Guppedanta Manasu August 23rd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: నిజం తెలిసి ఏంజెల్ మీద అరిచిన రిషి- మిస్టర్ ఇగోకి ప్రేమలేఖ రాసిన వసుధార
Guppedantha Manasu August 23rd: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.
రిషిని వసు రోడ్డు మీద కలుస్తుంది.
రిషి: మీ పెళ్ళేప్పుడు అని ఎందుకు మెసేజ్ చేశారు. అది అసాధ్యం. నా మనసులో ఒకరు ఉన్నంత వరకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను ఏనాటికైనా తోసేయగలవు ఏమో కానీ నీకు ఉన్నంత ధైర్యం నాకు లేదు
వసు: మీ మనసులో ఉంది ఎవరు
రిషి: నీకు తెలియదా.. నా మనసులో ఉన్నది ఎవరో నీకు తెలియదా? నా మనసులో ఉంది నువ్వే వసుధార. నీకు తప్ప ఇంకొకరికి నా మనసులో చోటు లేదు. మన ఇద్దరిదీ రిషిధార బంధం. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అనగానే వసు సంతోషంగా కౌగలించుకుంటుంది. కాసేపటికి అది తన ఊహ అని అర్థం అవుతుంది. దీని అంతటికీ కారణం మీరు, నేను ఇలా ఒంటరిగా ఉండటానికి కారణం మీరు. నా ప్రేమని నేలమట్టం చేశారు. నా నమ్మకాన్ని పాతాళానికి తోసేశారు. పెళ్లి అనేది నా ఇష్టం మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు
వసు: అవును ఇది మీ జీవితం మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను మీ గతంలో లేను. నన్ను వద్దని అనుకున్నారు కదా అందుకే నన్ను మర్చిపోండి
రిషి: మీరు ఇంత కఠినంగా మాట్లాడతారని అనుకోలేదు. మీది బండరాయి కంటే గట్టి మనసు
వసు: పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఇలాగే ఉంటుంది
కోపంగా రిషి తన మీద అరిచేసి వెళ్లిపొమ్మని అంటాడు. అప్పుడే వసుకి ఏంజెల్ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. రిషి నీ దగ్గరకి ఏమైనా వచ్చాడా? నేను రిషిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పావా? తన మనసులో ఏముందో తెలుసుకున్నావా? ఈసాయం నువ్వు మాత్రమే చేయగలవు. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వే రిషిని ఒప్పించి మా ఇద్దరి పెళ్లి చేయాలి అని వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. అది విని రిషి కోపంగా పిలుస్తాడు.
రిషి: ఏంజెల్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా? అందుకేనా మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకు మీరు నన్ను ఇంకా ఇంకా బాధపెడుతున్నారు. మీకు ఈ విషయం తెలిసి నాకు చెప్పకపోవడాన్ని భరించలేకపోతున్నా. ఇంకొక దాపరికం అనేసి చీదరించుకుని వెళ్ళిపోతాడు
జగతి ఆఫీసుకి సంబంధించి వర్క్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే శైలేంద్ర చూస్తాడు. కాలేజ్ విషయాల్లో నాకు స్కోప్ ఇవ్వడం లేదు పిన్నీ మీరు. ప్రతిదీ మీ చేతిలోకే తీసుకున్నారు. నేను ఇప్పుడు సహనంతో ఉన్నానని సంబరపడొద్దు.. దాని వెనుక మీ పతనం ఉంది. మీ చేతుల్లో ఉన్న డీబీఎస్టీ కాలేజ్ తప్పించడం కాసేపు పట్టదు. ఏదో ఒక అవకాశం నాకు రాకపోదు అప్పుడు శైలేంద్ర గెలుపు చూస్తారు అని మనసులో రగిలిపోతాడు. ఇంట్లో ఏంజెల్ రిషి, వసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరిగి ఉంటుందని అనుకుంటుంది.
