Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి కొందరు నటీమణులు గతంలో చెప్పారు. ఇప్పుడు నటి ఈషా గుప్తా కూడా తన కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించారు.
ఈషా గుప్తా (Esha Gupta) గుర్తు ఉన్నారా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో 'ఏక్ మార్ ఏక్ మార్ డప్పేసి స్టెప్ మార్' పాటలో డ్యాన్స్ చేసిన నార్త్ ఇండియన్ లేడీ! హిందీ చిత్రసీమలోని మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. సోషల్ మీడియాలో బోల్డ్ బికినీ ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
అవుట్ డోర్ షూటింగ్ చేస్తుంటే...
ఇద్దరు కలిసి ట్రాప్ చేయాలని చూశారు!
రెండు సినిమాల విషయంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు ఈషా గుప్తా తెలిపారు. ఆ రెండు సినిమాల్లో ఒక సినిమా చిత్రీకరణ అవుట్ డోర్ లో చేస్తున్నప్పుడు ఇద్దరు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆమె వివరించారు.
''అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నాం. ఇద్దరు కలిసి నన్ను ట్రాప్ చేయాలని చూశారు. ఆ విషయం నాకు అర్థం అయ్యింది. అయినా సరే నేను ఆ సినిమా చేశారు. వై? ఎందుకు? అని నన్ను కొందరు అడగొచ్చు. అది చిన్న సినిమా. ఆపేస్తే ఇబ్బంది పడతారు. అవుట్ డోర్ షూటింగ్ అయితే వాళ్ళ వలలో నేను చిక్కుతానని ఆ ఇద్దరూ అనుకున్నారు. వాళ్ళ కంటే నేను స్మార్ట్! నాకు ఒంటరిగా నిద్రపోవడం అలవాటు లేదని చెప్పా. నా మేకప్ ఆర్టిస్ట్ కూడా నాతో పాటు నా రూంలో ఉంటారని చెప్పా. మేకప్ ఆర్టిస్ట్ ను పిలిచి నిద్రపోయా'' అని ఈషా గుప్తా తెలిపారు.
Also Read : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?
View this post on Instagram
మరొక సినిమా చిత్రీకరణ సగం పూర్తి చేసిన తర్వాత కో ప్రొడ్యూసర్ తనను చాలా ఇబ్బంది పెట్టారని ఈషా గుప్తా వివరించారు. ''సగం సినిమా పూర్తి అయ్యింది. వాళ్ళు అడిగిన దానికి నేను 'నో' చెప్పా. దాంతో నన్ను సెట్ లో చూడకూడదని, చూడటం తనకు ఇష్టం లేదని దర్శకుడికి చెప్పారు. నేను ఏం చేశాను? ఆ తర్వాత చాలా మంది నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఆ అమ్మాయి ఏమీ చేయదని, ఆమెను తీసుకోవడం ఎందుకని మిగతా దర్శక నిర్మాతలతో ఆ కో ప్రొడ్యూసర్ చెప్పినట్లు విన్నాను'' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చారు.
స్టార్ కిడ్స్ పేరెంట్స్ చంపేస్తారని భయం!
ఇండస్ట్రీకి బయట నుంచి వచ్చే అమ్మాయిలతో పిచ్చి పిచ్చి వేషాలు వేసే వ్యక్తులు స్టార్ కిడ్స్ విషయంలో ఆ విధంగా చేయరని ఈషా గుప్తా పేర్కొన్నారు. ఒకవేళ స్టార్ కిడ్స్ విషయంలో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే తమను చంపేస్తారని వాళ్ళు చాలా భయపడతారని వివరించారు. అవుట్ సైడర్స్ పట్ల వివక్ష చూపించే వ్యక్తుల మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ప్రభాస్, నయనతారే కాదు... విష్ణు మంచు 'కన్నప్ప'లో మలయాళ స్టార్ కూడా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial