Minnal Murali Telugu Trailer: ‘మిన్నల్ మురళి’ తెలుగు ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’
టొవినో థామస్ సూపర్ హీరోగా తెరకెక్కిన ‘మిన్నల్ మురళి’ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్’ గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న టొవినో థామస్.. ఈసారి సూపర్ హీరోగా వచ్చేస్తున్నాడు. మలయాళంలో ‘మిన్నల్ మురళి’ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రంతో టొవినో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నాడు. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయరు. నేరుగా ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా శుక్రవారం ‘మిన్నల్ మురళి’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇంకా కన్నడం, హిందీ, తమిళంలో కూడా రిలీజ్ కానుంది.
హీరో మురళి ఓ గ్రామంలో నివసిస్తుంటాడు. ఓ రోజు అతడిపై పిడుగు పడుతుంది. దీంతో అతడి గుండె ఆగుతుంది. వైద్యులు ఎట్టకేలకు అతడికి ప్రాణం పోస్తారు. అయితే, పిడుగుపాటు తర్వాత అతడి శరీరంలో మార్పులు వస్తాయి. చిన్న శబ్దాలు కూడా అతడికి పెద్దవిగా వినిపిస్తాయి. అతడికి ఊహించనంత బలం, శక్తి వస్తుంది. మన హాలీవుడ్ సినిమాల్లో చూపించే ‘సూపర్ హీరో’లా మారిపోతాడు.
Also Read: సామి సామి.. ‘పుష్ప’లో మూడో పాట వచ్చేసిందిరా సామి!
మురళి తాను కూడా సూపర్ హీరోలా ఎగరగలనో లేదో తెలుసుకొనేందుకు చెట్టు మీద నుంచి కిందకి దూకుతాడు. కింద పడటంతో ఎగరలేనని తెలుసుకుంటాడు. మరి మురళికి ఎలాంటి సూపర్ పవర్స్ వస్తాయి? అతడి శక్తి వల్ల ఆ గ్రామానికి మేలు జరుగుతుందా? పోలీసులు అతడి గురించి ఎందుకు వెతుకుతారు? సూపర్ హీరోగా మారిన తర్వాత అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది బుల్లితెరపైనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే.. టొవినో పాత్ర చాలా కామెడిగా ఉంది. మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబరు 24 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
‘మెరుపు మురళి’ ట్రైలర్:
‘మెరుపు మురళి’ తెలుగు టీజర్:
టొవినో థామస్‌కు ఓటీటీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘కాలా’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయే కుక్క వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వైరంతో నడిచే కథ ఇది. ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి