అన్వేషించండి

Chinni Serial Today February 26th:చిన్ని సీరియల్: మధు మెడ పట్టుకొని గెంటేసిన మ్యాడీ! జీవితంలో ముఖం చూస్తాడా లేదా!

Chinni Serial Today Episode February 26th మ్యాడీ మధుని మెడ పట్టుకొని బయటకు గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode  మ్యాడీ మధుకి ప్రపోజ్ చేసినట్లు చేసి ఇదే కదా నీకు కావాల్సింది చిన్ని.. అని తనకు చిన్నినే మధు అని తెలిసిపోయిందని అంటాడు. కావాలనే నా దగ్గర నిజం దాచవని అన్నీ కావాలనే చేశావని అంటాడు. ఇద్దరం గుడిలో ఇరుక్కున్నప్పుడు నువ్వే చిన్ని అని చెప్పలేదు.. పెళ్లి అప్పుడు చెప్పలేదు.. ఇంట్లో పెళ్లి తంతు టైంలో కూడా చెప్పలేదు.. చివరకు మనకు ఫస్ట్‌ నైట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా చెప్పలేదు.. నువ్వే చిన్ని అని తెలీక నువ్వు నన్ను భర్తగా భావిస్తున్నావని తెలిసి నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పలేదు.. అని అంటాడు.

మధు ఏం మాట్లాడకుండా అలా చూస్తుంటుంది. ఆ రోజు గుడిలో నువ్వు కావాలనే రప్పించి తాళి కట్టించుకున్నావ్ కదా అంటాడు. స్వరూప, సుబ్బులు మధు అలా చేయలేదు ఒట్టు అంటే మీరు ఒట్టేసే అదే అబద్ధం చెప్తున్నారు. మధు ఎంత మోసం చేసిందో మీరు అంతే మోసం చేశారు.. మీలాంటి వాళ్లకి మా ఇంట్లో ఉండే అర్హత లేదు అని మధుని ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాడు. మధుని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. నీ ముఖం మళ్లీ నీ ముఖం నాకు చూపించకు అని చెప్తాడు. మధు ముఖం మీద డోర్ వేసేస్తాడు. మధు అలియాస్ చిన్ని చాలా ఏడుస్తుంది. స్వరూప, సుబ్బులు చిన్నిని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని ఇంటికి వెళ్తారు. మధు ఏడుస్తూ ఉంటుంది.

మ్యాడీ ఇంట్లో శ్రేయ, వసంత సంతోషంగా స్వీట్స్ తినిపించుకుంటారు. నాగవల్లి సంతోషంగా ఉంటుంది. ప్రమీల బాధగా ఉంటుంది. మధుని ఇంటికి తీసుకొచ్చి తలా ఓ దిక్కు కూర్చొని ఏడుస్తారు. మ్యాడీ ప్రమీలని పట్టుకొని ఏడుస్తాడు. మధు నన్ను ఎంత మోసం చేసింది అని మ్యాడీ అంటే మధు అలా చేసింది అంతే ఏదో కారణం ఉంటుంది అని అంటాడు. మధుని నేను క్షమించను అని మ్యాడీ అంటాడు. జరిగింది ఏదో జరిగింది నీ భార్యని ఇంటికి తీసుకురా నాన్న అంటే నువ్వేం మాట్లాడుతున్నావ్ పెద్దమ్మా మా అమ్మని చంపిన ఆవిడ కూతురిని ఇంటికి తీసుకురమ్మని అంటావా అంటాడు. తను ఈ ఇంటి కోడలు మధుగా వచ్చింది.. తను కావాలని రాలేదు.. నీ అంతట నువ్వే తాళి కట్టి తీసుకొచ్చి.. నువ్వే భార్యని చేశావ్,, నువ్వే తీసుకొచ్చి నువ్వే గెంటేయడం నీ తప్పు అవుతుందని ప్రమీల అంటుంది. తప్పు చేసింది ఆ చిన్ని అని మ్యాడీ అంటాడు.

మధు ఏడుస్తూ గదిలో కూర్చొని ఉంటుంది. స్వరూప, సుబ్బులు మధు గురించి ఆలోచిస్తూ బాధ పడతారు. మధు తినడం లేదు కనీసం పాలు కూడా తాగలేదు అని బాధ పడతారు. భర్తకి దూరం అయి కావేరి జీవితం లాగే చిన్ని జీవితం కూడా ఇలాగే అయిపోయింది అని బాధ పడతారు. దేవా నాగవల్లితో ఒకే దెబ్బతో రెండు పిట్టలు అయిపోయావి.. మధునే చిన్ని అనుకోలేదు అని అంటాడు. నాకు మాత్రం మధునే చిన్ని అని తెలుసు అంటుంది. నాకు ఎందుకు చెప్పలేదు అని దేవా షాక్ అయితే నీ ఆవేశం ఆపలేం అని చెప్పలేదు అంటుంది. దేవా మనసులో మధుని చంపేయాలి అని అనుకుంటాడు. చిన్ని బాలరాజులను ఇక చంపేద్దాం అని రేపే ముహూర్తం పెడదాం అని నాగవల్లి అంటుంది. మధు ఏమైనా చేసుకుంటుందా అని సుబ్బు అనడంతో స్వరూప టెన్షన్ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget