Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమా - ఇక యాంకరింగ్‌కు వీడ్కోలు?
న్యూఇయర్ సందర్భంగా ‘క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ’ కార్యక్రమం జరగనుంది. ఆ ప్రోగ్రాం సెకండ్ ప్రోమో ను విడుదల చేశారు. ఇందులో యాంకర్ సుమ తన యాంకరింగ్ కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
బుల్లితెరపై సుమా కనిపిస్తే చాలు.. నవ్వులే నవ్వులు. ఆమె వేసే పంచులు.. చిలిపి మాటలంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. అంతేకాదు.. ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్‌కైనా సుమా ఉంటేనే అందం. సుమకు ఉన్న డిమాండ్ బహుశా.. టెలివిజన్ చరిత్రలో మరే యాంకర్‌కు ఉండేదేమో. మరి, ఆమె బుల్లితెరపై మరి కనిపించదూ అంటే.. ప్రేక్షకులు తట్టుకోగలరా? కష్టమే కదూ.
బుల్లి తెరపై ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది యాంకర్ సుమ. కెరీర్ మొదట్లో పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా తర్వాత యాంకర్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇటు టీవీ షోలతో పాటు అటు సినిమా ఈవెంట్ లు ప్రత్యేక కార్యక్రమాలు ఇలా వరుసగా ప్రోగ్రాంలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటుంది. అయితే, ఓ టీవీ షోలో సుమ షాకింగ్ న్యూస్ చెప్పింది.
నూతన సంవత్సరం సందర్భంగా ఓ టీవీ కార్యక్రమంలో సుమా పాల్గొంది. బుల్లితెరపై తన యాంకరింగ్ జర్నీని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. త్వరలో తాను యాంకరింగ్ కెరీర్ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో సుమ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఏమైంది? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈటీవీలో ‘క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో బుల్లితెర కమెడియన్స్ తో పాటు పలు టీవీ సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కు సంబంధించిన మొదటి ప్రోమో ఇప్పటికే ఆకట్టుకుంది. తాజాగా రెండో ప్రోమోను కూడా విడుదల చేసింది టీమ్. ఇందులో పలు టీవీ సీరియల్స్ నటీనటుల సందడి, కామెడీ స్కిట్స్, డాన్స్ షో లతో ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ ప్రోమో చివరలో యాంకర్ సుమకు అందరూ కలసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.."మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే అది కేవలం తెలుగు వాళ్లు చూపించిన అభిమానం, ప్రేమ. అవి లేకపోతే నేను లేను. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
సుమ మాటలు విని.. ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఆమె ఎందుకు యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తుంది? పూర్తిగా యాంకరింగ్ నుంచి తప్పుకుంటుందా? బ్రేక్ ఇచ్చి తర్వాత ఏం ప్లాన్ చేస్తుంది అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీలో చాాలా మంది యాంకర్లు ఉన్నా సుమకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త యాంకర్లకు పోటీగా నిలుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ మహిళ, క్యాష్ వంటి ప్రోగ్రాంలను ఎన్నో ఏళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపించి ఆకట్టుకుంది. మరి ఇప్పుడు సుమ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఆమె చేస్తోన్న షో లు నిలిచిపోతాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే పూర్తి ప్రోగ్రాం వచ్చే వరకూ వెయిట్ చేయాలస్సిందే. ఈ ప్రత్యేక కార్యక్రమం డిసెంబర్ 31 న టెలికాస్ట్ కానుంది. ఏదేమైనా సుమ యాంకరింగ్ కి గ్యాప్ ఇవ్వనుందనే కామెంట్స్ తో పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.