Ammayi garu Serial Today September 1st: అమ్మాయి గారు సీరియల్: ముగ్గురు దుర్మార్గుల్ని చితక్కొట్టిన రాజు, రూప, విరూపాక్షిలు! కోమలి ఫుడ్‌లో విషం!
Ammayi garu Serial Today Episode September 1st కోమలి, విజయాంబిక, దీపక్‌లను రూప, రాజు, విరూపాక్షిలు చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బాంబ్ బ్లాస్ట్ వెనక కోమలి హస్తం ఉందని రాజు చెప్పడంతో రూప ఆవేశంగా నా ఫ్యామిలీ జోలికి వచ్చిన దాన్ని వదలను అని రూప ఆవేశంగా గదిలోకి వెళ్లి ఏయ్ అని అరిచి కోమలి చెంప వాయిస్తుంది. కోమలి గొంతు నులిపేసి చావ గొడుతుంది.
విరూపాక్షి, రాజులు వచ్చి రూపని ఆపుతారు. ఏంటి ఈ ఆవేశం ఆగు రూప అని విరూపాక్షి అంటుంది. రూప కోపంగా నా నాన్నని నువ్వు నాన్న అని పిలిచినప్పుడే నిన్ను చంపేయాలి అనుకున్నా కానీ సాటి ఆడదానివి అని వదిలేశా..నా భర్తని నా బిడ్డని నువ్వు దగ్గర చేసుకోవాలని ప్రయత్నించినప్పుడే చంపేయాలి అనిపించింది కానీ మా నాన్న నిన్ను నమ్మారు కాబట్టి వదిలేశా.. కానీ మా నాన్ననే చంపాలని చూస్తావా నిన్ను బతకనివ్వనే అని కోమలి గొంతు పట్టి నులిపేస్తుంది. కోమలి దాదాపు చావుని దగ్గరగా చూస్తుంది. విరూపాక్షి, రాజులు అతి కష్టం మీద రూపని ఆపుతారు. మనకు ఈ అమ్మాయి దొంగ అని తెలుసు పెద్దయ్యగారికి మాత్రం తను కూతురు అందుకే ఏం అనొద్దు అంటాడు. మనం ఏం చేయాలి అన్నా సాక్ష్యాలతో సహా నిరూపించాలని అంటారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా అని రూప వార్నింగ్ ఇస్తుంది.
కోమలి రూపకి భయపడుతూ మనసులో ఈ నాటకంలో సైడ్ క్యారెక్టర్ అయిన నన్నే ఈ రేంజ్‌లో కొట్టిందంటే అసలు క్యారెక్టర్‌లు అయిన విజయాంబిక, దీపక్‌ల పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది. దీపక్, విజయాంబికలు అశోక్‌కి ఎలా తెలిసిందా అనుకుంటారు. విజయాంబిక కొడుకుతో బాంబ్ అక్కడ ఉంది అని రాజుకి తెలిసింది అంటే పెట్టించింది మనమే అని తెలిసిపోయింటుందని అంటుంది. మనమే అని తెలిస్తే మనల్ని ఎందుకు వదిలేశాడు మమ్మీ అని దీపక్ అంటాడు. ఇంతలో రాజు నేను చెప్తా అని రూప, విరూపాక్షిలతో ఎంట్రీ ఇస్తాడు. తల్లీకొడుకులు ఇద్దరూ షాక్ అయిపోతారు. రాజు దీపక్‌ని చితక్కొడతాడు. విరూపాక్షి, రూపలు విజయాంబికని చావగొడతారు. నాకు బాంబ్ బ్లాస్ట్‌కి ఏం సంబంధం లేదని విజయాంబిక అంటుంది. అసలు నువ్వు మనిషివేనా అని ముగ్గురు ఇద్దరినీ పచ్చడి చేసేస్తారు. మీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్న ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రమాదం సృష్టిస్తూనే ఉన్నారు. రాఘవని కూడా మీరే దాచుంటారు. రాఘవ దొరికితే అప్పుడు మీ పని చెప్తా అని అంటారు. దీపక్, విజాయాంబిక దెబ్బలకు లేవలేకపోతారు.