ఇంటికి వచ్చిన వసు రిషి అన్న మాటలు తలుచుకుంటుంది. ఏంజెల్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రిషిని కలిశావా? మాట్లాడావా? నేను చెప్పిన దాని గురించి చెప్పావా? అని ఏంజెల్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
వసు: రిషిని కలిశాను. మీరు చెప్పింది చెప్పాను
ఏంజెల్: ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా?తన మనసులో నా ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు తను ఇంటికి వస్తాడు కదా నేనే మాట్లాడతాను
అప్పుడే రిషి ఇంటికి వస్తాడు. తనని పిలుస్తుంది. ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు? నాకు వెయ్యి పనులు ఉంటాయ్. అన్నీ నీకు చెప్పే చేయాలా? నీకు కాస్త కూడ బుద్ది ఉండక్కర్లేదా? ఎదుటి వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో చూడకుండా మాట్లాడటమేనా? నా విషయాల్లో కలుగజేసుకోవద్దని చెప్పాను. అయినా నా పర్శనల్స్ గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇప్పటికైనా అర్థం చేసుకుని అనవసర విషయాలు లేవనెత్తి ఇరిటేట్ చేయకు అని అరుస్తాడు. ఏంజెల్ ఏమైందని అనేసరికి అదంతా తన భ్రమ అని ఆలోచనలో నుంచి బయటకి వస్తాడు. వసుధారని కలిశావ్ అంట కదా ఏం మాట్లాడిందని ఏంజెల్ అడుగుతుంది. ఇప్పుడు తనకి మూడ్ బాగోలేదని చెప్పేసి వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచించకని చెప్తాడు. డైరెక్ట్ గా మాట్లాడితే నువ్వు చెప్పవు అందుకే రూమ్ లో లెటర్ పెట్టాను అది చదివితే నువ్వు రిప్లై ఇవ్వాలి కదా అని ఏంజెల్ అనుకుంటుంది.
Also Read: అత్తకి చావు భయం చూపిస్తున్న తోడికోడళ్ళు- తులసిని లైన్లో పెట్టేందుకు నందు పాట్లు
రూమ్ లో రిషి బెడ్ మీద నెమలి ఈక ఉంటుంది. గతంలో తను వసుధారకి ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. దాని కిందే లవ్ లెటర్ ఉంటుంది. లెటర్ చివర్లో వసుధార అని రాసి కొట్టేసి ఏంజెల్ అని రాస్తుంది. ఏంటి ఈ పిచ్చి పనులు ఏంజెల్ కోసం వసుధార ప్రేమలేఖ రాయడం ఏంటని అనుకుని కోపంగా తనకి కాల్ చేస్తాడు.
రిషి: ఎందుకు రాశావు
వసు: ఏంజెల్ కి రాయడం రాక
రిషి: అసలు నాకు ఎందుకు రాశావు. అలా ఎలా రాస్తావు
వసు: ఏంజెల్ అడిగింది నేను రాశాను, సాయం అడిగింది చేశాను
రిషి: నీకు నా మనసు, వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా ఎందుకు తనని ఎంకరేజ్ చేస్తున్నావ్
వసు: నేను ఎందుకు చేస్తాను. అలా చేస్తే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. అసలు ఇది మీ సమస్య మీరే సాల్వ్ చేసుకోండి. అనవసరంగా నన్ను ఇరికిస్తున్నారు. ఏంజెల్ ముందు మీరు ఓపెన్ అవాలి. మీ మనసులో ఏముందో తనకి చెప్తేనే కదా తెలిసేది
రిషి: ఇప్పుడేగా నాకు విషయం తెలిసింది. కాస్త టైమ్ కావాలి
వసు: ఏదైనా తొందరగా తేల్చుకోండి లేకపోతే సమస్య అవుతుంది అనేసి కోపంగా సలహా ఇచ్చి పెట్టేస్తుంది. దీంతో రిషి ఆశ్చర్యపోతాడు.