అన్వేషించండి

Guruvayyur Jasmin Jaffar Controversy: గురావాయుర్ కొలనులో కాలుపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. శుద్ధి చేస్తున్న దేవస్థానం

Jasmin Jaffar Conroversy: ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన పనితో గురవయ్యూరు శ్రీకృష్ణ దేవస్థానం శుద్ధి ప్రక్రియ ప్రారంభించింది. జాస్మిన్ జాఫర్ Jasmin Jaffar పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

Guruvayyur Jasmin Jaffar Controversy:  పాపులర్ మలయాళీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, Bigboss మలయాళం కంటెస్ట్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన ఓ రీల్ వివాదం రేపింది. పవిత్రమైన గురువాయర్ శ్రీకృష్ణ కోవెల కొలనులో ఆమె చేసిన వీడియో.. ప్రకంపనలు సృష్టించింది.  కోవెల కొలనులో  పాద ప్రక్షాళన చేయడం విమర్శలకు దారితీసింది.

వివాదం ఎందుకు..?

కేరళలోని గురువాయిర్ శ్రీకృష్ణ దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైన కృష్ణతీర్థం. అక్కడ ఆచారాలను చాలా నిష్ఠగా పాటిస్తారు. అన్యమతస్తులకు ఆలయ ప్రవేశం ఉండదు. హిందువులు కూడా పై వస్త్రాన్ని తీసేసి.. పూర్తి సాంప్రదాయ వస్త్రధారణతో గుడిలోకి అడుగుపెట్టాలి. ఆలయ నియమాలను అత్యంత కఠినంగా అమలు చేస్తారు. అయితే ఇతర మతస్థురాలైన జాస్మిన్‌ తన ఇన్‌స్టాగ్రమ్ రీల్ కోసం గురువయ్యూర్‌లోని స్వామివారి కోనేటిలో పాదాలను కడిగింది.  ఈ రీల్ వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగింది. తరతరాలుగా కాపాడుతున్న ఆలయ సాంప్రదాయానికి భంగం కలిగిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

శుద్ధీకరణ చేస్తున్న ఆలయ బోర్డు

జరిగిన ఘటనపై గురువయ్యార్ దేవస్థానం బోర్డు  Guruvayyur Devaswom Board స్పందించింది. ఆచారాలకు భంగం కలగడంతో చర్యలకు ఉపక్రమించింది. ఆరురోజుల పాటు పుణ్యావహకం ( శుద్ధీకరణ) నిర్వహిస్తామని 18 రకాల పూజలను చేస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. అలాగే ఆలయ అధికారులు టెంపుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాస్మిన్ ఆలయ నియమాలకు భంగం కలింగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆలయంలోనూ.. పవిత్ర ప్రదేశాల్లో ఫోటోగ్రఫీపై నిషేదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోకి అన్యమతస్తులకు ప్రవేశం లేదు. ఈ విషయాన్ని నేరుగా ఫిర్యాదులో పేర్కోనప్పటికీ.. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారని చెప్పారు.

ఎవరీ జాస్మిన్ జాఫర్ Who is Jasmin Jaffar..?

24 ఏళ్ల జాస్మిన్ జాఫర్ కేరళలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ , Youtuber, కంటెంట్ క్రియేటర్. ఆమె మొదట యూట్యూబ్ చానల్‌లో బ్యూటీ టిప్స్ చెప్పడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆమె  ఛానల్‌కు 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌ను 8లక్షల మంది ఫాలో అవుతున్నారు. కిందటేడాది మలయాళం బిగ్‌బాస్ సీజన్-6 ద్వారా ఆమె  ఫేమస్ అయ్యారు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు.. తన కో కంటెస్టెంట్‌తో అతి చనవుగా ఉంటోందని ఆమెకు కాబోయే భర్త నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి.. అప్పట్లో అది వివాదం రేపింది.  ఇప్పుడు తాజాగా గురువయ్యార్‌లో చేసిన రీల్ వెంటనే వైరల్ అయ్యి వివాదానికి దారితీసింది.


Guruvayyur Jasmin Jaffar Controversy: గురావాయుర్ కొలనులో కాలుపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. శుద్ధి చేస్తున్న దేవస్థానం

క్షమాపణ చెప్పిన జాస్మిన్

తను చేసిన రీల్ వివాదానికి దారితీయడంతో జాస్మిన్ జాఫర్ క్షమాపణ చెప్పారు. అది వైరల్ అయ్యి.. నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఆమె ఆలయ నియమాలకు భంగం కలిగించిందన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో జాస్మిన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఎవరి మనోభావాలను నొప్పించాలని నేను ఈ పని చేయలేదు. నాకు దానిపై అవగాహన లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. నా వల్ల జరిగిన తప్పుకు మన్నించండి” అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకున్నారు

గురవయ్యూర్ ఆలయ నిబంధనలు కచ్చితంగా అమలు చేసే విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. విఖ్యాత గాయకుడు కె.జె.ఏసుదాసును ఆలయంలోకి అనుమతించకపోవడంపై దేశవ్యాప్త చర్చ జరిగింది. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఆయన ఆలయం వెలుపలే గానం చేసి వెళ్లేవారు. అయినప్పటికీ నిబంధనల విషయంలో దేవస్థానం కఠినంగానే వ్యవహరించింది.

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget