News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

ఈ వారం కూడా ‘సుమ అడ్డా’ కామెడీతో కిర్రాక్ పుట్టింది. తాజా ఎపిసోడ్ లో ‘పరేషాన్’ టీమ్ పాల్గొన్నది. మూవీ యూనిట్ తోపాటు రానా పాల్గొని సందడి చేశారు. సుమ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్స్ చెప్తూ నవ్వించారు.

FOLLOW US: 
Share:

తెలుగు బుల్లితెరపై సుమ చేసే సందడి మామూలుగా ఉండదు. చక్కటి  పంచులు, అదిరిపోయే కౌంటర్లు, ఆకట్టుకునే మాటలతో టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. షో ఏదైనా తన మార్క్ హోస్టింగ్ తో ఆకట్టుకుంటుంది. ఆమె షోలో బాగా ఎంటర్ టైన్ మెంట్ అందించేది 'సుమ అడ్డా' . తాజాగా ఈ షోలో ‘పరేషాన్’ మూవీ టీమ్ పాల్గొన్నది. వారితో పాటు రానా షోలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.  

'సుమ అడ్డా'లో ‘పరేషాన్’ టీమ్ సందడి  

తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.  వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌ లో,  త్వరలో విడుదల కానున్న 'పరేషాన్' అనే సినిమా టీమ్ పాల్గొన్నది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో తిరువీర్, హీరోయిన్ పావనీ కరణం, డైరెక్టర్ రొనాల్డ్‌ సన్‌తో పాటు దగ్గుబాటి రానా గెస్టులుగా పాల్గొన్నారు.  వీళ్లతో కలిసి సుమ కిర్రాక్ కామెడీ చేసింది.   

పంచులతో నవ్వించిన రానా

ఈ షోలో రానా వేసిన పంచులు అందరినీ ఎంతో నవ్వించాయి. రానా, తిరువీర్‌తో కలిసి  సుమ 'బాహుబలి 2' స్ఫూఫ్ చేశారు. అందులో బాహుబలి తల నరికిన సీన్‌ను రీ క్రియేట్ చేశారు. సుమను రానా ఏమైందని అడిగారు. 'బిర్యానీ పొట్లం కోసం లైన్‌లో నిల్చుంటే వీడు నన్ను తాకాడు. అప్పుడే వేలు నరికేశానని చెబుతుంది. దీంతో రానా  నరకాల్సింది వేలు కాదు.. బిర్యానీ ప్యాకెట్‌ను అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. ఈ పంచ్ తో షోలో నవ్వుల పువ్వులు పూశాయి. అటు ఈ షోలో  రూ. 500 నోటుతో రానా  చేసిన కామెడీ అందరినీ అలరించింది. ఎదుటి టీమ్ చెప్పిన సమాధానం కాదు అని చెప్తూ రానా రూ. 500 పందెం కాశారు. ఈ షో హిస్టరీలోనే ఇంత తక్కువ అమౌంట్ ఎవరూ పెట్టలేని సుమ తెలిపింది. అయితే, ఈ రూ. 500కు చిల్లర ఇవ్వు అంటూ మరో పంచ్ వేశారు. దీంతో అందరూ ఫుల్ గా నవ్వేశారు. ఇండస్ట్రీలో మందుపార్టీ అనగానే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్లు ఎవరు? అని సుమ అడగ్గా, ఓ బ్యాచే ఉందని తెలిపారు రానా. ఆ ముఠాకు తానే మేస్త్రీని అని చెప్పడంతో అందరూ విరగబడి నవ్వారు. మొత్తంగా ‘పరేషన్’ టీమ్ ‘సుమ అడ్డా’లో కామెడీతో సుమను పరేషాన్ చేసింది. సుమ ప్రశ్నలకు రానా ఫన్నీ సమాధానాలతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌ జూన్‌ 3న ప్రసారం కానుంది.

'మసూద' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన తిరువీర్.. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో రూపొందించిన 'పరేషాన్' సినిమాతో కామెడీ పంచడానికి వస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌ సన్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుద్దరాఖాన్ రవి, రాజు బెడిగేలా ప్రధాన పాత్రలు పోషించారు.    

Read Also: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్ 

Published at : 30 May 2023 03:29 PM (IST) Tags: Rana Daggubati Thiruveer Suma Adda Show Suma Adda Latest Promo Pavani Karanam

ఇవి కూడా చూడండి

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Guppedanta Manasu october 1st Promo: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!

Guppedanta Manasu october 1st Promo: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!