అన్వేషించండి
Advertisement
Pushpa Saami: సామి సామి... 'పుష్ప'లో మూడో పాట వచ్చేసిందిరా సామి!
#SaamiSaami : అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. ఇందులో మూడో పాట 'సామి సామి...'లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు.
'పుష్ప'లో తొలి పాట పూర్తిగా తాత్విక కోణంలో సాగింది. బతుకు పోరాటంలో ఓ జీవి మరో జీవిని మింగేస్తుందని చెప్పారు. బహుశా... సినిమాలో జాతర నేపథ్యంలో హీరో పరిచయ గీతంగా వస్తుందేమో! ఇక, రెండో పాట 'శ్రీవల్లీ...' కథానాయికను చూస్తూ... కథానాయకుడు పాడుకునే పాట. మూడో పాట 'సామి సామి...' హీరో కోసం హీరోయిన్ పాడే పాట. రెండు రోజుల క్రితం ప్రోమో విడుదల చేసిన టీమ్... గురువారం లిరికల్ వీడియో విడుదల చేసింది.
తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఆల్రెడీ విడుదలైన రెండు పాటలనూ ఆయనే రాశారు. ఈ పాటకూ చక్కటి సాహిత్యం అందించారు. దీనిని మౌనికా యాదవ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. బంగారు సామి, మీసాల సామి, రోషాల సామి - హీరోను ఎన్ని రకాలుగా హీరోయిన్ చూస్తుందో చెపారు. అలాగే, ఆల్రెడీ హీరోను తన భర్తగా ఊహించుకుంటుందని చంద్రబోస్ అందంగా వివరించారు.
హీరో పక్కన కూర్చుంటే... పరమేశ్వరుడు దక్కినట్టు ఉందని హీరోయిన్ చేత చెప్పించారు. హీరో హీరోయిన్లను ఆది దంపతులతో పోల్చారు. హీరో 'రెండు గుండీలు ఇప్పి గుండెను చూపిస్తే... పాలకుండ లెక్క పొంగిపోదా సామి' అంటూ చంద్రబోస్ పదప్రయోగం కూడా చేశారు. పాటను మాసీగా చిత్రీకరించినట్టు లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్ హుక్ స్టెప్ అక్కట్టుకునేలా ఉంది. పాట చివర్లో 'తగ్గేదే లే...' మేనరిజమ్ ను హీరోయిన్ చేత చేయించారు.
తమిళంలో రాజ్యలక్ష్మి సేంతిగణేష్ 'సామి... సామి...'ను ఆలపించారు. వివేక సాహిత్యం అందించారు.
మలయాళంలో ఈ పాటను సిజు తురావూర్ రాయగా... సితార కృష్ణకుమార్ పాడారు.
కన్నడలో అనన్యా భట్ ఆలపించగా... వరదరాజ చిక్కబళ్లాపుర సాహిత్యం అందించారు.
అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న 'పుష్ప' ఫస్ట్ పార్ట్ ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, అంతకంటే ముందు రావడాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు.
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion