IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Celebs Mourn Sirivennela Demise: సిరివెన్నెల ఎప్పటికీ ఉంటుంది... ఆ అక్షరాలు నిలిచే ఉంటాయి - 'సిరివెన్నెల'కు ప్రముఖుల నివాళి

తెలుగు సినిమా పరిశ్రమ 'సిరివెన్నెల' మరణంతో శోక సంద్రంలో మునిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ... కన్నీటి కడలి నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తోంది.

FOLLOW US: 

ఓ కలం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. 'సిరివెన్నెల' మరణంతో తెలుగు సాహితీ ప్రపంచమే కాదు... సినిమా పరిశ్రమ శోక సంద్రంలో మునిగింది. ప్రతి మనిషికి మరణం తథ్యమని తెలిసినా... మౌనంగా వచ్చే కన్నీళ్లను, మనసులో బాధను ప్రముఖులు ఇలా వెల్లడిస్తున్నారు. 

'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు - చిరంజీవి

సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు - నంద‌మూరి బాల‌కృష్ణ‌

సాహిత్య శిఖరం నేలకొరిగింది - మోహన్ బాబు

ట్విట్టర్ వేదికగా సిరివెన్నెల సీతారామశాస్త్రి‌ నివాళులు అర్పించారు ఎన్టీఆర్. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారాయన.

చుక్కల్లారా... చూపుల్లారా... ఎక్కడమ్మా జాబిలి? - ఎం.ఎం. కీరవాణి

ఆర్ఆర్ఆర్, సైరా కోసం ఆయన చెప్పిన మాటలు నాకెప్పటికీ గుర్తు ఉంటాయి - రామ్ చరణ్

'సిరివెన్నెల' తెలుగు సాహిత్య శిఖరం - దర్శకుడు అనిల్ రావిపూడి 

కను మూసిన తరువాతనే.. పెను చీకటి చెబుతుందా! - దర్శకుడు గోపీచంద్ మలినేని

తెలుగు భాష 'సిరివెన్నెల'ను కోల్పోయింది - దర్శకుడు మెహర్ రమేష్

పదాలు మూగబోయాయి - దర్శకుడు సతీష్ వేగేశ్న

సిరివెన్నెల గారూ... పరిశ్రమకు మీరు అందించిన సేవలకు థాంక్యూ! మీరు ఎప్పటికీ గుర్తుంటారు. మిమ్మల్ని ఎప్పటికీ మరువలేం. మీతో పని చేసినందుకు గర్వంగా ఉంది - హీరో రామ్

ఆయన సాహిత్యంలోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే ఉంటుంది - హీరో నాని

వచనం మధురం... లిఖితం మనోహరం - సితార ఎంటర్టైన్మెంట్స్

మాటలు రావడం లేదు! - సాయి తేజ్
సిరివెన్నెల మరణంతో తనకు మాటలు రావడం లేదని హీరో సాయి తేజ్ అన్నారు. 'గొప్ప లెజెండ్'ను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.

ఆయన పాటలను ఎప్పటికీ మరువలేం - అఖిల్ అక్కినేని

బ్రహ్మకు సాయంగా వెళ్లిపోయారా? - దర్శకుడు మారుతి
"మీ పాటలే  మేము నేర్చుకొన్న  పాఠాలు...
మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు... 
బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడని  సాయంగా  ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ, పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ. భరించలేని నిజం చెవులు వింటున్నాయి. కానీ, మనసు ఒప్పుకోవటం లేదు" అని దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు.

Published at : 30 Nov 2021 05:48 PM (IST) Tags: Tollywood Sirivennela is no more Sirivennela Seetharama Sastry Sirivennela Celebs Mourn Sirivennela Demise

సంబంధిత కథనాలు

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!

Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!

Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!

Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !

ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు