అన్వేషించండి

Shakila: షకీలాకు ఇది రెండో ‘బిగ్ బాస్’ - ఆ షోలో ఎన్ని రోజులు హౌస్‌లో ఉందా తెలుసా?

ఒకప్పుడు బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. అందులో ఒకరు షకీలా.

బిగ్ బాస్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి కలగాలంటే కాంట్రవర్సీలు క్రియేట్ చేసే కంటెంట్ కావాలి, అలాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కావాలి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఒకప్పుడు ఫేమస్ నటీనటులు అయ్యిండి, కొంతకాలం తర్వాత ఫేడవుట్ అయిపోయిన వారిని ఎక్కువగా తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు.. సడెన్‌గా వెండితెరను, బుల్లితెరను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయారు అని ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. అలాంటి వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకువస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి పెరుగుతుంది. తాజాగా ప్రారంభమయిన బిగ్ బాస్‌లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఒకరు షకీలా.

బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా..
ఒకప్పుడు బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. అందులో ఒకరు షకీలా. షకీలా నటించిన సినిమాలు అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మలయాళంలో పెద్ద పెద్ద హీరోలు సైతం షకీలా సినిమా రిలీజ్ అంటే భయపడిపోయేవారు. దాని వల్ల కొన్నాళ్ల తర్వాత తన సినిమాలు బ్యాన్ అవ్వాలని మాలీవుడ్ అంతా ఒక్కటయ్యింది. వేరే దారి లేక తను కూడా సినిమాల నుంచి తప్పుకుంది. షకీలా ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. తన సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేసి, ఆస్తిని మొత్తం తీసేసుకున్నారు.

అలా ఎన్నో కష్టాలు పడిన షకీలా.. చాలాకాలం తర్వాత బిగ్ బాస్ కన్నడలోని 2వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షకీలాకు మలయాళ నటిగా గుర్తింపు లభించినా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా తను సినిమాలు చేసింది. అందుకే బిగ్ బాస్ కన్నడ టీమ్.. ఆమెను రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపిక చేసింది. బిగ్ బాస్ కన్నడ 9 సీజన్లు పూర్తి చేసుకుంది. రెండో సీజన్లో షకీలా వచ్చిందంటే.. దాదాపు 7 ఏళ్లు క్రితమే షకీలాకు బిగ్ బాస్ హౌస్‌‌‌ను చూసేసింది. అంటే, ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఆమెకు జుజుబీ. అయితే, బిగ్ బాస్ కన్నడలో షకీలా.. 26 రోజులు మాత్రమే హౌజ్‌లో ఉండగలిగింది. 27వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ 7 సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

రెండు భాషల్లో కనిపించిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్‌లోకి షకీలా ఎంటర్ అవుతున్న ప్రతీసారి తను ఒక లక్ష్యంతోనే వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ సమయంలో కూడా తనకోసం వచ్చిన వారు ఒక లక్ష్యంతో తను బిగ్ బాస్‌లోకి వెళ్తుందని, అది సాధించి రావాలని కోరుకున్నారు. ఎంతో కాంట్రవర్షియల్ జీవితాన్ని కొనసాగించిన షకీలా.. ఒకసారి కూడా పెళ్లి చేసుకోకుండా.. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ను దత్తత తీసుకుంది. ఆ ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక లైఫ్ ఇవ్వడం కోసం బిగ్ బాస్ తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒకసారి ఒక భాష బిగ్ బాస్‌కు వచ్చిన కంటెస్టెంట్.. మరోసారి మరో భాషలో రాకూడదని రూల్ ఏం లేదు. అలా ఇంతకు ముందు కూడా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ రెండు భాషల్లో కనిపించినవారు ఉన్నారు. అలా ముందుగా వేరే భాషలో కనిపించి.. తెలుగులో వచ్చిన వారి లిస్ట్‌లో ఇంతకు ముందు బిందుమాధవి ఉండగా.. ఇప్పుడు షకీలా కూడా ఆ లిస్ట్‌లో చేరింది.

Also Read: రతిక సీక్రెట్ టాస్క్ - ఆ ఇద్దరికి పుల్లలు పెట్టే పనిలో బిజి బిజీగా గడిపేస్తున్న బీబీ బ్యూటీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Embed widget