News
News
వీడియోలు ఆటలు
X

Bichagadu 2 Movie Review - 'బిచ్చగాడు 2' రివ్యూ : సెంటిమెంటే కాదు, యాక్షన్ & థ్రిల్ కూడా - విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?

Bichagadu 2 Movie Review In Telugu : విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'బిచ్చగాడు 2'.

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : బిచ్చగాడు 2
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు
రచయితలు : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోని
మాటలు, పాటలు : భాషా శ్రీ (తెలుగులో)
ఛాయాగ్రహణం : ఓమ్ నారాయణ్
నిర్మాత : ఫాతిమా విజయ్ (విజయ్ ఆంటోనీ భార్య)
తెలుగులో విడుదల : విజయ్ కుమార్, వీరనాయుడు (ఉషా పిక్చర్స్)
కూర్పు, సంగీతం, రచన, దర్శకత్వం : విజయ్ ఆంటోనీ
విడుదల తేదీ: మే 19, 2023

తెలుగులో విజయ్ ఆంటోనీని 'బిచ్చగాడు' సినిమా స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి. అయితే... ఏదీ 'బిచ్చగాడు' స్థాయి విజయం లేదు. ఏడేళ్ళ తర్వాత 'బిచ్చగాడు 2' అంటూ విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉందంటే (Bichagadu 2 review)?

కథ (Bichagadu 2 Movie Story) : ఇండియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ)ది ఏడో స్థానం! ఎన్నికల ఫండ్ పేరుతో సీఎంకు రూ. 5000 కోట్లు ఫండ్ ఇచ్చిన వ్యక్తి. అయితే, విజయ్ ఆస్తి మీద ఆయన స్నేహితుడు, కంపెనీలో పని చేసే అరవింద్ (దేవ్ గిల్) కన్ను పడుతుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో డాక్టర్ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెప్పింది వింటాడు. విజయ్ గురుమూర్తిని చంపేసి, అతని బాడీలో వేరొకరి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి, ఆస్థి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. విజయ్ గురుమూర్తి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వ్యక్తి సత్య (విజయ్ ఆంటోనీ) దొరుకుతాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ సక్సెస్ అవుతుంది. 

ఇప్పుడు బాడీ మాత్రం విజయ్ గురుమూర్తిది. బ్రెయిన్ ఏమో సత్యాది. విజయ్ గురుమూర్తి స్థానంలో సత్య బ్రెయిన్ వస్తే... తాము ఆడింది ఆట, పాడింది పాట అనుకున్న అరవింద్ & కోకు పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళను సత్య చంపేస్తాడు.  ఎందుకు? అతని చెల్లెలు ఎవరు? చిన్నతనంలో జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఆ బాడీ విజయ్ గురుమూర్తిది అయినా... అందులోని బ్రెయిన్ సత్యాది అని జనాలు కనిపెట్టారా? లేదా? విజయ్ గుర్తుమూర్తి ప్రేమించిన అమ్మాయి, కంపెనీలో సెక్రటరీ హేమ (కావ్యా థాపర్) సహా ఎవరికీ అనుమానం రాలేదా? సత్య స్టార్ట్ చేసిన యాంటీ బికిలీ కార్యక్రమం ఏమిటి? ముఖ్యమంత్రి (రాధా రవి) అతడిని ఎందుకు చంపాలి? అనుకుంటున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Bichagadu 2 Telugu Review) : మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' చేశారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' చేశారు. అయితే... రెండు కథల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండో కథలో కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. యాక్షన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. 

బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్, సర్జరీ అంటూ సినిమా ప్రారంభమే విజయ్ ఆంటోనీ చాలా ఆసక్తి కలిగించారు. ఇంటర్వెల్ వరకు ఆ టెంపో కంటిన్యూ అయ్యింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ కలిగించారు. ఇంటర్వెల్ తర్వాత ఆ టెంపో మిస్ అయ్యింది. సామాజిక సేవ, సందేశం మీద దృష్టి పెట్టడంతో అసలు కథ పక్కకు వెళ్ళింది. యాక్షన్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాలన్స్ చేయడంలో విజయ్ ఆంటోనీ కొంచెం తడబడ్డారు. ఫస్టాఫ్ వరకు చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్న ఆయన, ఇంటర్వెల్ తర్వాత కొంచెం కిందకు పడుతూ పైకి లేస్తూ వెళ్ళారు. మళ్ళీ పతాక సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ బాగా బ్యాలన్స్ చేశారు. 

యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. ఎక్కడా కూడా ఓవర్ అనిపించలేదు. సెకండాఫ్ స్టార్టింగ్ & కోర్ట్ రూమ్ సీన్స్ మీద రైటింగ్ పరంగా మరింత వర్క్ చేస్తే సినిమాలో ఆ డల్ మూమెంట్స్ కూడా అవాయిడ్ చేయవచ్చు. యోగిబాబు కామెడీ వర్కవుట్ కాలేదు. 

'బిచ్చగాడు 2' చూస్తే దర్శకుడిగా ఇది విజయ్ ఆంటోనీ తొలి సినిమా అని ఎక్కడా అనిపించదు. బాగా డీల్ చేశారు. ముఖ్యంగా ఆయన సంగీతం, ఎడిటింగ్ చాలా హెల్ప్ అయ్యాయి. పాటలు పక్కన పెడితే... నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ పెద్ద సినిమా అని ఫీలింగ్ కలిగించింది. నిర్మాణ పరంగా రాజీ పడలేదు. 

నటీనటులు ఎలా చేశారు? : విజయ్ ఆంటోనీలోని నటుడికి, ఆయనలో దర్శకుడు & సంగీత దర్శకుడు పెద్దగా శ్రమ ఇవ్వలేదు. దర్శకత్వం, సంగీతం చాలా సీన్లలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. దాంతో నటుడిగా ఆయనకు పెద్ద పని లేకుండా పోయింది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగభరిత సన్నివేశాలు మాత్రమే విజయ్ ఆంటోనీకి సవాల్ విసిరాయి. అక్కడ పర్వాలేదు. 

సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో కావ్యా థాపర్ అందాల ప్రదర్శన చేశారు. ఆ తర్వాత నటిగానూ మెరిశారు. చాలా రోజుల తర్వాత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు దేవ్ గిల్. రాధా రవి, జాన్ విజయ్, హరీష్ పేరడి, మన్సూర్ అలీ ఖాన్. యోగిబాబు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

Also Read : 'డెడ్ పిక్సెల్స్' రివ్యూ : మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2' కథలను కంపేర్ చేయలేం. మొదటి సినిమా సెంటిమెంట్ అయితే... రెండోది సెంటిమెంట్ మిక్స్డ్ విత్ థ్రిల్లింగ్ యాక్షన్ &  మెసేజ్! ఇంటర్వెల్ తర్వాత కాసేపు బోర్ కొట్టించినా మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఏడిపించారు. సెంటిమెంట్ కోసమే కాదు... యాక్షన్ లవర్స్ కూడా ఓ లుక్ వేయొచ్చు. తెలుగులో విజయ్ ఆంటోనీకి హిట్టు బొమ్మే! 

Also Read 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?

Published at : 19 May 2023 12:47 PM (IST) Tags: ABPDesamReview Kavya Thapar Vijay Antony Bichagadu 2 Review Pichaikkaran 2 Review Bichagadu 2 Telugu Review

సంబంధిత కథనాలు

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Grey Movie Review - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Grey Movie Review  - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !