టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ @ 5 pm - ఈ రోజు సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'డెడ్ పిక్సెల్స్' రివ్యూ : మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్' (Dead Pixels Web Series). నాలుగేళ్ళ తర్వాత ఆమె నటించిన సిరీస్ ఇది. 'మా వింత గాధ వినుమా' ఫేమ్ ఆదిత్య మందల దర్శకత్వం వహించారు. అక్షయ్ లగుసాని, 'వైవా' హర్ష, అక్షయ్ లగుసాని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గేమింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ఇది. ఎలా ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జల ప్రళయంలో వెల్లివిరిసిన మానవత్వం, ఆకట్టుకుంటున్న ‘2018’ తెలుగు ట్రైలర్
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘2018'. కేవలం రూ.15 కోట్లతో రూపొందించిన ఈ మలయాళం సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఐశ్వర్య రాజేష్ ‘శ్రీవల్లి’ వ్యాఖ్యలపై స్పందించిన రష్మిక
అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్, తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదానినని ఐశ్వర్య అన్నట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఐశ్వర్య తాజాగా వివరణ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'బిచ్చగాడు 2' రివ్యూ : సెంటిమెంటే కాదు, యాక్షన్ & థ్రిల్ కూడా - విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?
తెలుగులో విజయ్ ఆంటోనీని 'బిచ్చగాడు' సినిమా స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి. అయితే... ఏదీ 'బిచ్చగాడు' స్థాయి విజయం లేదు. ఏడేళ్ళ తర్వాత 'బిచ్చగాడు 2' అంటూ విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
భారతీయ సినీ పరిశ్రమలో టాలీవుడ్ టాప్, గోల్డెన్ గ్లోబ్ సంపాదకీయంలో ప్రశంసలు
‘RRR’ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసిపోయింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారత్ తో పాటు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినిమా అవార్డులను సైతం దక్కించుకుంది. ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. తెలుగు సినిమా సత్తా ప్రపంచ నలు దిశలా చాటి చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)