Tinder Dating Scam: రెస్టారెంట్లలో టిండర్ డేటింగ్ మోసం - కాలేజ్ గర్ల్స్‌ను ఎర వేసి బిల్ పెంచేస్తున్నారు - ఇది తెలుసుకుంటే మోసపోలేరు !
Dating Scam Restaurants: డేటింగ్ సైట్‌లో అమ్మాయి హాయ్ చెబుతోంది. రెస్టారెంట్ కు వెళ్లి తింటూ,తాగుతూ మాట్లాడుకుందామని పిలుస్తుంది. వెళ్లారో బిల్లు దెబ్బకు కళ్లు బైర్లు కమ్ముతాయి.

Restaurants Tinder Dating Scam : ఇండియాలోని మెట్రో నగరాల్లో ఇప్పుడు సరికొత్త మోసాలు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు ఈ మోసానికి కేంద్రంగా మారుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలలో టిండర్ డేటింగ్ స్కామ్‌లు పెరిగాయి. ఇది రెస్టారెంట్ ఓనర్లు లేదా మేనేజర్లు కాలేజ్ విద్యార్థినులతో ఒప్పందం చేసుకుని వారితో టిండర్ (Tinder) డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఆకర్షితులైన వారిని రెస్టారెంట్‌కు వచ్చేలా చేస్తున్నారు. ఫుడ్ & డ్రింక్స్ పై ఖర్చును విపరీతంగా చేసేలా చేస్తున్నారు. మార్జిన్‌గా, అలాంటి అమ్మాయిలకు టోటల్ బిల్‌లో 20 శాతం కమిషన్ ఇస్తున్నారు. .
ముంబైలో జూహూ, బాంద్రా వంటి ప్రాంతాలలో మొదట ఈ స్కామ్ ప్రారంభమైంది, తర్వాత ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాలకు వ్యాపించింది. అలాకార్జా రెస్టారెంట్స్ లేదా పబ్‌లు బిజినెస్ పెంచడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కాలేజ్ గర్ల్స్ ను జాబ్ పోస్టులు "పార్ట్-టైమ్ ప్రమోషనల్ జాబ్" లేదా "సోషల్ మీడియా మార్కెటింగ్" ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. వారితో ట్రాప్ చేయించి.. భారీగా వ్యాపారాలను పెంచుకుంటున్నారు. అమాయకుల్ని నిండా ముంచుతున్నారు. ఇప్పటికే పలునగరాల్లో ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో (కనాట్ ప్లేస్), బెంగళూరులో (కొరమంగల) ఇలాంటి కేసులు నమోదయ్యాయి. టిండర్ యాప్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అప్పర్ మిడిల్ క్లాస్ లేదా IT ప్రొఫెషనల్స్ డేట్‌కు రెస్టారెంట్‌కు తీసుకువచ్చి లక్ష వరకూ బిల్లు చేయిస్తున్నారు .
Some restaurants are hiring single college girls, asking them to create Tinder profiles, bring guys for dates to the restaurant, encourage higher spending on food and drinks, and in return, girls get 20% of the total bill. pic.twitter.com/A5WwlR4INQ
— Nalini Unagar (@NalinisKitchen) August 25, 2025
డేట్‌లో గర్ల్స్ బాయ్స్‌ను రెస్టారెంట్‌లో కూర్చోబెట్టి, "స్పెషల్ డ్రింక్స్/ఫుడ్" ఆర్డర్ చేయిస్తారు. వీటికి బిల్ రూ. 10,000-50,000 అవుతుంది. టోటల్ బిల్‌లో 20 శాతం ఆ మహిళకు ఇస్తున్నారు. బిల్లు కట్టిన తర్వాత ఆ కాలేజీ యువతి కనిపించదు. అయితే ఈ మోసంలో అమ్మాయిల్ని కూడా రెస్టారెంట్ యజమానులు మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు.
గర్ల్స్ మొదట "ఈజీ మనీ" అనుకుంటారు, కానీ రెస్టారెంట్ ఓనర్లు వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేసి మరిన్ని డేట్‌లు ఫోర్స్ చేస్తారు. డేటింగ్ యాప్‌లలోపరిచయమై.. ఖరీదైన రెస్టారెంట్ కు డేట్స్ కు వెళదామనే అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి మోసాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా మోసపోయిన పలువురు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొంత మంది పోలీసులకూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదులు చేయడంతో ముంబైలో యాభైకిపైగా రెస్టారెంట్లపై కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓ కేసు నమోదు అయింది. చాలా మంది పరువు పోతుందని సైలెంట్ గా ఉంటున్నారు., దీని వల్లే రెస్టారెంట్లు, పబ్‌లు చెలరేగిపోతున్నాయి.





















