అన్వేషించండి

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సిద్ధార్థ్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘చిన్నా’. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ ను కర్ణాటకలో ఆందోళనకకారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళ నటుడు సిద్ధార్ నటించిన తాజా చిత్రం ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’). ఈ నెల 28న తమిళంతో పాటు కన్నడలో ఒకేసారి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం కర్నాటకకు వెళ్లిన సిద్ధార్థ్ కు ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతుండగా, కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపేయాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను కర్నాటకలో ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

బెంగళూరు అవమానంపై స్పందించిన సిద్ధార్థ్

తాజాగా కర్ణాటకలో తనకు ఎదురైన ఘటనపై హీరో సిద్ధార్థ్‌ రియాక్ట్ అయ్యారు. బెంగళూరులో తన ప్రెసెమీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడం బాధ కలిగించిందన్నారు. తన సినిమాకు, అక్కడ జరుగుతున్న కావేరి జలాల వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడం మూలంగా చిత్ర నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘’చిన్నా’ సినిమా నిర్మాతగా రిలీజ్ కు ముందే ఈ సినిమాను చాలా మందికి చూపించాలి అనుకున్నాను. చెన్నైలో కొంత మందికి చూపించాను. అలాగే బెంగళూరులో మీడియా ప్రతినిధులకు ఈ సినిమా చూపించాలి అనుకున్నాను. 2 వేల మంది విద్యార్థులకు కూడా చూపించాలి అనుకున్నాను. కానీ, బంద్ కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీని వల్ల నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది” అని సిద్ధార్థ్ చెప్పారు.

నా సినిమాకు కావేరి జల వివాదానికి సంబంధం లేదు- సిద్ధార్థ్

అటు తన సినిమాకు కావేరి జల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని సిద్ధార్థ్ వివరించారు. “ప్రెస్ మీట్ తర్వాత బెంగళూరులో పలువురికి ఈ సినిమా చూపించాలి అనుకున్నాను. కానీ, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ వస్తోంది. నా చిత్రాలు కేవలం సామాజిక బాధ్యతతోనే చేస్తున్నాను. ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నా సినిమాకు కావేరి జల వివాదానికి సంబంధమే లేదు” అన్నారు.

క్షమాపణలు చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌, శివరాజ్‌ కుమార్‌

సిద్ధార్థ్ ప్రెస్ మీట్ ను కావేరి జలాల ఆందోళనకారులు అడ్డుకోడంపై పలువురు కన్నడ నటుడు  క్షమాపణలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌, శివరాజ్‌ కుమార్‌ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ ప్రజల తరఫున సారీ చెప్పారు.    

తెలుగులో అక్టోబర్ 6న విడుదల

ఇక ‘చిన్నా’ సినిమా సిద్ధార్థ్  సొంత బ్యానర్‌ ఎతకీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది.  ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మలయాళ నటి నిమిషా సాజయన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కూడా 28న విడుదల కావాల్సి ఉన్నా, ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు’ సినిమాలు క్యూ కట్టడంతో అక్టోబరు 6కు వాయిదా వేశారు.

Read Also: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Embed widget