Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Manchu Update: మంచు విష్ణు రావడంతో జల్‌పల్లిలోని మంచు హౌస్‌లో ఘర్షణ జరుగుతోంది. మనోజ్‌తో పాటు అతని అనుచరుల్ని విష్ణు బయటకు గెంటేయించారు.
Tension At Manchu House in Jalpally: మంచు కుటుంబంలో వివాదం రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. మంచు విష్ణు దుబాయ్ నుంచి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన విష్ణు.. జల్ పల్లి నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడ మంచు మనోజ్ తన మునుషులతో ఉన్నారు . తాను తెప్పించిన బౌన్సర్లతో మనోజ్ తో పాటు ఆయకు చెందిన మనుషుల్ని ఇంటి నుంచి బయటకు పంపి గేట్లు వేయించారు.
ఆత్మ గౌరవ పోరాటం అన్న మంచు మనోజ్
ఆస్తి కోసం .. డబ్బుల కోసం తాము పోరాడటం లేదని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నామన్నారు. తనను తొక్కేసేందుకు తన భార్య, పిల్లల ప్రస్తావన తీసుకు వచ్చారని మనోజ్ పరోక్షంగా మోహన్ బాబుపై విమర్శలు గుప్పించారు. రక్షణ కల్పించాలని పోలీసులు కోరినా పట్టించుకోలేదన్నారు. బౌన్సర్లను తరిమేయకుండా పోలీసులే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన మేటర్ అన్నారు. బయటకు పంపేయడంతో ఇంటి ఎదుటే మంచు మనోజ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
అన్ని ఇళ్లల్లో ఉండే సమస్యలేనన్న విష్ణు, మోహన్ బాబు
ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు .. తమ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయన్నారు. చిన్న కుటుంబ సమస్యకు ఇంత పెద్ద ప్రచారం ఇవ్వడం సరి కాదని అన్నారు. త్వరలోనే తమ కుటంబంలో అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. మరో వైపు మోహన్ బాబు కూడా అన్నదమ్ముల మధ్య సమస్య ప్రతి కుటుంబంలో ఉంటాయని.. తమ కుటుంబంలోనూ సమసిపోతాయన్నారు. ఎన్నో కుటుంబాల్లో సమస్యలను తీర్చానని.. తమ కుటుంబంలో సమస్యను కూడా తీర్చుకుంటానని అన్నారు.
Also Read: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
జల్ పల్లి మంచు టౌన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
మరో వైపు జల్ పల్లిలో ఉన్న మంచు నివాసం దగ్గర అటు మనోడ్, ఇటు విష్ణు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత కొంత సేపు ఘర్షణ కూడా జరిగింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో కానీ.. మంచు కుటుంబంలో హైడ్రామా పోలీస్ స్టేషన్లు, కేసుల వరకూ చేరింది. మనోజ్ ఈ విషయంలో పోరాడాలని అనుకుంటున్నారు. ఆయన ఇప్పటి వరకూ నేరుగా మోహన్ బాబుపై కానీ, విష్ణుపై కానీ ఫిర్యాదు చేయలేదు. ఇంటి నుంచి కూడా పంపేయడంతో మంచు మనోజ్ తర్వాత ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సమస్య పరిష్కారం అవుతుందని చెబుతూ వస్తున్న విష్ణు, మోహన్ బాబు చర్చలకు అవకాశం లేకుండా మనోజ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు మంచు లక్ష్మి సోమవారం హైదరాబాద్ వచ్చినా.. ఎవరూ తన మాట వినే పరిస్థితి లేదని మళ్లీ ముంబై వెళ్లిపోయారు.