News
News
వీడియోలు ఆటలు
X

Sanjay Dutt in LEO: ‘లియో’ మూవీకి సంజయ్ దత్ భారీ రెమ్యునరేషన్ - గ్యాంగ్‌స్టర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

లోకేష్ కనగరాజ్- విజయ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘లియో’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

‘వారిసు’ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరో విజయ్ ఫుల్ జోష్ లో ఉండగా, ‘విక్రమ్’ సక్సెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘లియో’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మరో  కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  

భారీగా రెమ్యునరేషన్ తీసుకుటుంటున్న సంజయ్ దత్

‘లియో’ సినిమాలో  విజయ్ దళపతి తండ్రిగా సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరూ గ్యాంగ్‌ స్టర్స్‌ గా నటించనున్నారు. సూపర్ డూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో వీరిద్దరు అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్రలో నటించేందుకు గాను సంజయ్‌కు  రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత గ్యాంగ్ స్టర్ గా ఉన్న విజయ్, ఆ తర్వాత గ్యాంగ్ వార్‌లకు దూరంగా ఉంటూ కాశ్మీర్‌లోని చాక్లెట్ ఫ్యాక్టరీ యజమానిగా ఆయన కనిపించనున్నారు.  ఇప్పటికే సంజయ్ ఈ చిత్రానికి సంబంధించి కాశ్మీర్, చెన్నై షెడ్యూల్‌లలో విజయ్‌తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు. 

View this post on Instagram
 
A post shared by 𝐓𝐡𝐚𝐥𝐚𝐩𝐚𝐭𝐡𝐢 𝐯𝐢𝐣𝐚𝐲 🔵 (@actor_vijay_official._)

వరుసగా నాలుగో చిత్రానికీ అనిరుధ్ సంగీతం

ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే విజయ్ తో కలిసి ఆయన మూడు సినిమాలు చేశాడు. 'కత్తి', 'మాస్టర్‌', 'బీస్ట్‌' సినిమాలకు అద్భుత సంగీతం అందించాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా నాలుగో సినిమాకు కూడా ఆయన సంగీతం అందించబోతున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్‌ కోసం అన్బరివ్‌ పని చేయనున్నారు. ఫిలోమిన్‌రాజ్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ కొరియోగ్రఫీ, డైలాగులు లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, దీరజ్‌ వైదీ అందించనున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమ్‌’ సినిమాతో లోకేశ్‌ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు.. ‘విక్రమ్’ తరహాలో మరో బ్లాక్‌బస్టర్ ఇస్తారనే ఆశతో ఉన్నారు.   

విజయ్, లోకేశ్ కనకరాజ్ సినిమా కోసం నెట్‌ ఫ్లిక్స్ భారీ డీల్ 

లోకేశ్ కనకరాజ్, విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘లియో’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ కోసం నెట్‌ ఫ్లిక్స్ రూ.160 కోట్ల  ధర చెల్లించినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఓ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి. మిస్కిన్​, జీవీఎమ్​, ప్రియా ఆనంద్ సహా పలువురు ఈ చిత్రంలో నటించనున్నారు. ‘లియో’ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read Also: జల ప్రళయంలో వెల్లివిరిసిన మానవత్వం, ఆకట్టుకుంటున్న ‘2018’ తెలుగు ట్రైలర్

Published at : 19 May 2023 11:42 AM (IST) Tags: Leo Vijay thalapathy vijay lokesh kanagaraj Sanjay Dutt LEO Update

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!