Ammayi garu Serial Today September 5th: అమ్మాయి గారు సీరియల్: కోమలి కౌంట్‌డౌన్ స్టార్ట్!! ఇక తట్టాబుట్టా సర్దేయాల్సిందేనా!
Ammayi garu Serial Today Episode September 5th కోమలి బాగోతం సూర్యప్రతాప్ ముందు పెట్టడానికి ఆనంద్ సాక్ష్యాలు తీసుకొని బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఆనంద్ రాజు, రూప, విరూపాక్షిలో రూపలా నటిస్తుంది తన ఫ్రెండ్ కోమలి అని చెప్తాడు. రూప ఆనంద్‌తో కోమలికి సంబంధించిన ఆధారాలు కావాలని ఓటర్ కార్డు, గ్రూఫ్ ఫొటో ఇలా ఏవి ఉంటే అవి కావాలి అంటుంది.
రాజు కూడా ఆనంద్‌తో వెళ్తాను అంటే విరూపాక్షి వద్దని ఇంట్లో అనుమానం వస్తుందని అంటుంది. కోమలి పని ఇక అయిపోతుందని రాజు అనుకుంటాడు. ఉదయం రూప, రాజులు టెన్షన్ పడుతుంటే బంటీ వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నారని అంటుంది. దొంగమ్మ వచ్చినప్పటి నుంచి మీకు టెన్షన్ పడింది కదా అని అంటాడు. అదేం లేదు అని రూప సర్ది చెప్తుంది. స్కూల్‌కి వెళ్లమని చెప్తే బంటీ వెళ్లను అని చెప్తాడు. ఆ దొంగ అమ్మని ఇంట్లో నుంచి పంపేయ్ నాన్న అని అంటాడు. త్వరలోనే పంపేస్తా బంటీ నువ్వు స్కూల్‌కి వెళ్లి తిరిగి వచ్చేలోపు పంపేస్తా అంటాడు. బంటీ సంతోషంతో వెళ్లిపోతాడు.
విరూపాక్షి రాజుతో ఆనంద్‌కి కాల్ చేయమని అంటుంది. ఆనంద్ కాలేజ్‌కి వెళ్లి సాక్ష్యాలు సంపాదిస్తాడు. ఆనంద్ కాల్ లిఫ్ట్ చేసి ఆధారాలు దొరికాయని తీసుకొని వస్తున్నా అని చెప్తాడు. రాజు చాలా హ్యాపీగా త్వరగా రమ్మని చెప్తాడు. రాజు రూప వాళ్లకి విషయం చెప్తాడు. త్వరలోనే నీ కథకి ముగింపు చెప్తా అని రూప అనుకుంటుంది. కోమలి సూర్యప్రతాప్‌కి రూప మీద ఉన్న ప్రేమ గుర్తు చేసుకొని టెన్షన్ పడుతుంది. ఇంతలో సూర్యప్రతాప్ కోమలి దగ్గరకు వచ్చి అమ్మా రూప ఎలా ఉంది.. నీకు ఇలా జరగడం బాధగా ఉంది ఇంకెప్పుడూ ఇలా జరగదు అని అంటాడు. జాగ్రత్తగా ఉండు అమ్మా అని అంటాడు. మీటింగ్ ఉంది వెళ్తానని చెప్పి సూర్యప్రతాప్ బయల్దేరుతారు.
సూర్యప్రతాప్ బయటకు వెళ్లిపోవడం చూసి విరూపాక్షి కూతురితో ఇంట్లో పరిణామాలు చూసి భయంగా ఉందని అంటుంది. నువ్వు ఉండాల్సిన గదిలో ఆ అమ్మాయి ఉంది.. సూర్య హృదయంలో కూడా నీ స్థానంలో ఆ అమ్మాయి ఉందని అంటుంది. ఆనంద్ వచ్చాక అన్నీ సెట్ అయిపోతాయని రాజు అంటాడు. సూర్యప్రతాప్ బయటకు వెళ్లిపోతుంటే నాన్న వెళ్లిపోతున్నారు ఆనంద్ వచ్చే వరకు ఎలా ఆపాలి అని రూప అంటే ఏదో ఒకటి చేసి నేను ఆపుతా అని రాజు వెళ్తాడు. పది నిమిషాలు ఆగి వెళ్లండి పెద్దయ్యా మీరు వెళ్లాల్సిన రూట్‌లో అల్లర్లు జరుగుతుందని అంటాడు. సూర్యప్రతాప్ నేను వెళ్లి వాళ్ల అంతు చూస్తా అంటే పది నిమిషాలు ఆగమని రాజు అంటాడు.
సూర్యప్రతాప్ ఆగుతాడు. రూప, విరూపాక్షిలు కోమలిని కోపంగా చూడటం చూసి వీళ్లేంటి ఇలా చూస్తున్నారు.. నిన్ను తిట్టించా అని ఇలా చూస్తున్నారేమో అనుకుంటుంది. రూప విజయాంబికతో నాన్న నన్ను అమ్మని తిట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నావ్ అని అంటుంది. ముందు ముందు ఇంకా దారుణాలు జరుగుతాయని విజయాంబిక అంటే నేను నీకు చూపిస్తా కాసేపు వెయిట్ చేయ్ అంటుంది. ఇక సూర్యప్రతాప్ రుక్మిణితో నేను బయటకు వెళ్లేటప్పుడు నువ్వు నాకు ఎదురు పడకు. తల్లిదండ్రులకు దూరంగా పెరిగినా నీ రక్తం మారలేదని నీ కుట్రలు మారలేదని నాకు అర్థమైందని అంటుంది. దాంతో రూప నాన్న నేను నిజంగానే కోమలి తిన్న ఉప్మాలో విషం కలపలేదు అని అంటుంది. కోమలినా అని అందరూ అడుగుతారు. కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు. కోమలి కాదు అక్క అని రూప కవర్ చేస్తుంది. కోమలి విజయాంబిక ఇద్దరూ ఇలా అన్నదేంటి అని ఇద్దరూ టెన్షన్ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















