నచ్చినవాడెవరో చెబితే పెళ్లి చేస్తానన్నావు కదా..
విశ్వనాథం: చెప్పమ్మా
ఏంజెల్: నాకు ఎలాంటి అబ్బాయి అయితే సరిపోతాడు. నీ మనవరాలికి ఇలాంటి అబ్బాయిని తీసుకురావాలి, అలాంటి అబ్బాయిని తీసుకురావాలని అనుకుంటావు కదా చెప్పు
విశ్వనాథం: నీ మొహంలో చిరునవ్వులు పూయిస్తూ నిన్ను మహారాణిలా చూసుకునే మహారాజు కావాలని ఆశపడుతున్నా అంటాడు
ఏంజెల్ మళ్లీ రిషి ఊహల్లో తేలిపోతుంది....అలాంటి అబ్బాయి ఎనరైనా ఉన్నారా అని అడిగితే ...సైలెంట్ గా ఉండిపోతుంది ఏంజెల్..