అన్వేషించండి
Rohit Sharma Retirement | రోహిత్ కోసమే బ్రాంకో టెస్ట్ అంటున్న మాజీ క్రికెటర్
ప్లేయర్స్ ఫిట్ నెస్ మరింత పెంచడానికి బీసీసీఐ ఒక కొత్త టెస్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే బ్రాంకో టెస్ట్. ఈ టెస్ట్ మొత్తని కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ ను ఫిట్‌నెస్ లేక ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్ల కోసం తీసుకోని వచ్చారట. అయితే ఈ బ్రాంకో టెస్ట్ పై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ టెస్ట్ రోహిత్ శర్మను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ చేసేందుకె తీసుకువచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మను ఫిట్ నెస్ ఉన్న ప్లేయర్ గా ఎవరు అనుకోరని... కానీ తన పెర్ఫార్మెన్స్ వల్లే బెంచ్ పై కూర్చోలేదని అన్నారు. అలాగే ఫిట్ నెస్ పరంగా చూస్తే 2027 వన్డే వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లిని కన్సిడర్ చేసినా కూడా రోహిత్ ను చేయలేరని అంటున్నారు మనోజ్ తివారీ. కొత్తగా తీసుకోని వచ్చిన బ్రాంకో టెస్ట్ రోహిత్ శర్మతో పాటు అలాంటి మిగితా ప్లేయర్స్ కూడా తమ కెరీర్ ను ముగించడానికే తీసుకోని వచ్చారని తాను అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు మనోజ్ తివారీ. రోహిత్ టీంలో ఉండకూడదని ఎవరో కోరుకుంటున్నారు..అందుకే బ్రాంకో టెస్ట్ తీసుకువచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు మనోజ్ తివారీ. తన అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ కావడం చాలా కష్టం అని అన్నారు.
ఆట
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్





















