Baahubali The Epic Teaser: 'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?
Baahubali The Epic: రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి' 2 పార్టులు ఒకే మూవీగా 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది.

Rajamouli's Baahubali The Epic Teaser Out Now: బాహుబలి... భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హిస్టారికల్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాహిష్మతి సామ్రాజ్య చరిత్ర రిలీజై ఇటీవలే పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఫస్ట్, సెకండ్ పార్టులను కలిపి ఒకే మూవీ 'బాహుబలి: ది ఎపిక్' గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
టీజర్ అదుర్స్
ఇది రీ రిలీజ్ కాదని... 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' రెండు మూవీస్ కలిపి ఒకే మూవీగా రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 'పదేళ్ల క్రితం భారతీయ సినిమాలో ఓ కథ పునర్నిర్వచించబడింది.' అంటూ మాహిష్మతి సామ్రాజ్య ఎంట్రీని చూపించారు. కాళకేయులతో బాహుబలి, రానా యుద్ధ సన్నివేశాలు, దేవసేనతో బాహుబలి లవ్ స్టోరీ, శివుడిని శివగామి కాపాడడం దగ్గర నుంచి కట్టప్ప బాహుబలిని చంపడం వరకూ అన్నీ సీన్స్‌ను టచ్ చేస్తూ కట్ చేసిన టీజర్ హైలెట్‌గా నిలిచింది.
మిగిలిన వెర్షన్లలోనూ...
టీజర్‌లో విజువల్ క్వాలిటీ అద్భుతంగా ఉండగా... ఈసారి ఐమాక్స్ వెర్షన్‌లోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 4డీఎక్స్, ఎక్స్ బాక్స్ వంటి ఇతర వెర్షన్లలోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Mana Bahuballi malli mana kosam vastunadu ❣️❣️
— Authentic (@l1a9X2m8a3n7) August 26, 2025
esari re-release records anni 💣💣💣#bahubalitheepic #bahubali #prabhas #ranadagubathi pic.twitter.com/ppSjDrsSv8
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సాంగ్ రిలీజ్... కాలేజీ ప్రేమకథలో ఏం జరుగుతోంది?
ప్రమోషన్స్ భారీగా...
ఈ ఏడాది అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' మూవీని రిలీజ్ చేయనుండగా... ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేయనున్నారు. టీజర్, ట్రైలర్‌తో పాటు ఈవెంట్స్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ప్రభాస్, రానాలతో పాటు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రన్ టైం ఎంతంటే?
'బాహుబలి: ది ఎపిక్' అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ రన్ టైం ఎంతనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై గతంలో ట్రోలింగ్స్ కూడా సాగాయి. మెయిన్ సీన్స్ ఏవీ కట్ చేయకుండా అలానే ఉంచాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏ సీన్స్ ఉంచుతారు? ఏ సీన్స్ కట్ చేస్తారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గతంలో బుక్ మై షో రన్ టైం 5 గంటల 27 నిమిషాలు అని పెట్టి వెంటనే డిలీట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, వెంటనే దాన్ని డిలీట్ చేయగా... మీమ్స్‌పై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. 'బాహుబలి: ది ఎపిక్' ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ రన్ టైంలానే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. సినిమా ట్రిమ్ చేస్తే... ఆ ఎక్స్‌పీరియన్స్ కోల్పోతామంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.






















