అన్వేషించండి

తిరుమలలో షారుఖ్, ‘శెట్టి’ మూవీకి చిరు ప్రశంస - నేటి టాప్ 5 సినీ విశేషాలివే

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘జవాన్‘ విడుదలకు ముందు తిరుమలకు షారుఖ్ - హిట్ కావాలని కోరుతూ టీమ్ & ఫ్యామిలీతో

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘జవాన్‘ విడుదల నేపథ్యంలో మూవీ యూనిట్ తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.  భార్య గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్  కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. హీరోయిన్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్, ‘జవాన్‘ దర్శకుడు అట్లీ కుమార్ వేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు షారుఖ్ ఖాన్ కు తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం గర్భగుడిలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేయించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యుతలో పాటు నయనతా కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. షారుఖ్, నయనతారను పట్టువస్త్రాలతో సత్కరించారు. ఇక సంప్రదాయ దుస్తులు వేసుకుని షారుఖ్ కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టుపంచెలో బాలీవుడ్ బాద్ షా కనిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రజనీకాంత్ సినిమాలో రానా దగ్గుబాటి - రీ ఎంట్రీ అదేనా!?

రానా దగ్గుబాటి (Rana Daggubati) వెండితెరపై కథానాయకుడిగా కనిపించి ఏడాది దాటింది. 'విరాట పర్వం' తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఆ మధ్య నిఖిల్ 'స్పై'లో అతిథి పాత్రలో మెరిశారు. నటన నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన... రజనీకాంత్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తొలి ప్రేక్షకుడిని నేనే, మళ్ళీ థియేటర్లలో చూడాలనుంది - శెట్టి పోలిశెట్టికి 'మెగా' అభినందన

తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). ఆమెకు జోడీగా, కథానాయకుడి పాత్రలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించారు. ఈ గురువారం (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విడుదల ముందు ఈ చిత్రానికి 'మెగా' అభినందన లభించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

షకీలాకు ఇది రెండో ‘బిగ్ బాస్’ - ఆ షోలో ఎన్ని రోజులు హౌస్‌లో ఉందా తెలుసా?

బిగ్ బాస్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి కలగాలంటే కాంట్రవర్సీలు క్రియేట్ చేసే కంటెంట్ కావాలి, అలాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కావాలి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఒకప్పుడు ఫేమస్ నటీనటులు అయ్యిండి, కొంతకాలం తర్వాత ఫేడవుట్ అయిపోయిన వారిని ఎక్కువగా తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు.. సడెన్‌గా వెండితెరను, బుల్లితెరను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయారు అని ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. అలాంటి వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకువస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి పెరుగుతుంది. తాజాగా ప్రారంభమయిన బిగ్ బాస్‌లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఒకరు షకీలా. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నేనూ సచిన్ ఫ్యాన్ - మరో వందేళ్లయినా మరో టెండూల్కర్ పుట్టడు : ముత్తయ్య మురళీధరన్

కోట్లాది మందికి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన ఘనత గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సొంతమని ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నారు. ఆట ఏ విధంగా ఆడాలో మాత్రమే కాదు, ఎంత వినమ్రంగా ఉండాలో కూడా నేర్పించారని చెప్పారు. తాను కూడా సచిన్ టెండూల్కర్ ఆటకు, వ్యక్తిత్వానికి వీరాభిమానిని అని మురళీధరన్ పేర్కొన్నారు. మరో వంద ఏళ్ళు గడిచినా సరే... సచిన్ సాధించిన ఘనత మరొకరు సాధించలేరని, ఆయన లాంటి వ్యక్తి మరొకరు జన్మించలేరని మురళీధరన్ కొనియాడారు. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో 800 వందల వికెట్లు తీసిన ఏకైన బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా '800' (800 Movie). మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి ఈ బయోపిక్ దర్శకుడు. ట్రైలర్ విడుదల సందర్భంగా మురళిధరన్ మాట్లాడారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Embed widget