అన్వేషించండి

2018 Movie Telugu Trailer: జల ప్రళయంలో వెల్లివిరిసిన మానవత్వం, ఆకట్టుకుంటున్న ‘2018’ తెలుగు ట్రైలర్

మలయాళంలో సంచలన విజయాన్ని అందుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’ తెలుగులోకి విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది.

జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘2018'. కేవలం రూ.15 కోట్లతో రూపొందించిన ఈ మలయాళం సినిమా కేవలం 10 రోజుల్లోనే  రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టిస్తోంది.  

త్వరలో తెలుగులో విడుదల- ఆకట్టుకుంటున్న ట్రైలర్ 

కేరళలో అద్భుతం విజయం అందుకున్న ఈ సినిమా త్వరలో తెలుగులోకి విడుదలకానుంది. హిందీ, కన్నడ, తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ‘2018’ ట్రైలర్ విడుదల అయ్యింది. 2018లో కేరళలో భారీగా వరదలు వచ్చాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నాటి విపత్తును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు అనే కథాంధంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఒళ్లుగగుర్పొడిచేలా రూపొందించారు మేకర్స్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jude Anthany Joseph (@judeanthanyjoseph)

బాక్సాఫీస్ దగ్గర ‘2018’సరికొత్త రికార్డులు  

వాస్తవానికి మలయాళీ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి. తక్కువ బడ్జెట్ మంచి కాన్సెప్ట్ తో సినిమాలు రూపొందించడంలో మాలీవుడ్ మేకర్స్ కు మంచి పేరుంది. అక్కడ మంచి సక్సెస్ అందుకున్న సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని వేరే భాషల్లోకి రీమేక్ చేస్తుంటారు. తెలుగులోనూ పలు మలయాళీ రీమేక్ సినిమాలు వచ్చాయి. అద్భుత విజయాలను అందుకున్నాయి. మలయాళంలో తెరకెక్కిన సినిమాలు మంచి గుర్తింపు పొందినా, కలెక్షన్లను వసూళ్లు చేయడంలో మాత్రం ముందుండలేకపోతున్నాయి. ‘2018’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.  కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవళం కేరళలోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు కలెక్షన్లు అందుకోవడం.. అదీ 10 రోజుల్లోనే కావడం సంచలనం కలిగిస్తోంది. మలయాళంలో ఇప్పటి వరకు రూ.100 కోట్లు సాధించిన సినిమాలు ‘లూసిఫర్’, ‘కురుప్’. అవీ ఫుల్ రన్ లో రూ. 100 కోట్లు వసూలు చేశాయి.  కానీ, ‘2018’ మాత్రం కేవలం 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుంది. ఈ కలెక్షన్స్ రెండు, మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.  కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.   

Read Also: రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Season 10 Today Nov 28th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: క్యారెక్టర్ తేల్చేసి.. విన్నింగ్‌ హార్స్‌కి ఇచ్చి పడేసిన నాగ్ సార్! మా.. స్టార్‌కి ఫుల్‌ క్లాస్‌!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: క్యారెక్టర్ తేల్చేసి.. విన్నింగ్‌ హార్స్‌కి ఇచ్చి పడేసిన నాగ్ సార్! మా.. స్టార్‌కి ఫుల్‌ క్లాస్‌!
Idupu Kayitham Ullipoola Song : ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
Arjun Sarja : ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget