Ammayi garu Serial Today September 4th: అమ్మాయి గారు సీరియల్: రూప, విరూపాక్షిలను గెంటేయడానికి సూర్య సిద్ధం.. ఆనంద్ ఎంట్రీతో ఆశ!
Ammayi garu Serial Today Episode September 4th ఆనంద్ కోమలి గురించి రూప, రాజు, విరూపాక్షిలతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపలా నటిస్తున్న కోమలి అసలైన రూపని ఉద్దేశించి ఇంట్లో ఉండాలి అంటే భయంగా ఉంది ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్ రుక్మిణిగా ఉన్న రూపని ఉద్దేశించి ఇక్కడ ఎవరినీ నమ్మడానికి వీల్లేదు రూపని నువ్వు చూసుకో సుమ అని అంటారు.
రూప ఏడుస్తూ విషం నేను కలపలేదు నాన్న మీరు ఎవరు మీద ప్రమాణాలు చేయమన్నా చేస్తా అంటే దానికి సూర్యప్రతాప్ ప్రమాదాలు సృష్టించడం తప్పించుకోవడం నీకు మీ అమ్మ అలవాట్లు వచ్చేశాయి అని అంటాడు. నేనేం చేశాను సూర్య నేనేం ప్రమాదం సృష్టించాను అని అంటాడు. సూర్యప్రతాప్ అందరితో నా కూతురు రూప అంటే నాకు ప్రాణం.. చివరకు ఆ దేవుడు అయినా నా కూతురి జోలికి వస్తే ఊరుకోను అంటాడు. రూప మనసులో నాన్న నా మీద నీ ఇష్టానికి సంతోషపడాలో నాకు చూపించాల్సిన ప్రేమ వేరే దానికి చూపిస్తున్నావ్ అని బాధ పడాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది.
కోమలి మనసులో అమ్మో ఈయనకు రూప అంటే ప్రాణమా నేను రూప కాదు అని తెలిస్తే అని తనని షూట్ చేసినట్లు ఊహించుకొని భయపడుతుంది. సూర్యప్రతాప్ రాజుతో నువ్వు కూడా ఈ మధ్య నీ అమ్మాయి గారిని అశ్రద్ధ చేస్తున్నావ్ అని అంటే లేదు పెద్దయ్యగారు మీరు ఒక్క క్షణం అయినా ఏమరపాటుగా ఉంటారు కానీ నేను ఉండను అని అంటాడు. సూర్యప్రతాప్ కోమలితో అమ్మా రూప నీ కోసం ఎవరినైనా వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను.. నీకు నేను, రాజు, బంటీ, సుమ, చంద్ర ఉన్నాం అని చెప్తాడు. రాజుతో రూపని కంటికి రెప్పలా చూసుకోమని అంటాడు. సుమ కోమలిని గదిలోకి తీసుకెళ్తుంది.
విజయాంబిక కొడుకుతో మనం అనుకున్నది సాధించడానికి అడుగు ముందుకి పడింది. విరూపాక్షిని రూపని మీ మామయ్యే గెంటేసే పరిస్థితి వస్తుందని అంటుంది. రాత్రి ఆనంద్ సూర్యప్రతాప్ ఇంటికి రాజు వాళ్ల గురించి వస్తాడు. మళ్లీ మళ్లీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. రూప తల్లి, భర్తతో రూపని నేను ఉన్నాను. రూప జోలికి ఎవరైనా వస్తే వదలను.. రూప కోసం ఎవరినైనా వదిలేస్తా అన్నప్పుడు నాన్నకి నా మీద ప్రేమ అర్థమైందమ్మా కానీ నేను విషం కలపలేదు అని చెప్పినా నమ్మడం లేదని రూప ఏడుస్తుంది.
ఆ అమ్మాయి రూప కాదు అని మనం నిరూపించే వరకు మనకు ఆ బాధ తప్పదు అని విరూపాక్షి అంటుంది. రూప తండ్రితో తన అనుబంధం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. కోమలి భయంతో నేను తిన్న ఫుడ్‌లో విషం కలిపారు అంటే నన్ను చంపేస్తారు. నాకు చాలా భయంగా ఉంది ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఇక రాజు వాళ్లు కోమలి గురించి ఆలోచిస్తూ ఉంటారు.
కోమలి దగ్గరకు విజయాంబిక, దీపక్‌లు వస్తే కోమలి చాలా భయపడుతుంది. నీకు మా తమ్ముడి అండ ఉంది.. నువ్వు విషం తాగడం వల్ల రూపని, విరూపాక్షిని మా తమ్ముడు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమైందని అంటుంది. ఎవరి కోసమో నేను నా ప్రాణాలు వదులుకోవడానికి రెడీగా లేను అంటుంది. నువ్వేం అంత విషపూరితమైన విషం తాగలేదు అని విజయాంబిక అంటే ఏదో మీరు విషం కలిపినట్లు మాట్లాడుతున్నారని అంటే విషం మేమే కలిపాం.. జస్ట్ ఫుడ్ పాయిజన్ మాత్రమే అని అంటారు. ముందే నీకు చెప్తే ఇంతలా భయపడవు. అందుకే చెప్పలేదు అని అంటారు. రేపో మాపో ఆస్తి మనకు వచ్చేస్తుందని అంటుంది. విజయాంబికతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోమలి అనుకుంటుంది.
రాజుకి మళ్లీ ఆనంద్ కాల్ చేస్తాడు. ఆనంద్ రాజుతో అర్జెంట్‌గా మాట్లాడాలి అని అంటాడు. రాఘవ గురించా అని రాజు అడుగుతాడు. కాదు అని ఆనంద్ అంటే రాజు తర్వాత మాట్లాడుతా అని చెప్తాడు. దాంతో ఆనంద్ ఒక్క మాట రాజు అని మీతో కోమలి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. కోమలి ఎవరూ అని మాట్లాడితే రూప స్థానంలో ఉన్న అమ్మాయి పేరు కోమలి అని రాజు వాళ్లకి తెలుస్తుంది. ఆనంద్‌ని ఇంటి బయటే ఉన్నాడని తెలుసుకొని ఆనంద్ దగ్గరకు వెళ్తారు. కోమలి గురించి నీకు ఏం తెలుసు అంటే కోమలి గురించి నాకు మొత్తం తెలుసు. చిన్నప్పటి నుంచి మేం కలిసి చదువుకున్నాం.. తనకు అమ్మానాన్నలు లేరు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని పేరు అశోక్ అని అంటాడు. రాజు ఫోటో చూపిస్తే వీడే రాజు కోమలి బాయ్ ఫ్రెండ్ అని ఆనంద్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















