Manchu Updates: మనోజ్ సామాన్లన్నీ బయటపడేయిస్తున్న మోహన్ బాబు - డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్ దంపతులు
Mohan babu Vs Manoj: మనోజ్‌తో పూర్తి సంబంధాలు తెంచుకునేందుకు మోహన్ బాబు సిద్దమయ్యారు. ఆయన సామాన్లను ప్రత్యేక వాహనాల్లో నింపి బయటకు పంపేస్తున్నారు. మరో వైపు మనోజ్ డీజీపీని కలిశారు.
Manchu family dispute : మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారస్థాయికి చేరింది. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు రావడంతోనే మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. మనోజ్, ఆయన భార్యతో పాటు మనోజ్ అనుచరులందర్నీ బయటకు పంపేశారు. తర్వాత ఆయనకు చెందిన వస్తువులు ఇంట్లో ఉండకుండా ప్రత్యేక వాహనాలను తెప్పించి అందులో లోడ్ చేసి పంపించేశారు. అవి ఎక్కడుకు వెళ్తాయో తెలియదు. మనోజ్ భార్య మౌనికకు చెందిన ఇంటికి పంపిచినట్లుగా తెలుస్తోంది. పోలీసుస సమక్షంలోనే వాటిని తరలించారు.
డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్
మరో వైపు ఇంటి నుంచి పంపేయడంతో మనోజ్, మౌనిక పోలీసు ఉన్నతాధికారుల్ని కలిశారు. మొదట ఇంటలిజెన్స్ డీజీని కలిసి తమ కుటుంబంలో జరిగిన పరిణామాల్ని వివరించారు. తర్వాత డీజీపీని కూడా కలిశారు. న్యాయం చేయాలని కోరారు. పోలీసులు పూర్తిగా మోహన్ బాబు వైపు ఉన్నారని తనపై దాడి చేసిన వారిని కూడా పట్టుకోవడం లేదని చెబుతున్నారు. స్వయంగా మోహన్ బాబు తనపై దాడి చేయించాలని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని మీడియాను కోరిన మోహన్ బాబు
మరో వైపు మోహన్ బాబు తొలి సారిగా ఆయన ఇంటి వద్ద బయట కనిపించారు. మీడియా ప్రతినిధుల్ని ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని ఆయన కోరారు. మరో వైపు మంచు విష్ణు పరిస్థితుల్ని పూర్తిగా అదుపులో ఉంచేందుకు సెక్యూరిటిని, బౌన్సర్లను నిరంతరం ఇంటి చుట్టూ కాపలా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంచు విష్ణు ఇటీవలి కాలంలో దుబాయ్ లోనే ఉంటున్నారు. కుటుంబం కూడా దుబాయ్ లోనే ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తో వివాదం తర్వాత ఆయన దుబాయ్ నుంచి వచ్చారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
మనోజ్‌తో మాట్లాడేందుకు, చర్చలు జరిపేందుకు మోహన్ బాబు నిరాకరణ
మనోజ్ ను బయటకు గెంటేస్తే సమస్యకు పరిష్కారం కాదని ఇంకా ఎక్కువ చిక్కుముడిగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మనోజ్ తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారుల్ని కోరుతున్నారు. కానీ ఆస్తుల కోసం కాదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మనోజ్ కుటుంబ పెద్దలు,ఇతర మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని .. పోలీసులు సూచించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే మనోజ్, మౌనికపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ నేరుగా ఎవరిపైనా ఫిర్యాదు చేయకపోవడంతో .. కేసు పెట్టినా అందులో నిందితులుగా ఎవర్నీ చేర్చలేదు.
Also Read: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్