News
News
వీడియోలు ఆటలు
X

Dead Pixels Web Series Review - 'డెడ్ పిక్సెల్స్' రివ్యూ : మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

OTT Review - Dead Pixels On Disney + Hotstar : నిహారికా కొణిదెల ఓ ప్రధాన పాత్రలో నటించిన 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

వెబ్ సిరీస్ రివ్యూ : డెడ్ పిక్సెల్స్
రేటింగ్ : 1.75/5
నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, హర్ష చెముడు (వైవా హర్ష), సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు
రైటర్ : అక్షయ్ పూల్ల
ఛాయాగ్రహణం : ఫహాద్ అబ్దుల్ మజీద్! 
సంగీతం : సిద్ధార్థ సదాశివుని 
నిర్మాతలు : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా  
దర్శకత్వం : ఆదిత్య మందల 
విడుదల తేదీ : మే 19, 2023
ఎపిసోడ్స్ : 6
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్' (Dead Pixels Web Series). నాలుగేళ్ళ తర్వాత ఆమె నటించిన సిరీస్ ఇది. 'మా వింత గాధ వినుమా' ఫేమ్ ఆదిత్య మందల దర్శకత్వం వహించారు. అక్షయ్ లగుసాని, 'వైవా' హర్ష, అక్షయ్ లగుసాని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గేమింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ఇది. ఎలా ఉంది (Dead Pixels Review In Telugu)?

కథ (Dead Pixels Web Series Story) : గాయత్రి (నిహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్ లగుసాని) ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఫ్లాట్‌మేట్స్ & క్లోజ్ ఫ్రెండ్స్ కూడా! డైరెక్టుగా కంటే గేమింగ్‌లో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. గేమ్ అంటే అంత పిచ్చి! వీళ్ళతో పాటు పైలట్ ఆనంద్ (వైవా హర్ష) కూడా గేమర్! 'బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్' గేమ్ వీళ్ళ ముగ్గురి జీవితాల్లో ఎటువంటి ప్రభావం చూపించింది? 

ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన రోషన్ (సాయి రోనక్) రాకతో గాయత్రి, భార్గవ్ మధ్య ఆటలోనూ, జీవితంలోనూ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫ్లాట్‌మేట్ ఐశ్వర్య (భావనా సాగి) ఎందుకు అనుకుంది? తండ్రితో భార్గవ్ సమస్య ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Dead Pixels Web Series Review) : 'గేమ్ అంటే పని లేనప్పుడు ఆడతారని అనుకున్నాను. ఇలా పనులు మానుకుని మరీ ఆడతారా?' - 'డెడ్ పిక్సెల్స్'లో హీరోకి ఓ క్యారెక్టర్ వేసే ప్రశ్న! అప్పుడు 'పగ, పగ మనతో ఏమైనా చేయిస్తుంది తెలుసా?' అని ఆన్సర్ ఇస్తాడు. 'ఎవరి మీద?' అంటే 'ఆన్‌లైన్‌లో ఛాలెంజ్ చేసిన వ్యక్తితో' అని చెబుతాడు. 'పేరు కూడా తెలియని వాడితో పగా?' అని ప్రశ్నిస్తే... 'అంటే ఇంకేం లేదు నా లైఫ్ లో!' (గేమింగ్ తప్ప) అని చెబుతాడు. ఈ సంభాషణ అంతా ఐదో ఎపిసోడ్ స్టార్టింగులో వస్తుంది! 

'డెడ్ పిక్సెల్స్'లో కూడా గేమింగ్ తప్ప ఇంకేమీ లేదు. అప్పటికే పనులు మానుకుని మరీ ఈ గేమింగ్ ఏమిటి? వాళ్ళు చేస్తున్నది ఏమిటి? వంటి సందేహాలు మీలో కలిగితే... మీకు సిరీస్ అసలు కనెక్ట్ కాలేదని అర్థం! సిరీస్ లేదా సినిమా... ప్రతి దానికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. 'డెడ్ పిక్సెల్స్' టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అని ఆలోచిస్తే... గేమర్స్! వాళ్ళు ఈ సిరీస్ చూడాలంటే... గేమింగ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. అంతకు మించి కిక్ ఇవ్వాలి. 'డెడ్ పిక్సెల్స్'లో అంత ఉందా? అంటే లేదని చెప్పాలి. రీమేక్ చేసేటప్పుడు లోకల్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా? లేదా? నేటివిటీ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. సిరీస్ మేకర్స్ ఆ పాయింట్ మర్చిపోయినట్టు ఉన్నారు. 

'డెడ్ పిక్సెల్స్' సిరీస్ స్టార్టింగ్ నుంచి చప్పగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ సన్నివేశాలకు గానీ, ఆటకు గానీ ఆసక్తిగా అనిపించవు. అయితే... మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ పర్వేలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. మెజారిటీ సీన్లు అయితే అపార్ట్మెంట్ లేదంటే ఆఫీసులో ఉండటంతో బాగా తీసినట్టు ఉంటుంది. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ఇంగ్లీష్, హిందీ సిరీస్ లు చూసే ఆడియన్స్ కు అయితే ఓకే గానీ కొన్ని సీన్లు తెలుగు ఓటీటీ ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు? అనేది చూడాలి. వల్గారిటీ ఎక్కడా లేదు గానీ సన్నివేశంలో కంటెంట్ & నిహారిక క్యారెక్టర్ చెప్పే ఓ డైలాగ్ ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు చాలా తక్కువ.

నటీనటులు ఎలా చేశారు? : నిహారిక కొణిదెలది టిపికల్ డైలాగ్ డెలివరీ. కామెడీ టైమింగ్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. గాయత్రి పాత్రకు ఆ యాక్టింగ్ సెట్ అయ్యింది. అక్షయ్ లగుసాని మెథడ్ యాక్టింగ్ చేశారు. ఆటకు అడిక్ట్ అయిన యువకుడిగా పాత్రలో జీవించారు. వైవా హర్ష నుంచి ఆడియన్స్ ఎంతో కొంత కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'డెడ్ పిక్సెల్స్'లో ఆయనకు కామెడీ చేసే ఛాన్స్ రాలేదు. భావనా సాగి తన పాత్రకు న్యాయం చేశారు. మందబుద్ధి కలిగిన యువకుడిగా సాయి రోనక్ కొన్ని సీన్లు చక్కగా చేశారు.  

Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?

చివరగా చెప్పేది ఏంటంటే? : 'డెడ్ పిక్సెల్స్'లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే గేమింగ్ లేదు. ఇటు ఎమోషనల్ కంటెంట్ & కనెక్టివిటీ లేదు. వీడియో గేమింగ్ అంటే పిచ్చి పట్టినట్లు కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోయి మరీ ఆటలు ఆడేవాళ్ళకు ఏమైనా కనెక్ట్ అవుతుందేమో!? తమను తాము ఆ క్యారెక్టర్లలో ఐడెంటిఫై చేసుకుంటారేమో!? మిగతా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు.

Also Read : ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?

Published at : 19 May 2023 08:57 AM (IST) Tags: Niharika Konidela ABPDesamReview Bhavana Sagi Dead Pixels Web Series Review Dead Pixels Review Aditya Mandala Akshay Lagusani

సంబంధిత కథనాలు

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Grey Movie Review - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Grey Movie Review  - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్