Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ కుమార్తెను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జోడీగా ఆలియా భట్ నటించారు. హిందీ దర్శకుడు మహేష్ భట్, నటి సోనీ దంపతుల కుమార్తె ఆమె. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. ఆమె తాతయ్య నటుడు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే... స్టార్ కిడ్! 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ కూడా స్టార్ కిడ్ అని టాక్.
రామ్ చరణ్ జోడీగా రషా తడానీ?
రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా రషా తడానీ (Rasha Thadani) పేరు పరిశీలిస్తున్నారట. ఇంతకీ, ఎవరీ అమ్మాయని ఆలోచిస్తున్నారా?
బాలకృష్ణ సరసన 'బంగారు బుల్లోడు', నాగార్జున సరసన 'ఆకాశ వీధిలో' సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా. రవీనా భర్త ఎవరో తెలుసుగా? ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అనిల్ తడానీ!
Look Test For RC 16 Heroine : రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా కోసం రషా తడానీకి ఇటీవల లుక్ టెస్ట్ చేశారట. దాంతో RC 16 టీమ్ హ్యాపీగానే ఉందట. యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మరో వర్క్ షాప్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో కూడా రషాకు పాస్ మార్క్స్ వస్తే సెలెక్ట్ అయినట్లే! లేదంటే మరొక కథానాయికను వెతికే పనిలో బుచ్చి బాబు ఉంటారు.
హిందీలో 'రాక్ ఆన్', 'కేదార్ నాథ్' సినిమాల ఫేమ్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రషా తడానీ ఒక సినిమా చేస్తున్నారు. అందులో అజయ్ దేవగణ్ ఫ్యామిలీకి చెందిన అమన్ హీరో. అయితే... ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అందుకుని, రషాకు లుక్, యాక్టింగ్ టెస్ట్‌లు!
Also Read : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా - బాలీవుడ్ హీరోయిన్
రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాకు మీరు సంగీతం అందిస్తున్నారని కొన్ని రోజులుగా వింటున్నాం. నిజమేనా సార్? అని ఆ మధ్య ఉదయనిధి స్టాలిన్ 'నాయకుడు' సినిమా ఇంటర్వ్యూలో అడిగితే... ''అవును, మా మధ్య చర్చలు జరుగుతున్నాయి'' అని ఏఆర్ రెహమాన్ సమాధానం ఇచ్చారు. 'గేమ్ ఛేంజర్' కంప్లీట్ అయ్యాక... బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన దర్శకుడు... లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial