News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mohanlal in Kannappa : ప్రభాస్, నయనతారే కాదు... విష్ణు మంచు 'కన్నప్ప'లో మలయాళ స్టార్ కూడా!

Vishnu Manchu Kannappa Movie Updates : విష్ణు మంచు టైటిల్ పాత్రలో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప'. ఈ సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నట్లు తెలిసింది.

FOLLOW US: 
Share:

యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలని కొన్ని రోజులుగా విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ భాషల్లో విడుదల చేసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం.

విష్ణుతో పాటు ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో నటించనున్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరూ శివ పార్వతులుగా కనిపిస్తారని సమాచారం. వీళ్లకు తోడు మరో సూపర్ స్టార్ కూడా సినిమాలో జాయిన్ కానున్నారు. 

'కన్నప్ప'లో మోహన్ లాల్ కూడా!
Mohanlal Cameo In Kannappa Movie : ప్రభాస్, నయనతారే కాదు... మోహన్ లాల్ సైతం 'కన్నప్ప'లో ఓ అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారట. ప్రస్తుతానికి ఆయన పాత్ర ఏమిటి? అనేది సస్పెన్స్. 

Also Read 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.

ఇంతకీ, మెయిన్ హీరోయిన్ ఎవరు?
ప్రభాస్, నయన్, మోహన్ లాల్... ఇంకా సినిమాలో చాలా మంది అగ్ర తారలు నటించనున్నట్లు తెలిసింది. విష్ణు గానీ, యూనిట్ సభ్యులు గానీ అధికారికంగా వెల్లడించానికి ముందు లీక్స్ వస్తున్నాయి. 'కన్నప్ప'లో నయనతార ఉన్నట్లు సీనియర్ కథానాయిక మధుబాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షూటింగ్ స్టేటస్ తప్ప అప్డేట్స్ ఇవ్వకూడదని విష్ణు డిసైడ్ అయ్యారట. 

Also Read : పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు - హరీష్ శంకర్ ఇచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్ చూశారా?

అయితే... విష్ణు సరసన నటించబోయే మెయిన్ హీరోయిన్ ఎవరు? అనే క్వశ్చన్ మొదలైంది. తొలుత ఈ సినిమాలో కథానాయికగా నుపుర్ సనన్ నటించనున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు కూడా! అయితే... డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా నుపుర్ సనన్ సినిమా చేయడం లేదని విష్ణు మంచు ట్వీట్ చేశారు. త్వరలో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Sep 2023 01:02 PM (IST) Tags: Vishnu Manchu Prabhas Mohanlal Kannappa Movie Latest Telugu News Pan India Project

ఇవి కూడా చూడండి

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన

Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

టాప్ స్టోరీస్

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం