Ammayi garu Serial Today September 6th: అమ్మాయి గారు సీరియల్: కోమలి విషం కేసులో ట్విస్ట్! విజయాంబికకు మూడినట్లేనా!
Ammayi garu Serial Today Episode September 6th కోమలి గురించి ఆనంద్ రూప వాళ్లకి చెప్పడం సూర్యప్రతాప్ కన్న కూతురు అయిన రూపనే తిట్టడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Ammayi garu Serial Today Episode భూమి పత్రాలు పంపే చోట బాంబ్ ఏర్పాటు గురించి అశోక్ రాజుకి చెప్పడంతో ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక కోమలి హస్తం ఉందని రాజు రూప, విరూపాక్షిలకు చెప్తాడు. రూప ఆవేశంగా నా ఫ్యామిలీ జోలికి వచ్చినదాన్ని వదలను అని వెళ్లి కోమలిని చితక్కొట్టి గొంతు పట్టి నులిపేసి చావ గొడుతుంది. విరూపాక్షి, రాజులు వచ్చి రూపని ఆపుతారు. కోమలి దాదాపు చావుని దగ్గరగా చూస్తుంది. కోమలి రూపకి భయపడుతూ మనసులో ఈ నాటకంలో సైడ్ క్యారెక్టర్ అయిన నన్నే ఈ రేంజ్‌లో కొట్టిందంటే అసలు క్యారెక్టర్‌లు అయిన విజయాంబిక, దీపక్‌ల పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది.
దీపక్, విజయాంబికలు బాంబ్ గురించి అశోక్‌కి ఎలా తెలిసిందా అనుకుంటారు. విజయాంబిక కొడుకుతో బాంబ్ అక్కడ ఉంది అని రాజుకి తెలిసింది అంటే పెట్టించింది మనమే అని తెలిసిపోయింటుందని అంటుంది. మనమే అని తెలిస్తే మనల్ని ఎందుకు వదిలేశాడు మమ్మీ అని దీపక్ అంటాడు. ఇంతలో రాజు నేను చెప్తా అని రూప, విరూపాక్షిలతో ఎంట్రీ ఇస్తాడు. రాజు దీపక్‌ని విరూపాక్షి, రూపలు విజయాంబికని చావగొడతారు. దీపక్, విజాయాంబికలు ఆ దెబ్బలకు లేవలేకపోతారు.
రూప కొట్టిన దెబ్బలకు కోమలి మూతి ముఖం వంకరపోతాయి. ఉదయం కోమలి యాక్టివ్‌గా ఉండాలి అని తెగ ప్రయత్నిస్తుంది. కానీ కనీసం సరిగా నడవలేకపోతుంది. కోమలి లాగానే దీపక్, విజయాంబికలు ముఖాలు కూడా వాచిపోయి ఉంటాయి. ఒకర్ని ఒకరు ఏమైంది అంటే బాత్‌రూంలో జారిపడ్డామని అనుకుంటారు. అందరం ఒకే సారి బాత్‌రూం జారి పడ్డాం అంటే మిమల్ని కూడా ఆ రూపే కొట్టిందా అంటే మమల్ని అంటే నిన్ను కొట్టిందా అని దీపక్ అడిగితే చంపేయలేదు అంటే అని అంటుంది. రూపని వదలకూడదు అని విజయాంబిక ప్లాన్ చేస్తుంది. ముగ్గురు గూడు పుటానీ చేస్తారు.
సూర్యప్రతాప్ కోమలిని చూసి ఏమైంది అని అడిగితే బాంబ్ బ్లాస్ట్ భయంతో నిద్ర పట్టలేదని ఆ భయంతో బాత్‌రూంలో జారిపడ్డానని అంటుంది. సూర్యప్రతాప్ కంగారు పడి డాక్టర్‌కి పిలవమని అంటాడు. బంటి కోసం రూప పొంగలి చేస్తుంది. కోమలికి కూడా ఏమైనా చేయమని సూర్యప్రతాప్ అంటాడు. రూప కోమలి కోసం ఉప్మా చేస్తే విజయాంబిక ఆ ఉప్మాలో విషం కలిపేస్తుంది. కోమలి విషం కలిపిన ఉప్మా తినేసి గొంతు పట్టుకొని కింద పడిపోతుంది. అందరూ కోమలి దగ్గరకు పరుగులు పెడతారు. కోమలి నోటి నుంచి నురగ వస్తుంది. రూప, విరూపాక్షిలు ఇదో కొత్త నాటకమా అని అనుకుంటారు. రాజు వాళ్లు ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కోమలిని ఐసీయూకీ తీసుకెళ్తారు.