రూప కొట్టిన దెబ్బలకు కోమలి మూతి ముఖం వంకరపోతాయి. ఉదయం కోమలి యాక్టివ్‌గా ఉండాలి అని తెగ ప్రయత్నిస్తుంది. కానీ కనీసం సరిగా నడవలేకపోతుంది. కూడా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా అనుకుంటుంది. కోమలి లాగానే దీపక్, విజయాంబికలు ముఖాలు కూడా వాచిపోయి ఉంటాయి. ఒకర్ని ఒకరు ఏమైంది అంటే బాత్‌రూంలో జారిపడ్డామని అనుకుంటారు. అందరం ఒకే సారి బాత్‌రూం జారి పడ్డాం అంటే మిమల్ని కూడా ఆ రూపే కొట్టిందా అంటే మమల్ని అంటే నిన్ను కొట్టిందా అని దీపక్ అడిగితే చంపేయలేదు అంటే అని అంటుంది. రూపని వదలకూడదు అని విజయాంబిక ప్లాన్ చేస్తుంది. ముగ్గురు గూడు పుటానీ చేస్తారు.
సూర్యప్రతాప్ కోమలిని చూసి ఏమైంది అని అడిగితే బాంబ్ బ్లాస్ట్ భయంతో నిద్ర పట్టలేదని ఆ భయంతో బాత్‌రూంలో జారిపడ్డానని అంటుంది. సూర్యప్రతాప్ కంగారు పడి డాక్టర్‌కి పిలవమని అంటాడు. కోమలి మనసులో డాక్టర్ వస్తే ఇది ఎవరైనా కొట్టిన దెబ్బలు అని తెలిసిపోతుందని అనుకుంటుంది. బంటికీ టిఫెన్ తినిపిస్తానని రూప అంటే కోమలికి కూడా ఏమైనా చేయమని సూర్యప్రతాప్ అంటాడు. విజయాంబిక కొడుకుతో మొన్న తెచ్చిన విషం ఇప్పుడు వాడే అవకాశం వచ్చింది తీసుకురా అంటుంది.
రూప కోమలి కోసం ఉప్మా చేస్తే మందారం ఆ ఉప్మాలో విషం ఇచ్చేద్దామని అంటుంది. ఆ పాపం మనకు ఎందుకులే అని రూప అంటుంది. సూర్యప్రతాప్ కోమలితో అమ్మా రూప ఏం భయపడకు అమ్మా అని అంటే దానికి రాజు ఆ భయం లేదు పెద్దయ్య తన వల్లే ప్రమాదం జరిగిందని భయపడుతుందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. తనకు గండం ఉంది కదా అని కవర్ చేస్తాడు. రూప ఉప్మా చేసి అక్కా ఉప్మా రెడీ తినేయ్ అంటుంది. సూర్యప్రతాప్ బయటకు వెళ్తుంటే సూర్యప్రతాప్‌ని విజయాంబిక ఆపి రూపని ఎదురు రమ్మని చెప్పమని అంటుంది. అసలే నడవలేకపోతుంటే ఇదేంటి అని కోమలి అనుకుంటుంది. రూప మనసులో అత్త నీకు నైట్ ఇచ్చింది సరిపోలేదా చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది. కోమలి ఎదురు రావడానికి వెళ్లినప్పుడు అందరూ హాల్‌లోకి వెళ్తారు.అప్పుడే విజయాంబిక కోమలి కోసం రూప చేసిన ఉప్మాలో విషం కలిపేస్తుంది. రూప మనసులో బాబా మా నాన్నని చంపాలి అనుకున్న దెయ్యమే మా నాన్నకి ఎదురొచ్చింది నాన్నకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి అని కోరుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















