![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedanta Manasu August 19th: వసు కన్నీళ్లు చూసి రిషి మనసులో అలజడి, ఏంజెల్ కి నిజం తెలిసే టైమొచ్చిందా!
Guppedantha Manasu August 19th: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.
![Guppedanta Manasu August 19th: వసు కన్నీళ్లు చూసి రిషి మనసులో అలజడి, ఏంజెల్ కి నిజం తెలిసే టైమొచ్చిందా! Guppedanta Manasu Serial August 19th Episode 846 Written Update Today Episode, know in telugu Guppedanta Manasu August 19th: వసు కన్నీళ్లు చూసి రిషి మనసులో అలజడి, ఏంజెల్ కి నిజం తెలిసే టైమొచ్చిందా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/d5416f57fcfef1fd1638f3cedf794c5f1692415078168217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుప్పెడంతమనసు ఆగష్టు 19 ఎపిసోడ్ (Guppedanta Manasu August 19th Written Update)
వసుధార కాలేజీకి రాకపోవడంతో ఎందుకు రాలేదో అనే ఆలోచనలో ఉంటాడు రిషి. ఇంతలో పాండ్యన్ వచ్చి వసుధార మేడం రాలేదు సార్ అని చెప్తాడు. ఒకసారి ఫోన్ చేసి ఎందుకు రాలేదు కనుక్కో అంటాడు. పాండ్యన్ కాల్ చేసేలోగా వసుధార కాలేజీలోకి వస్తుంది. నువ్వు క్లాస్ కి వెళ్లు అని పాండ్యన్ ని పంపించేస్తాడు. వసుధార వెళ్లిపోతుంటే రిషి పిలుస్తాడు..కాలేజీకి ఎందుకు లేట్ గా వచ్చారని అడుగుతాడు కానీ ఏమీ లేదని చెప్పి వెళ్లిపోతుంటుంది
రిషి: మాట్లాడుతుంటే వెళ్లిపోతారేంటి
వసు: అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా..ఇంకా మాట్లాడేందుకు ఏముంది అంటూ బాధగా అంటుంది
రిషి: నాకు మెసేజ్ పెట్టి ఎందుకు డిలీట్ చేశారో చెప్పండి
వసు: డిలీటెడ్ కదా సార్..డీటేల్స్ ఎందుకు
రిషి: డిలీట్ మెసేజ్ చూసినప్పటి నుంచి మనసు మనసులో లేదు
వసు: మనమధ్య ఏమీ లేదుకదా..పొరపాటున టచ్ అయి వచ్చింది
రిషి: పొరపాటున రావటానికి అదేమీ మిస్డ్ కాల్ కాదు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తేనే వస్తుంది. నాకు ఆ మాత్రం తెలియదా
వసు: మీకు అన్నీ తెలుస్తాయి కానీ తెలియవలసినవి మాత్రం తెలియదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది
రిషి: ఓసారి నావైపు చూడండి అని అడిగి..వసు కన్నీళ్లు చూసి బాధపడతాడు కానీ బయటపడకుండా ఏం జరిగిందని అడుగుతాడు
వసు: ఏమీ లేదు సార్ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియవు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది
క్లాసులో కూడా అవే ఆలోచనలతో ఉంటుంది వసుధార. మ్యాథ్స్ కరెక్టుగా చేసినా కానీ రాంగ్ అని కొట్టేస్తుంది. ఏమైంది మేడం అని పాండ్యన్ అడిగినా ఏమీ మాట్లాడదు. మేడం ఎందుకు అలా ఉన్నారో కనుక్కుని వస్తానని ఫ్రెండ్స్ కి చెప్పి..వసుధార పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు.
Also Read: ఐ లవ్ రిషి అని చెప్పేసిన ఏంజెల్, షాక్ లో వసు - రిషి రియాక్షన్ ఏంటంటే!
శైలేంద్ర-దేవయాని
ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. అక్కడికి వచ్చిన దేవయాని ఏం జరిగింది అని అడుగుతుంది. ఏ ప్లాన్ వేసిన ఫెయిల్ అయిపోతోంది. రిషి ని చంపేస్తాను అంటే నువ్వేమో వద్దంటున్నావు. కాలేజీ నా హస్తగతమవుతుందని కాలేజీ గురించి బ్యాడ్ గా పేపర్లో వేయించానంటూ జరిగిందంతా చెప్పాడు . ఇలాంటి పిచ్చి పనులే చేస్తావు తర్వాత వర్క్ అవుట్ అవ్వలేదు అంటూ టెన్షన్ పడతావు. ఓదానిపై ఆశపడితే సొంతం అయ్యేవరకూ ఓపికగా ఆగాలి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నన్ను లెక్కచేయడం లేదంటుంది.దేవయాని మాటలకు మరింత ఫైర్ అవుతాడు శైలేంద్ర..నన్ను ఇలా చేయొద్దంటావు కానీ నువ్వు ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చెప్పావా అని రివర్సవుతాడు. త్వరలోనే నీ కోర్కె నెరవేరుతుందని హామీ ఇస్తుంది దేవయాని.
జగతి-మహేంద్ర
శైలేంద్ర-దేవయాని అక్కయ్య ఎన్ని ప్లాన్స్ వేసినా అవి సక్సెస్ కావు అనుకుంటారు జగతి-మహేంద్ర. పాండ్యన్ వాళ్లు వచ్చి స్టూడెంట్స్ అడ్మిషన్ కోసం చెప్పినదంతా గుర్తుచేసుకుని మురిసిపోతారు. రిషికే అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి నిజంగా నా కొడుకు గ్రేట్ అంటుంది జగతి. నీ కొడుకే కాదు నాక్కూడా కొడుకే అంటూ గర్వంగా మీసం మెలేస్తాడు మహేంద్ర. వాటిని మన కాలేజీ వెబ్ సైట్ లో పెడదాం..ఎవరైనా మన కాలేజ్ వెబ్సైట్ చూస్తే ఇన్స్పైరింగ్ ఫీల్ అవుతారు అంటాడు మహేంద్ర. అలాగే అంటుంది జగతి. ఈపాటికి రిషి ఏం చేస్తూ ఉంటాడో అని కొడుకుని తలుచుకుంటుంది. ఏం చేస్తాడు.. చదువుకుంటూ ఉంటాడు అంటాడు మహేంద్ర.
రిషి-పాండ్యన్
చదువుకుంటూ ఉంటాడు రిషి. రిషి దగ్గరికి వచ్చిన పాండ్యన్ తన బుక్ చూపించి ఈ సమ్ కరెక్టే కదా సార్ అని అడుగుతాడు. కరెక్టే అంటాడు రిషి. మరి మేడం ఎందుకు ఇంటి మార్క్ పెట్టారు సార్ నాకే కాదు అందరికీ అలాగే పెట్టారు. ఎందుకో మేడం మూడిగా ఉన్నారు. క్లాస్ తీసుకోవడం లేదు మీకు ఏమైనా తెలుసేమో అని ఇక్కడికి వచ్చాను అంటాడు పాండియన్. నేను కనుక్కుంటానులే అని చెప్పి పాండ్యన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు.
Also Read: దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా, 'గుప్పెడంతమనసు'లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ!
రిషి-చక్రపాణి
ఆ తర్వాత రిషి నేరుగా చక్రపాణి కలిసి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా.. లేదంటే జగతి మేడం గాని మా డాడీ గాని ఫోన్ చేశారా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు సార్ ఎందుకు అలా అడుగుతున్నారు నాకు టెన్షన్ గా ఉంది చెప్పండి అంటాడు చక్రపాణి. అలా ఏం లేదు ఉదయం నుంచి వసుధార చాలా డల్ గా ఉంది ఏమైనా డిస్టబెన్స్ అయిందేమో మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాను అంటాడు రిషి. ఇంకేముంది సార్ మీరు తనని దూరం పెట్టిన దగ్గర నుంచి తను అలాగే ఉంది. ఈరోజు మీ మధ్య జరిగిన జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చి ఉంటాయి. అయినా మీ తప్పు కూడా లేదు తను మిమ్మల్ని అంతగా గాయపరిచింది కాబట్టే మీరు దూరం పెట్టారు. వసమ్మ గురించి మీకన్నా ఎవరికీ బాగా తెలిసి ఉండదు సార్ అంటాడు చక్రపాణి.
ఎపిసోడ్ ముగిసింది...
Also Read: ఆగష్టు 19 రాశిఫలాలు, ఈ రాశులవారు నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)