అన్వేషించండి

Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...

Annapurna Studios Foundation Day: తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచిలా మారిన అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1975, ఆగస్ట్ 13న స్టూడియోకు పునాది రాయి వేశారు ఏఎన్నార్

Annpurna Studios Completes 50 Years: చుట్టూ బంజరు భూమి. ఎటు చూసినా రాతి భూభాగం, గుబురు పొదలు, పాములు తిరిగే ప్రాంతం. ఇప్పుడు ఆ ప్లేస్ ఓ వ్యక్తి దార్శనికతతో టాలీవుడ్ ఇండస్ట్రీకే దిక్సూచిగా మారింది. మనకంటూ ఓ పరిశ్రమ ఉండాలని... తెలుగు నటులు ప్రపంచ స్థాయికి ఎదగాలన్న తపనే ఓ వండర్ స్టూడియోస్‌కు పునాది వేసేలా చేసింది. ఆ వ్యక్తే అక్కినేని నాగేశ్వరరావు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ స్థాపనకు కృషి చేశారు.
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...

50 ఏళ్లు పూర్తి

హైదరాబాద్ జూబ్లీహిల్స్, కృష్ణానగర్ అంటేనే తెలుగు ఇండస్ట్రీకి పెట్టింది పేరు. 1975, ఆగస్ట్ 13న అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది రాయి వేశారు ఏఎన్నార్. బుధవారానికి ఈ స్టూడియో సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు గడ్డపై మనకంటూ ఓ అడ్రస్ ఉండాలనే తపనతో ఏఎన్నార్ తన సొంత భూమిలో ఓ ఇంటిని నిర్మించి తొలి అడుగు వేశారు. ఏడాదిలోనే ఓ ఇల్లు, స్టూడియోను సైతం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...

ఇండస్ట్రీకి అక్కినేని చేసిన సేవలను గుర్తించిన అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని 22 ఎకరాల భూమిని కేటాయించింది. కొండలు, గుట్టలతో ఉన్న బంజరు భూమిని భూతల స్వర్గంగా మార్చారు. 

Also Read: చెప్పిన టైంకు రిలీజ్ చేయలేదు - రూ.218 కోట్లు వడ్డీతో సహా చెల్లించండి... ప్రభాస్ 'ది రాజా సాబ్' నిర్మాతలపై పిటిషన్

స్టూడియో ప్రారంభంతోనే...

1976, జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా ప్రారంభించారు. స్టూడియో అఫీషియల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. స్టూడియోతో పాటే అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించారు. యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ వరకూ అన్నింటిలోనూ యంగ్ టాలెంట్‌కు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటే బహుళ షూటింగ్ అంతస్తులు, భారీ బహిరంగ సెట్స్, ప్రపంచ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దారు. ఇండస్ట్రీలో అత్యాధునిక వసతులు ఉన్న స్టూడియో ఇది. ఇక్కడ భారీ మూవీస్ నుంచి సీరియల్స్ వరకూ అన్నింటినీ చిత్రీకరిస్తున్నారు. ఎన్నో పాన్ ఇండియా స్థాయి మూవీస్ ఇక్కడ భారీ సెట్స్ వేసి షూటింగ్ చేశారు.
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం తర్వాతే క్రమక్రమంగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్‌లు వెలిశాయి. దీంతో పాటే డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లు, యాక్టింగ్ కోర్సు ఇనిస్టిట్యూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది మద్రాస్. ఎవరైనా యాక్టింగ్ వైపు వెళ్లాలన్నా... ఏమైనా ప్రయత్నం చేయాలన్నా చెన్నై వైపు చూసేవారు. అన్నపూర్ణ స్డూడియోస్‌ ఏర్పాటుతో తెలుగు వారికి మరిన్ని అవకాశాలు దగ్గరయ్యాయి. ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలంటే చూసే చూపు అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణానగర్ వైపే. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో ఓ మైలురాయిలా నిలిచింది ఈ స్టూడియోస్. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

Embed widget