నర్స్ బయటకు వచ్చి కోమలికి బాడీ మొత్తం విషం ఎక్కిందని అంటారు. సూర్యప్రతాప్ హడావుడిగా హాస్పిటల్‌కి వస్తాడు. రూపకి ఏమైంది అని అడుగుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఫుడ్‌లో విషం కలిసిందని చెప్తారు. ఫుడ్లో విషమా అని అందరూ నోరెళ్లబెడతారు. కోమలిని చూడటానికి లోపలికి వెళ్తారు. రూప తల్లితో ఏంటి అమ్మా ఇది నా చేతులతో నేనే ఇచ్చాను కదా అందులోకి విషం చేరడం ఏంటి అమ్మా అని అంటుంది. కోమలిని చూసి సూర్యప్రతాప్ ఏడుస్తాడు. చంద్ర కోమలితో రూప ఉదయం నుంచి ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. లేదు బాబాయ్ రుక్మిణి ఇచ్చిన ఉప్మా మాత్రమే తిన్నాను అంటుంది.
విజయాంబిక రూపతో అమ్మా రుక్మిణి నువ్వు విషం కలిపావు అనడం లేదు కానీ ఉప్మా ఎలా చేశావో గుర్తు చేసుకో.. రూప ఉదయం లేచినప్పటి నుంచి తిన్నది కేవలం ఉప్మానే.. అది చేసింది ఇచ్చింది మన రుక్మిణినే కదా దానికి మనమే సాక్ష్యం కదా అని విజయాంబిక అంటుంది. సూర్యప్రతాప్ అక్క మాటలకు రుక్మిణిని అనుమానించి రుక్మిణి విషం కలిపిందని నమ్మేస్తాడు. కోమలి కూడా యాక్టింగ్ మొదలు పెడుతుంది. సూర్యప్రతాప్‌తో ఎందుకు నాన్న రుక్మిణిని నేను అంటే ఇంత పగ.. నేను తిరిగి వస్తే అందరూ నన్ను ప్రేమిస్తారు అనుకున్నా రుక్మిణి ఇలా చేసింది ఏంటి నాన్న.. ఆ ఇంటికి రావాలి అంటే భయంగా ఉంది కావాలి అంటే నన్ను ఎక్కడైనా సపరేట్‌గా ఉంచండి అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ నిన్ను సపరేట్‌గా ఉంచడం ఏంటమ్మా కావాలి అంటే నిన్ను ద్వేషించే వాళ్లే ఇంటి నుంచి వెళ్లిపోతారని రుక్మిణిని ఉద్దేశించి అంటాడు.
రుక్మిణి కోపంగా నాకు నిన్ను చంపాల్సిన అవసరం లేదు.. నేను విషం కలపలేదు నాకు అలాంటి ఆలోచన కూడా రాలేదు అని రుక్మిణి అంటుంది. సూర్యప్రతాప్ కోపంగా ఆపు రుక్మిణి కనీసం నువ్వు అక్క అని కూడా పిలవడం లేదు.. అలాంటిది నువ్వు ఈ పని చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి అని సూర్యప్రతాప్ అడుగుతాడు. దానికి రుక్మిణి నమ్మాలి నాన్న ఎందుకంటే నేను నీ కూతుర్ని.. తప్పు చేయడం మోసం చేయడం ఒకరి నాశనం కోరుకోవడం నీ రక్తంలో ఉండదు కదా నాయనా అని అంటుంది.
సూర్యప్రతాప్ రుక్మిణితో ఉదయం బంటీకి పొంగల్ చేయడం.. రూప కోసం ఉప్మా చేసింది నువ్వే కదా.. మరి బంటీకి ఏం కాలేదు.. రూప తిన్నదాంట్లో విషం ఎలా వచ్చింది.. నీకు ఇష్టం అయినా బంటీ పొంగల్ మొత్తం తిన్నా ఏం కాలేదు.. రూప రెండు స్పూన్లు తింటే పడిపోయింది. రూప నీకు ఇష్టం లేదు కాబట్టి విషం కలిపావ్.. రూపని చంపాల్సిన అవసరం నీకే ఉందని రుక్మిణిని తిడతాడు. రుక్మిణి, విరూపాక్షిలను బయటకు పొమ్మంటాడు.
కోమలి ఉన్న అదే హాస్పిటల్‌కి ఆనంద్ వస్తాడు. ఆనంద్ వెళ్తూ సూర్యప్రతాప్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ దగ్గర ఉండడం చూసి వీళ్లేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటాడు. ఇంట్లో వాళ్లు అంతా కళ్ల ముందే ఉన్నారు మరి ప్రాబ్లమ్ ఎవరికి అనుకుంటాడు. ఇంతలో సూర్యప్రతాప్ కోమలిని బయటకు తీసుకొస్తాడు. ఆనంద్ కోమలిని చూసి షాక్ అయిపోతాడు. కోమలికి సీఎంకి ఏంటి సంబంధం అని అనుకుంటాడు. వెంటనే రాజుకి కాల్ చేస్తాడు. రాజు కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో రాజుని కలిసి విషయం మాట్లాడాలి అని ఆనంద్ అనుకుంటాడు.
