Ammayi garu Serial Today August 28th: అమ్మాయి గారు సీరియల్: బాంబు పేలుడు: సీఎం సూర్యప్రతాప్ హత్యాయత్నం! కోమలి పాత్ర ఏమిటి? రాజు అనుమానం
Ammayi garu Serial Today Episode August 28th సూర్యప్రతాప్ భూమి పూజ చేయిస్తున్న చోట బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణిని భూమి తవ్వమని గునపం ఇస్తారు. సూర్యప్రతాప్ కోమలిని చూసి నీ చేత ఈ కార్యక్రమం చేయించడం లేదని ఫీలవుతున్నావా రూప నువ్వు రామ్మా అని అంటాడు. కోమలి చాలా భయపడుతుంది.
కోమలి కార్యక్రమం తప్పించుకోవడానికి తలనొప్పి అని నాటకం ఆడుతుంది. సూర్యప్రతాప్ పర్లేదు అని ఉండమని అంటాడు. విజయాంబిక వాళ్లని కూడా దగ్గరకు పిలుస్తాడు. ఆ చోట బాంబ్ పెట్టుండటంతో విజయాంబిక, దీపక్, కోమలి చాలా భయపడతాడు. ఇక రాజుకి అశోక్ బాంబ్ విషయం చెప్తాడు. రాజు అశోక్‌ని వదిలేసి పరుగులు పెడతాడు. ఇక సూర్యప్రతాప్ అసలైన రూపతో పాటు కోమలిని కూడా అక్కడికి పంపిస్తాడు. కోమలి కూడా గునపం పట్టుకొని గజగజా వణిపోతుంది. ఇద్దరూ కలిసి భూమిని తవ్వడానికి రెడీ అవుతారు. ఆ భయంతో కోమలి కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఏమైందా అని కంగారు పడతారు. కళ్లు తిరిగి పడిపోయింది రూపని నేను తీసుకెళ్తానని విజయాంబిక అంటే సుమ వద్దని నేను తీసుకెళ్తానని తీసుకెళ్తుంది.
సూర్యప్రతాప్ మనసులో ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటాడు. విజయాంబిక కూడా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే రుక్మిణి అత్త నువ్వు ఎక్కడికి వెళ్లిపోతున్నావ్ అత్త మీరు ఫీలవుతున్నారని నాకు తెలుసు రండి అని బలవంతంగా విజయాంబిక దీపక్‌ను తీసుకెళ్లి గునపం ఇస్తుంది. ఇద్దరిని భూమి తవ్వమని అంటారు. విజయాంబిక, దీపక్‌లు భూమి తవ్వితే బాంబ్ పేలినట్లు కలగని కంగారు పడతారు. ఇక కోమలి కారులో కూర్చొని సుమని పంపేస్తుంది. చివరకు రుక్మిణి భూమి తవ్వడానికి రెడీ అవుతుంది. రుక్మిణి తవ్వే టైంకి రాజు పరుగున వచ్చి రూపని పట్టుకొని పక్కకి పరుగెడతాడు. గునపం భూమ్మీద పడి బాంబ్ పేలిపోతుంది. మితగా అందరూ చెల్లా చెదురుగా పరుగులు పెడతారు. సూర్యప్రతాప్ దగ్గరకు సెక్యూరిటీ వస్తుంది. అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి వస్తాయి. మీడియా చేరుకుంటుంది.
సీఎం సూర్యప్రతాప్ మీద హత్యాయత్నం జరిగింది అని న్యూస్ వస్తుంది. ఇంటి దగ్గర అందరూ దాని గురించే ఆలోచిస్తుంటారు. రాజు కోమలిని అనుమానంగా చూస్తాడు. కోమలి కంగారు పడుతుంది. సూర్యప్రతాప్ అందరితో బంటీ అక్కడికి వచ్చుంటే వాడికి ఏమైనా అయింటే అని చాలా కంగారు పడతాడు. చంద్ర అన్నతో ఇదంతా ప్రతిపక్ష పార్టీల పనే అయింది. మనం మంచి పనులు చేయడం తట్టుకోలేక ఇలా చేసుంటారని అంటాడు. విజయాంబిక, దీపక్‌లు తమ మీద అనుమానం లేదని అనుకుంటారు. ఇక పోలీసులు వస్తారు. అందరితో బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేయించారో తెలీదు కానీ ప్రతి పక్ష నేతల మాత్రం కాదని చెప్తారు. అన్ని ఎంక్వైరీలు చేశాం మిగతా నేతలు కాదని ఫోన్లు ట్రాప్ చేశామని అంటారు. ఫోన్లు ట్రాప్ చేశారని దీపక్ కంగారు పడితే జీవన్ చూసుకుంటాడని అంటుంది. ఇక కోమలి కూడా చాలా కంగారు పడుతుంది. ఇదంతా ఎవరు చేయించుంటారు దీని వెనక కోమలికి సంబంధం ఉందేమో అని రాజు అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















