అన్వేషించండి

Vijay Deverakonda Rashmika Net Worth : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Deverakonda Rashmika Wedding : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఈ నెల 26న జరగనుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ కపుల్ ఆస్తుల విలువెంతో ఓసారి చూస్తే...

Vijay Deverakonda Rashmika Mandanna Net Worth : టాలీవుడ్ బెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఈ నెల 26న జరగనుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా... మరోవైపు అటు విజయ్ నుంచి ఇటు రష్మిక నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. వీరి పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్‌గా పేరొందిన ఈ కపుల్ ఆస్తుల నికర విలువ ఓసారి చూస్తే...

విజయ్ దేవరకొండ నెట్ వర్త్

'నువ్విలా' మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీతో స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గీత గోవిందంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. తన నటనతో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఓసారి చూస్తే... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ లగ్జరీ భవనంలో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నారు. దీని విలువ రూ.15 కోట్లు అని తెలుస్తోంది. ఆయన వద్ద BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC9,0 రేంజ్ రోవర్‌తో సహా ఇతర కార్లు ఉన్నాయి. ఆంగ్ల మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ఆయనకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల్లో విజయ్ ఒకరు. దాదాపు రూ.70 కోట్ల నెట్ వర్త్ విజయ్ దేవరకొండ కలిగి ఉన్నట్లు వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఈవెంట్స్‌తో పాటు తన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఫ్యాషన్ పట్ల విజయ్‌కు ఎంతో ఇష్టం ఉంది. దీంతో ఆయన సొంత స్ట్రీట్ వేర్ బ్రాండ్ రౌడీ వేర్ డిజైన్ చేసుకున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే ప్రొఫెషనల్ పురుషుల వాలీబాల్ జట్టుకు కూడా ఆయన కో ఓనర్. విజయ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం దాదాపు రూ.కోటి. పెయిడ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కోసం రూ.40 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read : లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్

రష్మిక నెట్ వర్త్

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక. ఫోర్బ్స్ ప్రకారం, రష్మిక నెట్ వర్త్ రూ.66 కోట్లు. బెంగుళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌తో పాటు హైదరాబాద్, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌ల్లో కూడా ఆస్తులు కలిగి ఉంది. FE నివేదిక ప్రకారం ఆమె ఒక చిత్రానికి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ లాగా ఈమె వద్ద కూడా ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడిస్ బెంజ్ సి క్లాస్ లగ్జరీ కార్లను కలిగి ఉంది.

ఇక ఈ నెల 26న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్‌లో విజయ్, రష్మికల పెళ్లి కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని ప్రచారం సాగుతుండగా... హైదరాబాద్‌ తాజ్ కృష్ణ లగ్జరీ హోటల్‌లో మార్చి 4న రిసెప్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kiran Abbavaram : మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం? - డైరెక్టర్ డెబ్యూ మూవీలో హీరో ఎవరో తెలుసా!
మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం? - డైరెక్టర్ డెబ్యూ మూవీలో హీరో ఎవరో తెలుసా!
Yogi Babu : ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
Oscars 2026 : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget