అన్వేషించండి

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!
ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబోలో వచ్చిన ‘KGF’ సిరీస్‌ చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అద్భుతమైన ప్రేక్షకాదరణతో థియేటర్లు కిటకిటలాడాయి. బాక్సాపీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది.  యశ్, ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడంతో, మూడో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా  ‘KGF3' గురించి చిత్ర నిర్మాణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్
 రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియన్ మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మార్నింగ్ షో సమయంలో నెగెటివ్ టాక్ వినిపించినా, ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసేందుకు పోటెత్తారు. రివ్యూలతో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, రెండో  కలెక్షన్స్  భారీగా తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే తొలి రోజుతో పోల్చితే రెండో రోజు సగానికి పైగా కలెక్షన్లు పడిపోయాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జోడీగా ఆలియా భట్ నటించారు. హిందీ దర్శకుడు మహేష్ భట్, నటి సోనీ దంపతుల కుమార్తె ఆమె. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. ఆమె తాతయ్య నటుడు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే... స్టార్ కిడ్! 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ కూడా స్టార్ కిడ్ అని టాక్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ నటుడు సిద్ధార్ నటించిన తాజా చిత్రం ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’). ఈ నెల 28న తమిళంతో పాటు కన్నడలో ఒకేసారి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం కర్నాటకకు వెళ్లిన సిద్ధార్థ్ కు ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతుండగా, కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపేయాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను కర్నాటకలో ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?
కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి బలంగా ప్రూవ్ చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie). కంటెంట్ ఉన్న కథకు స్టార్స్ సపోర్ట్ చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుందో కూడా బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు... థియేటర్లలో జనాల నవ్వులే చెప్పాయి. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సినిమాల్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒకటి. థియేటర్లలో నవ్వించిన ఈ సినిమా... ఇప్పుడు ఓటీటీల్లో నవ్వించడానికి వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget