Viral Kidnap: నా భార్యను తిరిగి తీసుకురా, నీ భార్యను తీసుకో- ఈ కిడ్నాప్ స్టోరీ నెక్ట్స్ లెవల్
Surat Kidnap: సూరత్‌లో ఓ విచిత్రమైన కిడ్నాప్ జరిగింది. ఓ వ్యక్తికి ఫోన్ చేసి.. నీ భార్యను కిడ్నాప్ చేశాను. నా భార్యను తీసుకొచ్చి .. నీ భార్యను తీసుకెళ్లు అని చెప్పాడు. అక్కడే అసలు కథ ప్రారంభమయింది.

Surat Kidnap ultimatum: ఫ్యామిలీ డ్రామాల్లో చాలా విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటిదే ఈ స్టోరీ కూడా. ఓ వ్యక్తి తాను ప్రేమించిన యువతిని తీసుకెళ్లిపోయాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. ఆమె భర్త.. ప్రియుడు ఇంటికి వెళ్లి ఆయన తల్లిని యను కిడ్నాప్ చేసుకుని వచ్చాడు. ఆ భార్య లవర్ తండ్రికి ఫోన్ చేసి తన భార్యను తీసుకొచ్చి అప్పగించి.. నీ భార్యను తీసుకెళ్లు అని అల్టిమేటం ఇచ్చాడు. గుజరాత్ లోని సూరత్ లో ఇది జరిగింది.
సూరత్‌లోని గోడదారా పోలీస్ స్టేషన్‌లో బధ్సింగ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి తన భార్య కిస్మత్ కున్వర్ అపహరణకు గురైనట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని దేవ్‌డాగోడా నుండి ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ బధ్సింగ్ ఇంటికి వచ్చారు. వారిలోని మహిళ తనను అరుణ అనే తల్లిగా పరిచయం చేసుకుంది. ఈ బృందం రాజస్థాన్ నుండి వచ్చి, బధ్సింగ్ ఇంటిలో ఆ రాత్రి గడిపారు. మరుసటి రోజు ఉదయం, బధ్సింగ్, అతని చిన్న కుమారుడు కలు సింగ్ పనికి వెళ్లిన తర్వాత, ఆ మహిళ బధ్సింగ్ భార్య కిస్మత్ కున్వర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు.
బధ్సింగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన భార్య లేకపోవడం , ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండటం గమనించాడు. ఆగస్టు 22న మధ్యాహ్నం, అతనికి ఒక అనామక నంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన తన భార్య కిస్మత్ కున్వర్ మాట్లాడిది. అయితే వెంటనే కాల్ కట్ అయింది. ఆమె రాజస్థాన్‌లోని కోటాలో ఉన్నట్లుగా గుర్తించారు.
తన ఇంటికి వచ్చిన వాళ్లే కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఇంటికి వచ్చిన వారు ఎవరంటే.. బధ్సింగ్ కుమారుడు .. ప్రేమించానని చెప్పితీసుకెళ్లిన మహిళ. ఆమె ఉదయ్ సింగ్ రాజ్‌పుత్ భార్య. "నా భార్యను తిరిగి తీసుకురా, నీ భార్యను తీసుకో, లేకపోతే మేము ఆమెను చంపేస్తాం." ఆ తర్వాత ఉదయ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది.
గోడదారా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎస్ ఆచార్య అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కరణ్ సింగ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో, పోలీసులు బధ్సింగ్‌తో కలిసి పుణెలోని అతని నివాసానికి ఒక బృందాన్ని పంపారు. అలాగే, అపహరణకు గురైన కిస్మత్ కున్వర్ భద్రత కోసం రాజస్థాన్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ సంఘటనకు ముందు, రాజస్థాన్‌లోని బేవర్ పోలీస్ స్టేషన్ నుండి బధ్సింగ్‌కు ఒక కాల్ వచ్చింది, అతని కుమారుడు కరణ్ సింగ్‌పై అపహరణ ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కరణ్ సింగ్, అరుణ, ఉదయ్ సింగ్‌లను గుర్తించి, కిస్మత్ కున్వర్‌ను సురక్షితంగా విడుదల చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసులు ఈ కేసులో కీలక వ్యక్తులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సంఘటన సూరత్ , రాజస్థాన్‌లోని స్థానిక వర్గాలలో తీవ్ర కలకలం రేపింది.





