సూర్యప్రతాప్ ఇంట్లో అందరితో నా కూతురు రూప అంటే నాకు ప్రాణం.. చివరకు ఆ దేవుడు అయినా నా కూతురి జోలికి వస్తే ఊరుకోను అంటాడు. రూప మనసులో నాన్న నా మీద నీ ఇష్టానికి సంతోషపడాలో నాకు చూపించాల్సిన ప్రేమ వేరే దానికి చూపిస్తున్నావ్ అని బాధ పడాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది.
కోమలి మనసులో అమ్మో ఈయనకు రూప అంటే ప్రాణమా నేను రూప కాదు అని తెలిస్తే షూట్ చేసేస్తాడు అని అనుకుంటుంది.
విజయాంబిక కొడుకుతో మనం అనుకున్నది సాధించడానికి అడుగు ముందుకి పడింది. విరూపాక్షిని రూపని మీ మామయ్యే గెంటేసే పరిస్థితి వస్తుందని అంటుంది. రాత్రి ఆనంద్ సూర్యప్రతాప్ ఇంటికి రాజు వాళ్ల గురించి వస్తాడు. రాజుకి ఆనంద్ కాల్ చేసి మీతో కోమలి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. కోమలి ఎవరూ అని మాట్లాడితే రూప స్థానంలో ఉన్న అమ్మాయి పేరు కోమలి అని రాజు వాళ్లకి తెలుస్తుంది. ఆనంద్‌ని ఇంటి బయటే ఉన్నాడని తెలుసుకొని ఆనంద్ దగ్గరకు వెళ్తారు. కోమలి గురించి నీకు ఏం తెలుసు అంటే కోమలి గురించి నాకు మొత్తం తెలుసు. చిన్నప్పటి నుంచి మేం కలిసి చదువుకున్నాం.. తనకు అమ్మానాన్నలు లేరు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని పేరు అశోక్ అని అంటాడు. రాజు ఫోటో చూపిస్తే వీడే రాజు కోమలి బాయ్ ఫ్రెండ్ అని ఆనంద్ అంటాడు. రూప ఆనంద్‌తో కోమలికి సంబంధించిన ఆధారాలు కావాలని ఓటర్ కార్డు, గ్రూఫ్ ఫొటో ఇలా ఏవి ఉంటే అవి కావాలి అంటుంది.
ఆనంద్ కాలేజ్‌కి వెళ్లి సాక్ష్యాలు సంపాదిస్తాడు. రాజు కాల్ చేయడంతో ఆనంద్ కాల్ లిఫ్ట్ చేసి ఆధారాలు దొరికాయని తీసుకొని వస్తున్నా అని చెప్తాడు. రాజు చాలా హ్యాపీగా త్వరగా రమ్మని చెప్తాడు. రాజు రూప వాళ్లకి విషయం చెప్తాడు. త్వరలోనే నీ కథకి ముగింపు చెప్తా అని రూప అనుకుంటుంది. కోమలి సూర్యప్రతాప్‌కి రూప మీద ఉన్న ప్రేమ గుర్తు చేసుకొని టెన్షన్ పడుతుంది.
సూర్యప్రతాప్ బయటకు వెళ్లిపోతుంటే రాజు ఆపడానికి వెళ్లి సూర్యప్రతాప్‌ని ఆపుతాడు. రూప, విరూపాక్షిలు కోమలిని కోపంగా చూడటం చూసి వీళ్లేంటి ఇలా చూస్తున్నారు.. నిన్ను తిట్టించా అని ఇలా చూస్తున్నారేమో అనుకుంటుంది. రూప విజయాంబికతో నాన్న నన్ను అమ్మని తిట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నావ్ అని అంటుంది. ముందు ముందు ఇంకా దారుణాలు జరుగుతాయని విజయాంబిక అంటే నేను నీకు చూపిస్తా కాసేపు వెయిట్ చేయ్ అంటుంది.
సూర్యప్రతాప్ రుక్మిణితో నేను బయటకు వెళ్లేటప్పుడు నువ్వు నాకు ఎదురు పడకు. తల్లిదండ్రులకు దూరంగా పెరిగినా నీ రక్తం మారలేదని నీ కుట్రలు మారలేదని నాకు అర్థమైందని అంటుంది. దాంతో రూప నాన్న నేను నిజంగానే కోమలి తిన్న ఉప్మాలో విషం కలపలేదు అని అంటుంది. కోమలినా అని అందరూ అడుగుతారు. కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు. కోమలి కాదు అక్క అని రూప కవర్ చేస్తుంది. కోమలి విజయాంబిక ఇద్దరూ ఇలా అన్నదేంటి అని ఇద్దరూ టెన్షన్ పడతారు. ఇవీ ఈ వారం హైలెట్స్.





















