News
News
వీడియోలు ఆటలు
X

Fast X Review: ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో పదో సినిమా ‘ఫాస్ట్ X’ ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : ఫాస్ట్ X (ఇంగ్లిష్)
రేటింగ్ : 3/5
నటీనటులు : విన్ డీజిల్, జాసన్ మోమోవా, జాసన్ స్టాథమ్, బ్రీ లార్సన్, చార్లీజ్ థెరాన్ తదితరులు 
కథ : డాన్ మజేయు, జస్టిన్ లిన్, జాక్ డీన్
స్క్రీన్‌ప్లే: డాన్ మజేయు, జస్టిన్ లిన్
ఛాయాగ్రహణం : స్టీఫెన్ ఎఫ్.విండన్
సంగీతం : బ్రియాన్ టైలర్
నిర్మాణ సంస్థలు : యూనివర్సల్ పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ ఫిల్మ్స్, పర్ఫెక్ట్ స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం : లూయిస్ లెటెరియర్
విడుదల తేదీ: మే 18, 2023

Fast X Movie Review: ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మూవీ ఫ్రాంచైజీల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు మంచి క్రేజ్ ఉంది. ఫైట్ అయినా, ఛేజ్ అయినా, సినిమాలో యాక్షన్‌కు సంబంధించిన ఏ ఎలిమెంట్ అయినా అది కార్లతోనూ, రేసింగ్‌తోనూ ముడిపడి ఉండటం దీని స్పెషాలిటీ. ఈ సిరీస్‌లో 10వ సినిమా ‘ఫాస్ట్ X’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్టార్ కాస్టింగ్, నమ్మశక్యం కాని యాక్షన్ సీన్లు ఇందులో ఉండనున్నట్లు టీజర్, ట్రైలర్‌లను చూస్తే అర్థం అవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది?

కథ: డొమినిక్ టొరెట్టో (విన్ డీజిల్) తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఇంతలో రోమ్ నగరంలో చేయాల్సిన ఒక మిషన్ నుంచి ఏజెన్సీ నుంచి సమాచారం అందుతుంది. తను వెళ్లకుండా రోమన్‌ (టైరీస్ గిబ్సన్) లీడ్‌గా మిగతా టీమ్‌ను పంపిస్తాడు డొమినిక్. కానీ అది ఒక ట్రాప్ అని, ఒక గుర్తు తెలియని వ్యక్తి (జాసన్ మోమోవా) తన టీమ్‌కు ప్రమాదం ఉందని సైఫర్ (చార్లీజ్ థెరాన్) ద్వారా తెలుస్తుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి డాంటే రేయస్ అని, గతంలో తను చంపిన హెర్మన్ రేయస్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా ఐదో భాగంలో విలన్) కొడుకు అని తెలుస్తుంది. మరి డొమినిక్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే ఈ లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ సినిమాలకు ప్రధాన బలం అందులో ఉండే అన్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు. కార్లకు పారాచూట్లు కట్టి విమానంలో నుంచి వదిలేయడం, ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్‌కు కార్లలో దూకేయడం లాంటి యాక్షన్ సీన్లు ఇందులో మాత్రమే చూడగలం. కథ, కాకరకాయ లాంటివి పెద్దగా లేకపోయినా ఈ యాక్షన్ సీన్ల కారణంగానే బిలియన్ డాలర్ల (రూ. వేల కోట్ల) కలెక్షన్లను ఈ సిరీస్ సాధిస్తుంది.

ఇందులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్లు ఉన్నాయి. దర్శకుడు లూయిస్ లెటెరియర్ కథ కంటే యాక్షన్ మీదనే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేశారు. లైన్‌గా చూసుకుంటే చాలా చిన్న కథే. తన తండ్రి చంపిన హీరో మీద పగ తీర్చుకోవడానికి అతని కొడుకు విలన్‌గా రావడం అనే కథతో ప్రపంచంలోని అనేక భాషల్లో ఎప్పటి నుంచో సినిమాలు వచ్చాయి. కానీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని చాలా గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రథమార్థంలో రోమ్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్, క్లైమ్యాక్స్‌లో వచ్చే 40 నిమిషాల భారీ ఛేజ్ సీన్ విజువల్ ఫీస్ట్. లాజిక్‌ను మర్చిపోయి స్క్రీన్ మీదున్న మ్యాజిక్‌ను ఎంజాయ్ చేస్తాం. కారుతో హెలికాఫ్టర్లు పేల్చేయడం, బ్రిడ్జి మీద నుంచి ఎగిరి కొండను గుద్దుకున్నా కారు అంతే స్పీడ్‌లో మళ్లీ నడపడం వంటి క్రేజీ యాక్షన్ సీన్లు కూడా చూడవచ్చు. ఈ సినిమా, ఇందులో ఉన్న పాత్రల గురించి అర్థం కావాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్‌లో ముందుగా వచ్చిన 9 సినిమాలు, ‘హాబ్స్ అండ్ షా’ కూడా చూడాలి. అవన్నీ చూడటం కష్టం అనుకుంటే కనీసం ఐదో భాగం ‘ఫాస్ట్ 5’ అయినా చూడటం బెస్ట్.

విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ తర్వాత ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి కారణం వీక్ విలన్లే. కానీ ఆ లోటును ‘ఫాస్ట్ X’ తీర్చేస్తుంది. ‘ఆక్వామ్యాన్’లో హీరోగా నటించిన జాసన్ మోమోవా ఇందులో విలన్‌గా 100కు 100 మార్కులు కొట్టేస్తాడు. జాసన్ మోమోవా కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవల్. తన పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌లో జాక్ స్పారో తరహాలో ఉంటుంది.

సినిమా ఎక్కడా స్లోగా కానీ, బోరింగ్‌గా కానీ అనిపించదు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటిగా ఛేజింగ్, ఫైటింగ్ ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి. యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉండటంతో కథ నుంచి ఎక్కడా డిస్ ఎంగేజ్ అవ్వం. కానీ ప్రారంభంలో మాత్రం కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకుంటారు. ఇక చివర్లో కూడా కథను పూర్తి చేయలేదు. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ దగ్గర కథను ఆపేశారు. దీని తర్వాతి భాగం 2025లో విడుదల కానుందని ఇటీవల విన్ డీజిల్ ప్రకటించాడు. అదే ఈ సిరీస్‌లో ఆఖరి సినిమా అని చెప్పారు. కానీ ఊహించని సక్సెస్ అయితే మళ్లీ ఇంకో సినిమాతో వస్తారనేది మాత్రం ఓపెన్ సీక్రెట్‌నే.

ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏకంగా 161 మంది స్టంట్ డైరెక్టర్లు, కో-ఆర్డినేటర్లు పని చేశారు. ఆ గ్రాండియర్ స్క్రీన్ మీద కనబడుతుంది. సినిమాటోగ్రఫర్ స్టీఫెన్ ఎఫ్. విండన్‌ వీటిని చాలా ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా రియలిస్టిక్‌గా ఉన్నాయి. బ్రియాన్ టైలర్ అందించిన సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్లు ఉంది.

Also Read ఛత్రపతి రివ్యూ: బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?

ఇక నటీనటుల విషయానికి వస్తే... ‘ఫాస్ట్ X’లో భారీ స్టార్ కాస్ట్ ఉంది. ప్రధాన పాత్రలో నటించిన డొమినిక్ టొరెట్టో ఈ సిరీస్‌లో 10 సినిమాల నుంచి నటిస్తున్నాడు. కాబట్టి అతని పాత్ర కొత్తగా ఏమీ ఉండదు. విలన్‌గా నటించిన జాసన్ మోమోవా సర్‌ప్రైజ్ ప్యాకేజ్. విలన్ పాత్రలో ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. స్క్రీన్ మీద జాసన్ మోమోవా కనిపించినంత సేపు మన చూపు ఇతర పాత్రల మీదకు మళ్లదు. అంత అద్బుతంగా నటించాడు. కామెడీ, సీరియస్ సన్నివేశాల్లో వేరియేషన్ చూపిస్తూ యాక్టింగ్‌లో చెలరేగిపోయాడు. రోమన్ పాత్రలో నటించిన టైరీస్ గిబ్సన్ కాసేపు నవ్విస్తాడు. ఇక మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్‌కు ఈ సినిమా మస్ట్ వాచ్. వీకెండ్‌లో ఒక టైమ్ పాస్ సినిమా చూడాలనుకున్నా దీన్ని ట్రై చేయవచ్చు. సినిమాలో మాత్రం ‘నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్...’

Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?

Published at : 18 May 2023 11:33 AM (IST) Tags: ABPDesamReview Jason Momoa Vin Diesel Fast X Fast X Telugu Review Fast X Review Fast X Movie Review Fast X Review in Telugu Fast and Furious 10

సంబంధిత కథనాలు

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Grey Movie Review - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Grey Movie Review  - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్