Ammayi garu Serial Today September 2nd: అమ్మాయి గారు సీరియల్: కోమలికి విషం రూపేనా? సూర్య రుక్మిణిని ఇంటి నుంచి గెంటేస్తాడా?
Ammayi garu Serial Today Episode September 2nd కోమలి తిన్న ఫుడ్లో విషం రుక్మిణే కలిపింది అని సూర్యప్రతాప్ అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి తినబోయే ఉప్మాలో విజయాంబిక విషం కలిపేస్తుంది. ఇక తన తండ్రికి ఎదురు వచ్చినందుకు రూప కోమలిని సీరియస్‌గా చూస్తుంది. కోమలి రూపని చూసి భయపడుతుంది. రూప కోమలితో నువ్వు ఎదురొచ్చావ్ మా నాన్నకి ఏమైనా జరగాలి నిన్ను జరిగింది గుర్తుంది కదా అని వార్నింగ్ ఇస్తుంది.
కోమలి విషం కలిపిన ఉప్మా తినేస్తుంది. రాజు, చంద్ర అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. విజయాంబిక, దీపక్‌లు కోమలికి విషం ఎక్కుతుందా లేదా అని చూస్తారు. కోమలి ఇబ్బంది పడుతుంది. ఇద్దరూ విషం పని చేస్తుందని నవ్వుకుంటారు. కోమలి విష ప్రభావం వల్ల గొంతు పట్టుకొని విలవిల్లాడిపోతుంది. కోమలి గొంతు పట్టుకొని కింద పడిపోతుంది. అందరూ కోమలి దగ్గరకు పరుగులు పెడతారు.
కోమలి నోటి నుంచి నురగ వస్తుంది. రూప, విరూపాక్షిలు ఇదో కొత్త నాటకమా అని అనుకుంటారు. రాజు వాళ్లు ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కోమలిని ఐసీయూకీ తీసుకెళ్తారు. రూపకి ఇలా అయింది ఏంటి అని చంద్రని సుమ అడుగుతాడు. దీపక్ విజయాంబికతో ఏంటి మమ్మీ ఇలా చేశావ్ మనకి సాయం చేసిన కోమలిని మనం ఇలా చేయడం ఏంటి అని అడుగుతాడు. దానికి విజయాంబిక అది మనకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు అంటుంది.
నర్స్ బయటకు వచ్చి కోమలికి బాడీ మొత్తం విషం ఎక్కిందని అంటారు. అన్నయ్య తట్టుకోలేడు అని చంద్ర అనుకుంటాడు. సూర్యప్రతాప్ హడావుడిగా హాస్పిటల్‌కి వస్తాడు. రూపకి ఏమైంది అని అడుగుతాడు. రూప నురగ కక్కుకొని పడిపోయిందని ఒళ్లంతా విషం ఉందని డాక్టర్లు చెప్పారని చంద్ర చెప్తాడు. కోమలిని చూసి సూర్యప్రతాప్ చాలా బాధ పడతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు. డాక్టర్ వాళ్లతో ఫుడ్‌లో విషం కలిసిందని చెప్తారు. ఫుడ్లో విషమా అని అందరూ నోరెళ్లబెడతారు. కోమలిని చూడటానికి లోపలికి వెళ్తారు.
రూప తల్లితో ఏంటి అమ్మా ఇది నా చేతులతో నేనే ఇచ్చాను కదా అందులోకి విషం చేరడం ఏంటి అమ్మా అని అంటుంది. ఈ అమ్మాయి ఎవరో కూపీ లాగుదాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని రాజు అంటాడు. ఇక సూర్యప్రతాప్ కోమలి దగ్గరకు వెళ్లి అమ్మా రూప అని పిలుస్తాడు. కోమలిని చూసి సూర్యప్రతాప్ ఏడుస్తాడు. రాజు విరూపాక్షి వాళ్లతో ఆ అమ్మాయి ఇలా ప్లాన్ చేసిందా అని అనుకుంటాడు. చంద్ర కోమలితో రూప ఉదయం నుంచి ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. లేదు బాబాయ్ రుక్మిణి ఇచ్చిన ఉప్మా మాత్రమే తిన్నాను అంటుంది.
విజయాంబిక రూపతో అమ్మా రుక్మిణి నువ్వు విషం కలిపావు అనడం లేదు కానీ ఉప్మా ఎలా చేశావో గుర్తు చేసుకో.. రూప ఉదయం లేచినప్పటి నుంచి తిన్నది కేవలం ఉప్మానే.. అది చేసింది ఇచ్చింది మన రుక్మిణినే కదా దానికి మనమే సాక్ష్యం కదా అని విజయాంబిక అంటుంది. సూర్యప్రతాప్ అక్క మాటలకు రుక్మిణిని అనుమానించడం మొదలు పెడతాడు. రూపని ఇరికించడానికి భలే ప్లాన్ వేశావ్ మమ్మీ మామూలు ప్లాన్ వేయలేదు అని దీపక్ అనుకుంటాడు. విజయాంబిక మాటలకు బలం ఇచ్చేలా కోమలి సూర్యప్రతాప్‌తో ఎందుకు నాన్న రుక్మిణిని నేను అంటే ఇంత పగ.. నేను తిరిగి వస్తే అందరూ నన్ను ప్రేమిస్తారు అనుకున్నా రుక్మిణి ఇలా చేసింది ఏంటి నాన్న.. ఆ ఇంటికి రావాలి అంటే భయంగా ఉంది కావాలి అంటే నన్ను ఎక్కడైనా సపరేట్‌గా ఉంచండి అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ నిన్ను సపరేట్‌గా ఉంచడం ఏంటమ్మా కావాలి అంటే నిన్ను ద్వేషించే వాళ్లే సపరేట్‌గా ఉంటారని రుక్మిణిని ఉద్దేశించి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















