Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Ram Gopal Varma News: ఆంధ్రప్రదేశ్‌లో వివధ ప్రాంతాల్లో నమోదు అయిన కేసుల్లో ఆర్జీవీకి ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Ram Gopal Varma Gets Bail From AP High Court: వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టారన్న కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన కేసుల్లో ఆర్జీవీకి ఊరట లభించింది. షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు వైసీపీకి అనుకూలంగా ట్వీట్ చేసిన రామ్‌గోపాల్ వర్మ... టీడీపీని చంద్రబాబును, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శలు చేశారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు, పార్టీ నేతలు దాదాపు 8 ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలో నమోదు అయిన కేసుల్లో భాగంగా పోలీసులు ఆర్జీవీ నోటీసులు ఇచ్చారు. తనకు టైం లేదని కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తాను విచారణకు రాలేనంటూ సమాధానం చెప్పారు. తర్వాత రెండో నోటీసు ఇచ్చినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ విచారణకు రాలేదు. రెండో నోటీసు ఇచ్చినప్పుడు మాత్రం హడావుడి నడిచింది.
రెండో నోటీసుకు రామ్‌గోపాల్ వర్మ సమాధానం చెప్పకపోవడంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. ఆయన అరెస్టు ఖాయమంటూ హడావుడి నడిచింది. చివరిలో రామ్‌గోపాల్ వర్మ సమాధానం ఇవ్వడంతో వాళ్లు వెళ్లిపోయారు. అయినా సరే రామ్‌గోపాల్ వర్మ పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక రోజంతా ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానాలు వచ్చాయి.
ఆర్జీవీ పారిపోయాడు.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం నడుస్తున్న టైంలోనే మీడియా సమావేశం పెట్టారు. తను ఎవరికీ భయపడాల్సిన పని లేదని... న్యాయం పరిధిలో తాను పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. తప్పుడు స్టోరీలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అప్పుడెప్పుడో పెట్టిన పోస్టులు తనకు ఎలా గుర్తుంటాయని మీడియాను ప్రశ్నించారు. అసలు పోస్టు పెట్టిన సమయంలో స్పందించకుండా ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు.
ఎవరిపైన తాను పోస్టులు పెట్టానంటూ ఫిర్యాదులు చేస్తున్నారో వాళ్లు స్పందించకపోవడం ఏంటని నిలదీశారు ఆర్జీవి. ఇదంతా చూస్తుంటే పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. అసలు భారతీయ న్యాయశిక్షా స్మృతిలో ఇలాంటి వాటికి శిక్షలు లేవని ఏ చట్టం ప్రకారం తనపై కేసులు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. సోషల్ మీడియా జమానాలో ఉన్నామని దాన్ని నియంత్రించలేమన్నారు. తన పోస్టులపై కేసులు పెట్టి శిక్షలు వేస్తే కోట్ల మంది ప్రజలు జైల్లోనే ఉండాలని అన్నారు. రోజుకు వేల కొద్ది ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వస్తుంటాయన్నారు.
ఆర్జీవీ పారిపోయాడు.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం నడుస్తున్న టైంలోనే మీడియా సమావేశం పెట్టారు. తను ఎవరికీ భయపడాల్సిన పని లేదని... న్యాయం పరిధిలో తాను పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. తప్పుడు స్టోరీలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అప్పుడెప్పుడో పెట్టిన పోస్టులు తనకు ఎలా గుర్తుంటాయని మీడియాను ప్రశ్నించారు. అసలు పోస్టు పెట్టిన సమయంలో స్పందించకుండా ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు.