INS Udaygiri: భారత నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి - విశాఖపట్నం నుంచి వార్ జర్నీ స్టార్ట్
Indian Warships: భారత నావికాదళం మరితం బలోపేతం అయింది. INS ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలు విశాఖపట్నం నుంచి సముద్రంలోకి ప్రవేశించాయి.

INS Udaygiri Himgiri Indian Warships Commissioned in Vizag: విశాఖపట్నం: భారత నౌకాదళం తన యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. విశాఖపట్నం నుంచి రెండు అత్యాధునిక INS ఉదయగిరి (F35) , INS హిమగిరి (F34) ఒకేసారి వార్ జర్నీ ప్రారంభించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి సమక్షంలో డు వేర్వేరు షిప్‌యార్డ్‌ల నుండి ఒకేసారి రెండు ప్రధాన యుద్ధ నౌకలను సముద్రంలోకి పంపారు. ఇలా చేయడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఈ యుద్ధ నౌకల్ని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించారు. INS ఉదయగిరిని ముంబైలోని మజగాం డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించగా, INS హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించింది. ఈ రెండు నౌకలు 75 శాతం స్వదేశీ భాగాలతో నిర్మితమయ్యాయి. ఇది మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది.
INS ఉదయగిరి నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB) రూపొందించిన 100వ నౌకగా గుర్తింపు పొందింది. ఇది స్వదేశీ రక్షణ రూపకల్పనలో భారత్ సాధించిన పురోగతిని సూచిస్తుంది. ఈ యుద్ధ నౌకలు 6,700 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఈ నౌకలు కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (CODOG) ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తాయి. 5,500 నాటికల్ మైళ్ల రేంజ్‌ను కలిగి ఉంటాయి. దీర్ఘ శ్రేణి యాంటీ-షిప్ మరియు ల్యాండ్ అటాక్ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. విమానాలు, డ్రోన్‌లు , మిసైల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వరుణాస్త్ర టార్పెడోలు , RBU-6000 యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్‌లు, అండర్‌వాటర్ దాడులను ఆపడం చేస్తాయి. రెండు హెలికాఫ్టర్లనను కూడా ఈ యుద్ధ నౌకలు హోస్ట్ చేయగలవు.
#IndianNavy 26 अगस्त को Udaygiri (F35) और Himgiri (F34) को एक साथ नौसेना में शामिल करने की तैयारी कर रही है।
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) August 25, 2025
यह पहली बार है जब दो प्रतिष्ठित भारतीय शिपयार्डों के दो प्रमुख सतही लड़ाकू जहाजों को एक ही समय में विशाखापत्तनम में नौसेना में शामिल किया जाएगा। pic.twitter.com/W6qnU7dypH
యాంటీ-ఎయిర్, యాంటీ-సర్ఫేస్, మరియు యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధాలలో బహుముఖ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. భారతదేశం సముద్ర ప్రయోజనాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బ్లూ వాటర్ ఎన్విరాన్‌మెంట్‌లో అంటే ఒడ్డుకు దూరంగా లోతైన సముద్రంలో) సాంప్రదాయ, అసాధారణ దాడులను ఎదర్కొంటాయి. ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈ నౌకలను స్వతంత్రంగా లేదా పెద్ద నావికాదళ ఫ్లీట్‌లో భాగంగా వ్యూహాత్మక సౌలభ్యంతో పనిచేయడానికి అనుమతిస్తుంది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో కమిషనింగ్ కార్యక్రమం వేడుకగా జరిగింది.





















