Tata Power 6000 crore Project in Andhra Pradesh: అనంతపురానికి భారీ పెట్టుబడి - టాటా , సుజ్లాన్ రూ. 6వేల కోట్ల విండ్ పవర్ ప్రాజెక్టు
Tata Wind Power Project: అనంతపురంలో టాటా, సుజ్లాన్ కలిసి భారీ పెట్టుబడిని పెట్టేందుకు రెడీ అయ్యాయి. రూ. ఆరు వేల కోట్లతో విండ్ పవర్ ప్రాజెక్టు ను నిర్మించనున్నాయి.

Tata Wind Power Project in Andhra Pradesh: టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ , సుజ్లాన్ ఎనర్జీ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 700 మెగావాట్ల (MW) విండ్ పవర్ ప్రాజెక్టు కోసం రూ.6,000 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు టాటా పవర్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 7 గిగావాట్ల (GW) రెన్యూవబుల్ ఎనర్జీ మెగా ప్లాన్‌లో భాగం.
టాటా పవర్ , సుజ్లాన్ ఎనర్జీ మధ్య రూ. 6,000 కోట్ల ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 700 MW విండ్ పవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి , నిర్మాణం కోసం సుజ్లాన్ S144 విండ్ టర్బైన్ జనరేటర్లను సరఫరా చేయడానికి కుదిరిన ఒప్పందం. ఇది 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విండ్ పవర్ ప్రాజెక్టు, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
7 GW రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాన్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ఈ 700 MW ప్రాజెక్టు మార్చి 2025లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఈ పెట్టుబడి ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఈ 7 GW ప్లాన్ సోలార్, విండ్ , హైబ్రిడ్ ప్రాజెక్టులను కవర్ చేస్తుంది, దీనికి మొత్తం రూ.49,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తారు. ఈ ప్రాజెక్టులో S144 సుజ్లాన్ విండ్ టర్బైన్ జనరేటర్లు ఉపయోగిస్తారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని సుజ్లాన్ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు.
ఈ టర్బైన్లు సవరించిన రెన్యూవబుల్ ఎనర్జీ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్ (RLMM) డొమెస్టిక్ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటాయి, దీనివల్ల స్థానిక ఉత్పాదనకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీ 2024లో పునరుద్ధరించారు. ఉత్పత్తి ప్రారంభించారు. ఇది స్థానిక ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడానికి , ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) ఈ ప్రాజెక్టుకు సహాయం అందిస్తోంది. ఇది సైట్ గుర్తింపు, భూమి సేకరణ, ,శక్తి ఎవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో సహకారం అందిస్తుంది. NREDCAP రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విండ్ పవర్ ప్రాజెక్టు, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి పునరుజ్జీవనం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన శక్తి అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి , ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. టాటా పవర్ 7 GW ప్లాన్ భారతదేశం రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది 2030 నాటికి 500 GW రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంలో భాగం. ]
⚡Tata Power inks ₹6,000 Cr deal with Suzlon Energy to develop & supply 700 MW wind turbines in Andhra Pradesh. #RenewableEnergy #WindPower #InvestInAP #AndhraPradesh pic.twitter.com/6sdJ3Ysupv
— Andhra Nexus (@AndhraNexus) August 12, 2025
ఈ ఒప్పందం సుజ్లాన్ ఎనర్జీకి కూడా ఒక ముఖ్యమైన అవకాశంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో విండ్ ఎనర్జీ సెగ్మెంట్‌లో సుజ్లాన్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం సుజ్లాన్ షేర్లకు సానుకూల ప్రభావం చూపుతుందని, ఇది కంపెనీకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఒక ఊపునిస్తుందని భావిస్తున్నారు.





















