Ammayi garu Serial Today August 26th: అమ్మాయి గారు సీరియల్: తమ్ముడి ఫ్యామిలీ మొత్తాన్ని పొట్టన పెట్టుకోవడానికి విజయాంబిక ప్లాన్! జీవన్ ఏం చేస్తాడు?
Ammayi garu Serial Today Episode August 26th సూర్యప్రతాప్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని విజయాంబిక జీవన్‌తో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌కి ఇళ్లపట్టాల పంపిణీకి పిలుస్తుంది. సూర్యప్రతాప్ వస్తానని అంటాడు. విరూపాక్షి చాలా సంతోషంతో ఇప్పుడే ఇక్కడే ఓ నిర్ణయం తీసుకున్నా ఇళ్ల పట్టాల పంపిణీ సూర్యప్రతాప్ చేతి మీదగా జరుగుతుంది. భూమి పూజ నా కూతురిగా నీ చేతుల మీదగా జరిపిస్తా అంటుంది.
విరూపాక్షి మాటలు విని విరూపాక్షి సంతోషం చూసిన విజయాంబిక రగిలిపోతుంది. దీపక్ తల్లితో అత్తయ్య పేరు వినే మామయ్య అత్తయ్య చెప్పిన ప్రతీ దానికి తలాడిస్తున్నాడు వాళ్ల వాలకం చూస్తే ఒక్కటైపోయేలా ఉన్నారని అంటాడు. రూప రుక్మిణిగా మారినప్పటి నుంచి విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గర అయిపోతున్నారు. ఎమ్మెల్యే పదవి అడ్డు పెట్టుకొని సూర్యప్రతాప్‌కి విరూపాక్షి దగ్గరవుతుందని రాజు రూపల వల్లే ఇదంతా జరుగుతుందని కాబట్టి అందర్ని లేపేయాలని అంటుంది. ఇళ్ల పట్టాల పంపిణీ టైంలో మొత్తం ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేద్దామని అంటుంది.
దీపక్ తల్లితో ఇదంతా జరుగుతుందా అని అడిగితే మన చేతికి మట్టి అంటకుండా చేయాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అని అంటుంది. మరోవైపు రాజు కోమలిని చూసి రాత్రి పూట అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తుందని కోమలి దగ్గరకు వెళ్తాడు. ఏయ్ అని రాజు పిలుస్తాడు. ఏయ్ అని పిలుస్తావేంటి నీ పెళ్లాన్ని పిలిచినట్లు పిలుస్తావేంటి అంటుంది కోమలి. దాంతో రాజు నా పెళ్లాం అనే అందరితో చెప్పావ్ కదా నువ్వు అసలు రూప కాదు అని నీతోనే చెప్పిస్తా అని అంటాడు. నా మొగుడు అని అందరితో చెప్పావ్ కదా పద గదిలోకి అని అంటాడు.
కోమలి షాక్ అయిపోతుంది. రాజు కోమలి సంగతి చెప్తా అని గదికి వెళ్లాడు కోమలి దగ్గరకు వెళ్లి నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చావో తెలుసా నాకు నా భార్యకి శోభనం జరిగే రోజు నువ్వు ఈ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టావ్ అప్పుడు ఆగిపోయిన కార్యం ఇప్పుడు అని అంటాడు. కోమలి అరిచి గోల చేస్తానని అంటుంది. చేయ్ నువ్వు ఎవరికి ఏం చేయలేవ్ నువ్వే రూపవి నేను నీ మొగుడుని అని చెప్పావ్ కదా అని అంటాడు. రాజు నేను నీ భర్తని నాకు నో చెప్పే రైట్ నీకు లేదు అని దగ్గరకు వెళ్తే కోమలి గది మొత్తం పరుగులు పెడుతుంది. తీరా చూస్తే అదంతా కోమలి కల ఇలా జరుగుతుందా అని షాక్ అయిపోతుంది.
ఇంతలో రూప అక్కడికి వచ్చి ఇలాంటి వాళ్లతో మాటలు కూడా అనవసరం త్వరలోనే తను పెట్టే బెడా సర్దుకొని వెళ్లిపోతుందని అంటుంది. కోమలి మనసులో పెట్టాబేడాతో కాదు ఆస్తులతో వెళ్లిపోతా అనుకుంటుంది. మరోవైపు విజయాంబిక జీవన్‌కి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం జీవన్‌కి చెప్తుంది. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు నేను చూసుకుంటా అని అంటాడు. దెబ్బకి అందరూ పోతారని విజయాంబిక అనుకుంటుంది. ఇంతలో కోమలి వచ్చి ఏంటి విజయాంబిక గారు అని అడుగుతుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు.
కోమలి రాగానే విషయం చెప్పకుండా కవర్ చేస్తుంది విజయాంబిక. జీవన్ అశోక్‌కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఇక కోమలి అశోక్‌ని గోవా వెళ్లిపోమని చెప్పానని అంటుంది. దీపక్ విజయాంబికతో కోమలికి ఎందుకు విషయం చెప్పలేదు అని అంటాడు. అందరూ పోయి అది మిగిలితే మనల్ని ఆస్తి కోసం బెదిరిస్తుందని అంటుంది. ఇక జీవన్ ఆశోక్‌కి ప్లాన్ చెప్తాడు. ఉదయం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అందరూ వస్తారు. జీవన్ అందరి పని అయిపోతుందని అన్నట్లు నవ్వుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















