The Raja saab: చెప్పిన టైంకు రిలీజ్ చేయలేదు - రూ.218 కోట్లు వడ్డీతో సహా చెల్లించండి... ప్రభాస్ 'ది రాజా సాబ్' నిర్మాతలపై పిటిషన్
Raja Saab Breach Agreements: ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ నిర్మాతలపై IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒప్పందాలు ఉల్లంఘించారంటూ ఆరోపించింది.

IVY Entertainments Case Against The Rajasaab Movie Producers: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో అవెయిటెడ్ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా... వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవ్వడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేస్తారనే ప్రచారం సాగుతోంది.
దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతుండగా... మూవీ టీం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ 2026, జనవరి 9న మూవీ రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ మూవీకి మరో సమస్య వచ్చిపడింది.
ప్రొడ్యూసర్స్‌పై కేసు
ఢిల్లీకి చెందిన IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'ది రాజా సాబ్' నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందుగా తాము చేసుకున్న కాంట్రాక్ట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించింది. మూవీని అనుకున్న టైం ప్రకారం పూర్తి చేసి రిలీజ్ చేయకపోవడం, నిధుల వినియోగాన్ని వెల్లడించడం, కీలక బాధ్యతలను 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' నెరవేర్చలేదని పిటిషన్‌లో పేర్కొంది.
'ది రాజాసాబ్' మూవీ కోసం తాము రూ.218 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ తెలిపింది. 'వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మూవీని ఎలాంటి పోటీ లేని టైంలో సింగిల్‌గా రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. షూటింగ్స్‌పై ఎలాంటి అప్డేట్స్ లేవు. మేము అనుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు.' అంటూ ఆరోపించింది. తమకు న్యాయం చేయాలంటూ కోర్టును కోరింది. అయితే, గత మూడేళ్లలో దక్షిణ భారత చిత్రాల్లో IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ.1500 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది.
18 శాతం వడ్డీతో చెల్లించాలి
ఈ మూవీ కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టామని... వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు సంస్థ తెలిపింది. తాము పెట్టిన పెట్టుబడికి 18 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ పిటిషన్ వేసింది. అంతవరకూ ఈ మూవీపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎలాంటి హక్కులు ఉండకుండా చూడాలని... ఎలాంటి బిజినెస్ లావాదేవీలు జరగకుండా ఆదేశాలివ్వాలని కోరింది. మరి దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ, దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అసలు మూవీ వాయిదా పడిందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: 'కూలీ' సినిమాకు క్లైమాక్స్ కీలకం... రజనీపై భారం వేసిన దర్శకుడు - దుబాయ్ రివ్యూ ఎలా ఉందంటే?
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో మూవీని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సోలో రిలీజ్ వల్ల హిందీ సినిమాలతో పోటీ తగ్గి కలెక్షన్స్ పరంగా లాభం చేకూరుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వింటేజ్ ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















