War 2 Twitter Review: అమెరికాలో ఎన్టీఆర్ 'వార్ 2' ఫస్ట్ షో ఎప్పుడు? USA Premier Show రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
War 2 First Review: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన స్పై థ్రిల్లర్ 'వార్ 2' ట్విట్టర్ రివ్యూస్ ఏ టైంకి వస్తాయి? అమెరికాలో ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...

NTR and Hrithik Roshan's War 2 USA Premieres Report: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'. కియారా అద్వానీ హీరోయిన్. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ డబుల్ కాలర్ ఎగరేయడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మరి, అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ షో ఎప్పుడు పడుతుంది? ప్రీమియర్ షోస్ రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి? అంటే...
ఇండియన్ టైమింగ్ ప్రకారం 2.45 గంటలకు...
ఇండియాలో ఆగస్టు 14న 'వార్ 2' విడుదల. అయితే అమెరికాలో ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. మనకు, వాళ్ళకు 12 గంటల టైమ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి... ఇండియన్ టైమింగ్ ప్రకారం గురువారం (ఆగస్టు 14న) తెల్లవారుజామున 2.45 గంటలకు అమెరికాలో 'వార్ 2' ప్రీమియర్ షోస్ మొదలు కానున్నాయి.
ప్రీమియర్స్ రిపోర్ట్, ట్విట్టర్ టాక్ వచ్చేది ఎప్పుడు?
War 2 Runtime: 'వార్ 2' రన్ టైమ్ 2.53 గంటలు. అంటే ఆల్మోస్ట్ మూడు గంటలు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు అమెరికాలో షోస్ కంప్లీట్ అవుతాయి. ఇంటర్వెల్ తర్వాత కొందరు ఫస్టాఫ్ రివ్యూస్ ఇవ్వడం కామన్. కానీ, ఫుల్ రిపోర్ట్ రావాలంటే ఆరు గంటల వరకు వెయిట్ చేయాలి. అప్పటికి రిజల్ట్ మీద ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?
ఇండియాలో షో టైమ్స్ విషయానికి వస్తే... హైదరాబాద్ సిటీలో ఉదయం ఏడు గంటలకు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ షో పడుతుంది. టాలీవుడ్ మీడియా అంతా అక్కడ షో చూసే అవకాశం ఉంది. తెలుగు క్రిటిక్స్ నుంచి గురువారం 10 నుంచి 11 గంటల సమయంలో రివ్యూలు వచ్చే అవకాశం ఉంది.
'వార్ 2'కు తెలుగులో సరైన ప్రమోషన్ జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా మరో ప్రమోషనల్ యాక్టివిటీ చేయలేదు. ముందు నుంచి ఇదొక హిందీ సినిమా అన్నట్టు ప్రచారం జరిగింది. అందువల్ల, మాస్ ఆడియన్స్ వరకు సినిమా చేరలేదు. మరి ఫస్ట్ డే ఓపెనింగ్ ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణలో సినిమాకు టికెట్ రేట్ హైక్ కూడా లభించలేదు.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?





















