By: ABP Desam | Updated at : 19 May 2023 01:52 PM (IST)
Photo Credit: Golden Globe Awards/RRR Movie/ Chiranjeevi Konidela /Instagram
‘RRR’ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసిపోయింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారత్ తో పాటు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినిమా అవార్డులను సైతం దక్కించుకుంది. ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. తెలుగు సినిమా సత్తా ప్రపంచ నలు దిశలా చాటి చెప్పింది.
తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని వివరిస్తూ గోల్డెన్ గ్లోబ్ పోర్టల్ ప్రత్యేక సంపాదకీయాన్ని రాసింది. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానాన్ని అందులో పొందుపరిచింది. తెలుగు సినిమాల గురించి ప్రస్తావించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర ఆయా చిత్రాలు నెలకొల్పిన రికార్డుల గురించి వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో తెలుగు సినిమా పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతుందంటూ ప్రశంసలు కురిపించింది. గత ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ 212 మిలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ. 1754 కోట్లు సాధించినట్లు వెల్లడించింది. ఇండియా సినిమా అంటే తమదే అని చెప్పుకునే బాలీవుడ్ మాత్రం రూ. 179 మిలియన్ డాలర్లు(భారతీయర కెన్సీలో రూ. 1630) కోట్లు మాత్రమే సాధించినట్లు రాసుకొచ్చింది.
Tollywood –Telugu Cinema in India: https://t.co/IVEyqJCnW2 pic.twitter.com/UqMDDmGkHQ
— Golden Globe Awards (@goldenglobes) May 17, 2023
ఈ ప్రత్యేక సంపాదకీయంలో తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా వివరించింది. 1921లో వచ్చిర ‘భీష్మ ప్రతిజ్ఞ’ సినిమాతో తెలుగు సినిమాకు పునాది పడినట్లు వెల్లడించింది. 1931లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ తొలి టాకీ చిత్రంగా విడుదలైనట్లు తెలిపింది. రఘుపతి వెంకయ్య నాయుడు తెరకెక్కించిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ నుంచి రాజమౌళి ‘RRR’ సినిమా వరకు ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు తెలుగులో తెరకెక్కినట్లు వివరించింది. అంతేకాదు, హైదరాబాద్ లో సినిమా స్టూడియోల ఏర్పాటు, ఎన్టీఆర్, చిరంజీవి, బ్రహ్మానందం, రాజమౌళి లాంటి సినీ ప్రముఖుల గురించి ప్రత్యేకంగా వివరించింది.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా గొప్పతనాన్ని వివరించిన ‘RRR’ సినిమా గురించి గోల్డెన్ గ్లోబ్ పోర్టల్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్, వచ్చిన వసూళ్ల వివరాలను వెల్లడించింది. ‘RRR’తో పాటు రాజమౌళి అంతకు ముందు తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ గురించి ప్రస్తావించింది. అటు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’, ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘సాహో’, అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురములో’ మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాల గురించి వివరించింది. డిస్నీ సహ నిర్మాతగా రూపొంది 2011లో విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా గురించి కూడా రాసుకొచ్చింది. భారత్ లో డిస్నీ తెరకెక్కించిన తొలి సినిమా ఇదేనని వెల్లడించింది. భారతీయ సినిమా మార్కెట్ దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్నట్లు గోల్డెన్ గ్లోబ్ తెలిపింది. ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ లు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న కారణంగా ప్రాంతీయ భాషా చిత్రాలు బాగా అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో టాలీవుడ్ టాప్ పొజిషన్ లోఉన్నట్లు తెలిపింది.
Read Also: ‘లియో’ మూవీకి సంజయ్ దత్ భారీ రెమ్యునరేషన్ - గ్యాంగ్‌స్టర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే
Ennenno Janmalabandham June 8th: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!