By: ABP Desam | Updated at : 19 May 2023 11:37 AM (IST)
Photo Credit: Aishwarya Rajesh/Rashmika Mandanna/Instagram
అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్, తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదానినని ఐశ్వర్య అన్నట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఐశ్వర్య తాజాగా వివరణ ఇచ్చింది.
‘‘సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి, నా సినిమాల విజయానికి కృషి చేస్తున్న సినీ లవర్స్ అందరికీ ధన్యవాదాలు. నన్ను, నా నటనను ఇష్టపడుతున్న అభిమానులకు పేరు పేరుగా కృతజ్ఞతలు. తాజా ఇంటర్వ్యూలో “మీరు ఎలాంటి పాత్రలు పోషించడానికి ఇష్టపడతారు?” అని ఓ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, మంచి పాత్రలు చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాను. ఎగ్జాంపుల్ గా ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయన్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే? కొంత మంది నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక నటనను కించపరిచేలా మాట్లాడినట్లు వార్తలు రాశారు. అందా అవాస్తవం. ఆ సినిమాలో రష్మిక నటన చాలా బాగుంది. అంతేకాదు, నా తోటి నటీనటుల మీద ఎంతో గౌరవం ఉంది. ఇప్పటికై నా వ్యాఖ్యలను తప్పుగా ప్రసారం చేయడం మానుకోవాలి” అంటూ ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది.
From the desk of Aishwarya Rajesh#AishwaryaRajesh @aishu_dil pic.twitter.com/J78oNsWQ9B
— Yuvraaj (@proyuvraaj) May 17, 2023
తాజాగా ఐశ్వర్య రాజేష్ వివరణపై రష్మిక మందన్న స్పందించింది. వివరణ ఇచ్చుకోవాల్సిన అవరం లేదని చెప్పింది. “హాయ్ లవ్. ఇప్పుడే నేను మీ వివరణ చూశాను. మీరు వ్యాఖ్యల వెనుక అర్థం నాగా బాగా అర్థం అయ్యింది. ఇందులో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీ వ్యాఖ్యల వెనుక ఎటువంటి చెడు కారణాలు లేవని నేను భావిస్తున్నాను. మీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మీ ‘పర్హానా’ చిత్రానికి ఆల్ ది బెస్ట్” అని రాసుకొచ్చింది.
Hi love.. just came across this.. the thing is - I perfectly understood what you meant and I wish there were no reasons for us to explain ourselves and as you know I only and only have love and respect for you.. and ones again all the bestest for your film Farhana love .. 😄🤗❤️
— Rashmika Mandanna (@iamRashmika) May 18, 2023
తమిళ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మిస్ మ్యాచ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' లో 'రిపబ్లిక్' 'డ్రైవర్ జమున' వంటి సినిమాలలో నటించింది. ఈ ఏడాదిలో 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' 'రన్ బేబీ రన్' 'సొప్పన సుందరి' చిత్రాలతో అలరించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫర్హానా' మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ ప్రభు నిర్మించారు.
Read Also: జల ప్రళయంలో వెల్లివిరిసిన మానవత్వం, ఆకట్టుకుంటున్న ‘2018’ తెలుగు ట్రైలర్
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి