అన్వేషించండి
Sachin about 2011 World Cup Final | 2011 ఫైనల్ లో ధోనిని పంపడానికి కారణం ఉంది
2011లో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 274 పరుగుల లక్ష్యంతో టీం ఇండియా బరిలోకి దిగింది. కానీ 21.4 వర్ల వద్ద మూడో వికెట్ రూపంలో విరాట్ కోహ్లిని కూడా కోల్పోయింది టీం ఇండియా. ఆ తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు వస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఆలా జరగకుండా ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. దాంతో అందరు షాక్ అయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయంపై గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. రీసెంట్ గా ఫ్యాన్స్ తో సచిన్ చాట్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సెషన్ లో 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోనిని యువి కన్నా ముందు ఎందుకు పంపిచ్చారు అంటూ సచిన్ కు ప్రశ్న ఎదురయింది. "హాయ్ సచిన్. CWC ఫైనల్‌లో యువీ కంటే ముందు MSDని ప్రమోట్ చేయాలనే ఆలోచన మీదని వీరు చెప్పారు. అది నిజమేనా ? ఆ నిర్ణయానికి గల కారణం ఏంటి ? అని అడిగారు ఒక ఫ్యాన్. ఈ ప్రశ్నకు సచిన్ మంచి సమాధానం ఇచ్చారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి అని అన్నారు. లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ ఆఫ్-స్పిన్నర్లను ఇబ్బంది పెడుతుంది. అలాగే మురళీధరన్ CSK టీంలో ఆడాడు. 3 సీజన్ల పాటు మురళీధరన్ ను MS నెట్స్‌లో ఎదుర్కున్నాడు అని అన్నాడు సచిన్. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా సచిన్ ను తెగ పొగిడేస్తున్నారు. గంభీర్, యువరాజ్ సింగ్ ... వీలిద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. కానీ ధోని రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్. మురళీధరన్ బౌలింగ్ చేస్తున్నారు. ధోనిని ముందు పంపించి మంచిపని చేసారని అంటున్నారు ఫ్యాన్స్. కానీ ధోని జీవితం ఆధారంగా తీసిన "ఎంఎస్ ధోని అన్‌టోల్డ్ స్టోరీ" సినిమాలో మాత్రం... కోచ్ దెగ్గరకు వెళ్లి యువి కన్నా ముందు నేనే వెళ్తానని ధోని కు చెప్పినట్లు చూపిస్తారు. ఏదేమైనా టీం ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో సచిన్ ఇచ్చిన ఈ చిన్న ప్లాన్ చాలా కీలకం అనే చెప్పాలి.
ఆట
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















